జయవాణి (ఉమామహేశ్వరి) తెలుగు టివీ, చలనచిత్ర నటీమణి. 2006లో ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకుంది.

జయవాణి
నాటుకోడి చిత్రం పాటల విడుదల కార్యక్రమం
జననం
ఉమామహేశ్వరి

వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2014 – ప్రస్తుతం
బంధువులుగుమ్మడి చంద్రశేఖర్ రావు (భర్త), ఆలపాటి తిరుపతయ్య (తండ్రి), సుగుణ (తల్లి)

జననం - విద్యాభ్యాసం మార్చు

ఈవిడ ఆలపాటి తిరుపతయ్య, సుగుణ దంపతులకు కృష్ణా జిల్లా, విజయవాడ లో జన్మించింది. బి.ఏ. వరకు చదివింది.

తొలి జీవితం మార్చు

చిన్నప్పటి నుండి సినిమాలపై ఉన్న ఆసక్తితో కూచిపూడి నృత్యం నేర్చుకుంది. జయవాణికి సినిమాల పిప్చి ఎక్కువకావడంతో 10వ తరగతిలోనే గుమ్మడి చంద్రశేఖర్ రావుతో వివాహం జరిగింది. పెళ్ళయిన తరువాత బి.ఏ.చదివి, భర్త సహకారంతో నటిగా మారింది.

సినిమారంగ ప్రస్థానం మార్చు

మొదటగా "రండి లక్షాధికారి కండి" అనే టి.వీ. సీరియల్ లో నటించిన జయవాణి, అనేక చిత్రాలలో చిన్నచిన్న పాత్రలు పోషించింది. విక్రమార్కుడు సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకుంది.[1]

నటించిన చిత్రాల జాబితా మార్చు

 1. ఫిబ్రవరీ 14 నెక్లెస్ రోడ్డు
 2. అదిరిందయ్యా చంద్రం
 3. మా ఆయన సుందరయ్య
 4. అమ్మాయే నవ్వితే
 5. ఎంత బాగుందో
 6. శెభాష్
 7. ప్రియదర్శిని
 8. అల్లరి రాముడు
 9. బాబి
 10. నాగ
 11. ఇందిరా
 12. వాడంతే అదో టైపు
 13. వీడే
 14. శ్వేత నాగు
 15. అవునన్నా కాదన్నా
 16. అదిరిందయ్యా చంద్రం (2005)
 17. ఛత్రపతి
 18. యమదొంగ
 19. ప్రయాణం
 20. తాళి కడితే తోంభై కోట్లు
 21. ఈ వయసులో
 22. ప్రేమరాజ్యం
 23. కన్నడ పాపి
 24. మిస్టర్ గిరీశం (2009)
 25. అ ఆ ఇ ఈ
 26. నందీశ్వరుడు
 27. వసుంధర నిలయం (2013)
 28. కామెడి ఎక్స్ ప్రెస్
 29. సాదు
 30. గాయత్రి
 31. నా స్టయిల్ వేరు
 32. భధ్రకాళి[2]
 33. అదృశ్యం[3]
 34. ఇంట్లో దెయ్యం నాకేం భయం (2016)[4]
 35. ఊల్లాల ఊల్లాల (2020)
 36. టెంప్ట్ రాజా (2020)
 37. ఉమాపతి (2023)

మూలాలు మార్చు

 1. "Jayavani".
 2. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి - సినిమా కబుర్లు (2 May 2018). "దైవభక్తి... దుష్టశక్తి!". Archived from the original on 5 May 2018. Retrieved 27 May 2019.
 3. ఆంధ్రప్రభ, సినిమా (14 January 2019). "థ్లిల్ల‌ర్ గా అదృశ్యం…". Archived from the original on 27 మే 2019. Retrieved 27 May 2019.
 4. "Intlo Deyyam Nakem Bhayam (Cast & Crew)". Telugu Mirchi.com. Archived from the original on 2020-01-31. Retrieved 2020-01-31.
"https://te.wikipedia.org/w/index.php?title=జయవాణి&oldid=4080861" నుండి వెలికితీశారు