మిట్టమీదవారిపాలెం
ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం
మిట్టమీదవారిపాలెం ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
మిట్టమీదవారిపాలెం | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°34′3.108″N 79°55′24.168″E / 15.56753000°N 79.92338000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | సంతనూతలపాడు |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
ఈ గ్రామం మైనంపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
దర్శనీయ ప్రదేశాలు/ఆలయాలు
మార్చుశ్రీ కోదండరామస్వామివారి ఆలయం:- ఈ ఆలయ ఆరవ వార్షికోత్సవం, 2015, మార్చి-12వ తేదీ గురువారం నాడు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. పంచామృతాభిషేకాలు, మండపారాధన, కుంభాభిషేకాలు, ప్రత్యేక హోమాలు నిర్వహించారు. అనంతరం శ్రీ సీతారాముల కల్యాణం కన్నులపండువగా నిర్వహించారు. ఆ తరువాత విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. [2]
మూలాలు
మార్చువెలుపలి లింకులు
మార్చుఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |