మిణుగురులు అనేది 2014 లో వచ్చిన ఒక తెలుగు సినిమా. ఈ సినిమా కథాంశం ఒక అంధ విద్యార్థుల జీవితంలో జరిగే అన్యాయాల గురించి తెలుపుతుంది.అయోధ్య కుమార్ కృష్ణమశెట్టి ఈ చిత్రానికి నిర్మాత, దర్శకుడు.14 వ అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాలలో ఎంపికైన ఏకైక తెలుగు సినిమా ఇది.

మిణుగురులు
దర్శకత్వంఅయోధ్యకుమార్‌ కృష్ణంశెట్టి
నిర్మాతఅయోధ్యకుమార్‌ కృష్ణంశెట్టి
రచనఎన్.వీ.బీ.చౌదరి , అయోధ్యకుమార్‌ కృష్ణంశెట్టి
నటులుఆశిష్‌ విద్యార్థి,
సుహాసిని,
రఘువీర్‌ యాదవ్‌,
జయవాణి
సంగీతంరాజశేఖర్‌ శర్మ
నిర్మాణ సంస్థ
రెస్పెక్ట్‌ క్రియేషన్స్‌
విడుదల
జనవరి 14, 2014
దేశంభారతదేశం
భాషతెలుగు

చిత్ర కథసవరించు

రాజు అనే 14 ఏళ్ళ బాలుడు ప్రమాదంలో కంటి చూపును కోల్పోతాడు, కొడుకును చూసి అతడు తమ మధ్య నివసించలేడని భావించిన తండ్రి అతడిని ఒక అంధ విద్యార్థుల వసతిగృహంలో వదిలేస్తాడు. ఇక్కడ ఇన్‌చార్జుగా ఉన్న ఆశిష్ విద్యార్థి, తాగుడుకు, జూదాలకు బానిస అయ్యి తప్పు మీద తప్పులు చేస్తూ వాటి నుండి బయటపడటానికి అప్పులు చేస్తూ వాటిని తీర్చుటకు వసతిగృహ నిర్వహణకై వచ్చే నిధులను దుర్వినియోగం చేస్తాడు. అనాథ శరణాలయంలో ఉంటూ ఎన్నో అన్యాయాలను చేస్తున్న సిబ్బందిని గమనించిన రాజు, ఈ విషయాన్ని ఎలాగైనా కలెక్టరుకు చేరవేసి వారి సహాయాన్ని పొందాలనుకుంటాడు. రాజు కనుచూపును కోల్పోకముందు అతనికి వ్రాయడం వచ్చు కనుక ఆ అనుభవంతోటి మిత్రులతో కలిసి ఒక ఉత్తరాన్ని వ్రాసి దానిని రోజూ పాలు పోయడానికి వచ్చే అతడి బాల్య మిత్రుడికి ఇచ్చి జిల్లా కలెక్టరు కార్యాలయానికి చేరవేస్తాడు. విషయం తెలుసుకున్న కలెక్టరు గారు వెంటనే దానిపై నివేదిక ఇవ్వాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశిస్తారు. వెనువెంటనే హాస్టలులో ఇన్స్పెక్షన్ నిర్వహించబడబోతోంది అనే విషయాన్ని తెలుసుకున్న సిబ్బంది జాగ్రత్తపడి తూతూమంత్రంగా ఏర్పాట్లు చేసి పర్యవేక్షణకు వచ్చిన అధికారిని మభ్యపెట్టుటకు ప్రయత్నించి ఇన్‌చార్జ్ విఫలమవుతాడు. ఈ క్రమంలో కొంత ధనంతో అధికారిని ప్రలోభపెట్టి విషయాన్ని పైకి చేరకుండా చేస్తాడు. రాజు తన మిత్రుల బృందం చేసిన యత్నం విఫలం కావడంతో నిరాశకు గురవుతారు. వసతిగృహంలో జరిగే విషయాలను పై అధికారులకు ఉత్తరం వ్రాసింది ఎవరో కనుక్కునే ప్రయత్నంలో ఉన్న ఇన్‌చార్జు కొత్తగా చేరిన రాజే చేసాడని తెలుసుకుని అతడిని చితకబాదుతాడు.

ఆ తరువాత ఒక రోజు పాఠశాలలో ఉపాధ్యాయుడు కాంతి పాఠంలో కెమేరా అంశాన్ని బోధిస్తాడు. ఆ సందర్భంలో కెమేరా ఉంటే ఇక్కడ జరిగే విషయాలను బంధించి వాటిని కలెక్టరు గారికి చేరవేయడం చాలా సులభం అనే ఆలోచన తడుతుంది రాజుకు. అందుకు కెమేరా అవసరమని గ్రహించిన రాజు కెమేరాను పొందే యోచనలో పడతాడు. ఈ విషయాన్ని మిత్రులకు చెబితే వారు ఇది మనవల్ల కాదని రాజుని నిరాశపరుస్తారు. అయితే ఛాయాచిత్రగ్రహణంలో మంచి పట్టువున్న రాజు పట్టువదలని విక్రమార్కుని వలె అందరిని ఒప్పించి అందుకు అవసరమైన కెమేరాను తోటి మిత్రురాలి సహాయంతో పాలుపోసే తన మిత్రుని నుండి సంపాదిస్తాడు. అయితే ఏవిధంగా చిత్రీకరించాలో ముందుగానే సన్నద్ధమైన రాజు, అతని మిత్రబృందం ప్రణాళికా బద్ధంగా ఒక్కొక్క సమస్యను చిత్రీకరించి అది తన బాల్యమిత్రుడైన పాలవాడికి ఇచ్చి అందులో ఉన్న విషయాన్ని డీవీడీగా మార్చి అందజేయమని అభ్యర్థిస్తాడు. ఆ డీవీడీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న వారికి, కేమేరా రికార్డింగులో ఏమీలేదని చెప్పి రాజు మిత్రుడు వాపోతాడు. తన మిత్రుడు అబద్ధం చెప్పాడని గ్రహించిన రాజు గృహం నుండి తప్పించుకుని తన మిత్రుడు ఒకనాడు చెప్పిన గుర్తుల ఆధారంగా అతడిని కలుసుకుని డీవీడీని సేకరించి కలెక్టరు గారి కార్యాలయానికి పయనమవుతారు. కార్య నిమఘ్నులైన కలెక్టరు గారిని అంత తొందరగా కలవడం వీలుపడదు అని తెలుసుకున్న రాజు కార్యాలయ భవనంపైకి చేరి కలెక్టరు గారిని వెంటనే తనను కలిసేలా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా వెనువెంటనే కలెక్టరు గారు బయటికి వచ్చి జరిగిందంతా తెలుసుకుంటారు. వివరాలు తెలుసుకున్న కలెక్టరు గారు అందుకు కారణమైన ఇన్‌చార్జుపై తగు చర్యలు తీసుకుని అక్కడ ఉన్న అంధ విద్యార్థులకు విముక్తి కల్పిస్తారు.

నటవర్గంసవరించు

బయటి లంకెలుసవరించు