సంతనూతలపాడు

ఆంధ్ర ప్రదేశ్, ప్రకాశం జిల్లా లోని గ్రామ పంచాయితీ, మండలకేంద్రం


సంతనూతలపాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక గ్రామ పంచాయితీ, మండల కేంద్రం. [1]

గ్రామం
పటం
Coordinates: 15°32′32″N 79°56′26″E / 15.5423°N 79.9405°E / 15.5423; 79.9405
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంసంతనూతలపాడు మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( 08592 Edit this on Wikidata )
పిన్‌కోడ్523225 Edit this on Wikidata

పటంసమీప గ్రామాలు మార్చు

బొడ్డువారిపాలెం, చండ్రపాలెం, చిలకపాడు, ఎండ్లూరు, యనికపాడు, గుమ్మలంపాడు.

సమీప పట్టణాలు మార్చు

చీమకుర్తి 6.3 కి.మీ, కొండేపి 14.3 కి.మీ, మద్దిపాడు 15.8 కి.మీ, ఒంగోలు 12 కి.మీ.

మౌలిక సదుపాయాలు మార్చు

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం. (PACS)

బ్యాంకులు మార్చు

1.కెనరా బ్యాంక్

2.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

3.ఆంధ్రా ప్రగతి గ్రామీణ బ్యాంక్

4.గతంలో సిండికేట్ కోఆపరేటివ్ బ్యాంక్

5.దేనా బ్యాంక్

సాగు/త్రాగు నీటి సౌకర్యం మార్చు

  • పెద్ద చెరువు.
  • చిన్న చెరువు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

శ్రీ త్రిపురాంతక స్వామి ఆలయం మార్చు

ఈ దేవాలయం అత్యంత పురాతనమైనది. ఈ దేవాలయంలో నిత్యం పూజలు జరుగుచున్నా అవి అంతంత మాత్రమే. చెరువు పొంగినప్పుడల్లా, దేవాలయంలో మోకాలు లోతు నీరు నిలుస్తుంది. ఈ దేవాలయాన్ని 1969లో దేవాదాయ ధర్మాదాయశాఖకు అప్పగించారు. ఈ దేవస్థానం క్రింద ఉన్న 110 ఎకరాల భూమి కౌలుకు, 2002 నుండి బహిరంగ వేలం నిర్వహించుచున్నారు.

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం మార్చు

ఈ ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవాలు, నిర్వహించెదరు. ఈ ఉత్సవాలలో భాగంగా, శనివారం నాడు, ప్రత్యేక హోమాలు నిర్వహించారు. ప్రత్యేకపూజలు నిర్వహించారు. స్వామివారికి గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశస్థాపన, హోమాలు నిర్వహించారు. ఈ రెండవరోజు ఆదివారం నాడు ప్రత్యేకంగా గ్రామోత్సవం నిర్వహించారు.

శ్రీ చెన్నకేశ్వస్వామివారి ఆలయం మార్చు

ఈ ఆలయానికి 45.65 ఎకరాల మాన్యం భూమి ఉంది.

శ్రీ కొండపాటి పోలేరమ్మ అమ్మవారి ఆలయం మార్చు

సంతనూతలపాడు లోని కొత్త ఎస్.సి.కాలనీలో, తొమ్మలకుంట వద్ద వేంచేసియున్న ఈ అమ్మవారి ఆలయ నాల్గవ వార్షికోత్సవం, ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో నిలిపినారు. పోతురాజుకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు చుట్టు ప్రక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసారు. ఈ సందర్భంగా భక్తులకు, గ్రామస్తులకు అన్నసంతర్పన నిర్వహించారు.

శ్రీ అంకమ్మ తల్లి అమ్మవారి ఆలయం మార్చు

స్థానిక రజక పాలెం లోని అంకమ్మ తల్లి ఆలయంలో పొంగళ్ళ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ ఆలయ ప్రథమ వార్షిక ఉత్సవ వేడుకలను మాఘ శుద్ధ నవమి, నాడు ప్రారంభించారు.

శ్రీ సీతా రామాలయం మార్చు

సంతనూతలపాడు లోని పెద్ద బజారులో ఉన్న ఈ ఆలయంలోని సీతారాముల నూతన ఉత్సవ పంచ లోహ విగ్రహాలకు, మహా సంప్రోక్షణ కార్యక్రమం, శ్రీరామనవమి నాడు, శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించెదరు.

శ్రీ కోదండ రామాలయం మార్చు

1913 లో నిర్మించిన ఈ ఆలయానికి, 9 ఎకరాల మాన్యం భూమి ఉంది. ఇంకా పూజారులకు 10 ఎకరాల మాన్యం భూమి ఉంది. 20 గదుల స్థలం ఉంది. ఈ ఆలయం ప్రస్తుతం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో సింగిల్ ట్రస్టీ దేవాదాయ కమిటీ ఆధ్వర్యంలో ఉన్నది.

శ్రీ నాగార్పమ్మ తల్లి ఆలయం మార్చు

ఈ ఆలయంలో ఆశ్వయుజ మాసం, అమ్మవారి కొలుపులు వైభవంగా నిర్వహించారు.

శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయం మార్చు

ఈ ఆలయం స్థానిక జెండా చెట్టు సమీపoలో ఉంది.

శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం మార్చు

ఈ ఆలయ వార్షికోత్సవ వేడుకలను, వైభవంగా నిర్వహించారు.

మూలాలు మార్చు

  1. "గ్రామములు, పంచాయితీలు - ప్రకాశం జిల్లా". District Office, Prakasam District. 2019. Archived from the original on 2019-04-18.