ఆర్.సి.యం. రాజు
ఆర్.సి.యం. రాజు (ఆర్. చంద్రమోహన్ రాజు) రంగస్థల నటుడు, డబ్బింగ్ కళాకారుడు. 2021లో జరిగిన తెలుగు టీవీ డబ్బింగ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలలో ఆర్.సి.యం. రాజు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఈ నూతన కార్యవర్గం 2023 వరకు ఉంటుంది.[1]
ఆర్.సి.యం. రాజు | |
---|---|
జననం | ఫిబ్రవరి 29 వనపర్తి, వనపర్తి జిల్లా,తెలంగాణ |
నివాస ప్రాంతం | హైదరాబాద్, తెలంగాణ |
ప్రసిద్ధి | రంగస్థల నటుడు, దర్శకుడు, డబ్బింగ్ కళాకారుడు |
తండ్రి | ఆర్. సుబ్బరాజు (రిటైర్డ్ ఎస్సై) |
తల్లి | జయమ్మ |
జననం
మార్చుఫిబ్రవరి 29న సుబ్బరాజు (రిటైర్డ్ ఎస్సై), జయమ్మ దంపతులకు వనపర్తి జిల్లా, వనపర్తి లో జన్మించాడు.
విద్యాభ్యాసం - గురువులు
మార్చుఆర్.సి.యం. రాజు డిగ్రీ వరకు వనసర్తిలో చదివాడు. అనంతరం హైదరాబాద్ కి వచ్చి ఉస్మానియా విశ్వవిద్యాలయం లోని రంగస్థల కళలశాఖలో పి.జి. డిప్లొమా... తెలుగు విశ్వవిద్యాలయం లోని రంగస్థల కళలశాఖలో, మిమిక్రీలో పి.జి. డిప్లొమా చేశాడు.
కళారంగంలో ఆర్.సి.యం. రాజుకు తొలి గురువు వనసర్తికి చెందిన జి. పుల్లయ్య. అనంతరం డా. ప్రదీప్ కుమార్, డా. ప్రసాద్, వినోద్ బాల, తల్లావజ్ఝుల సుందరం, మల్లాది గోపాలకృష్ణ వంటి నాకరంగ ప్రముఖుల దగ్గర శిక్షణ పొందాడు. డా. నేరెళ్ళ వేణుమాధవ్ దగ్గర మిమిక్రీలో మెళకువలు నేర్చుకున్నాడు.
వివాహం - పిల్లలు
మార్చుఆర్.సి.యం. రాజు కు ఉమారాణితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు (తనీష్), ఒక కుమార్తె (శ్రీ తనీష). వీరుకూడా డబ్బింగ్ లు చెబుతున్నారు.
రంగస్థల ప్రస్థానం
మార్చుచిన్నప్పుడే స్టేజ్ షోలు, కాలేజ్ టైమ్‌లో మిమిక్రీ షోలు చేయడంతోపాటు ఒక ఆర్కెస్ట్రా కూడా నడిపాడు. ఉపన్యాస పోటీలలో మొదటి బహుమతి సాధించేవాడు. స్కూల్ వయసులోనే సినీనటులను అనుకరించేవాడు. ఇతని గాత్రానికి ఎక్కువగా ప్రశంసు వస్తుండేవి. ఆర్.సి.యం. రాజు గురువు జి. పుల్లయ్య, రాజులోని కళాకారుణ్ణి ప్రోత్సహించాడు. వనపర్తిలో 10వ తరగతి చదువుతున్న సమయంలో మణిపురిలోని ఇంఫాల్ లో జరిగిన ఎన్.సి.సి. క్యాంప్ లో దుర్యోధన ఏకపాత్రాభినయాన్ని అభినయించి, ప్రథమ బహుమతి అందుకున్నాడు.
1997లో బెంగళూరులో జరిగిన యూత్ ఫెస్టివల్ లో ప్రదర్శించిన సారీ గాంధీ నాటికకు దర్శకత్వం వహించి, ఉత్తమ దర్శకుడి అవార్డు పొందాడు. 1998లో కేరళలోని కొట్టాయంలో జరిగిన యూత్ ఫెస్టివల్ లో ఆర్.సి.యం. రాజు దర్శకత్వంలో ప్రదర్శించబడిన కాలుష్యభూతం నాటిక జాతీయస్థాయిలో ఐదవ స్థానాన్ని దక్కించుకుంది.
డబ్బింగ్ కళాకారుడిగా
మార్చుఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నప్పుడే ఆలిండియా రేడియో నుండి ‘యువవాణి’ కార్యక్రమానికి ఆడిషన్స్‌కి వెళ్ళాడు.
టి.వి. సీరియల్స్
మార్చు1999లో ఋతురాగాలు ధారావాహికలో నగేష్ కర్ర పాత్రకు డబ్బింగ్ చెప్పడంతో డబ్బింగ్ కళాకారుడిగా జీవితాన్ని ప్రారంభించి, దాదాపు 200 సీరియల్స్ లో 10000 పైగా ఎపిసోడ్స్ కి డబ్బింగ్ చెప్పాడు.[2]
సినిమాలు
మార్చుఆటోడ్రైవర్ సినిమా డబ్బింగ్ శాఖలో పనిచేసి, ఆనందం సినిమాలోని వెంకట్ పాత్రకు తొలిసారిగా డబ్బింగ్ చెప్పాడు. దాదాపుగా 800 సినిమాల్లో హీరోలు, విలన్లకు డబ్బింగ్ చెప్పాడు.[3]
నటుడిగా
మార్చు2021: ఆడవాళ్ళు మీకు జోహార్లు
2021: రెడ్
అవార్డులు
మార్చునంది అవార్డులు
మార్చుసీరియల్స్
మార్చు- మొదటి టి.వి. నంది అవార్డు - (2008) పురాణగాధలు (రచన. నాగబాల సురేష్ కుమార్)
- రెండవ టి.వి. నంది అవార్డు - (2010) మొగలిరేకులు (దర్శకత్వం. మంజులా నాయుడు)
సినిమాలు
మార్చు- నంది ఉత్తమ డబ్బింగు కళాకారుడు గా మెదటి నంది అవార్డు - (2010) డార్లింగ్ సినిమాలో ముఖేష్ రిషి పాత్రకు[4]
- నంది ఉత్తమ డబ్బింగు కళాకారుడుగా రెండవ నంది అవార్డు - (2011) పోరు తెలంగాణ సినిమాలో మహ్మద్ జమా పాత్రకు
- నంది పురస్కారం - 2012 నంది పురస్కారాలు: డబ్బింగు కళాకారుడు (మిణుగురులు)[5][6][7][8]
ఇతర అవార్డులు
మార్చు- సినీగోయర్స్ అవార్డు - 2004, 2005
- అరుణోదయ ఆర్ట్ క్రియేషన్ అవార్డు - 2004, 2005
- ఉగాది పురస్కారం - 2006 (వంశీ ఇంటర్నేషనల్)
- కోహినూర్ అవార్డు - 2014[9]
పదవులు
మార్చు- 2004-2006: ప్రధాన కార్యదర్శి, ఎ.పి. మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్స్ యూనియన్
- అధ్యక్షులు (డబ్బింగ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్)
బిరుదులు
మార్చు- స్వరసామ్రాట్ (భారత్ కల్చరల్ అకాడమీ)[10]
మూలాలు
మార్చు- ↑ "ఘనంగా టీవీ డబ్బింగ్ కళాకారుల సంఘం నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం". EENADU. 2021-12-13. Archived from the original on 2021-12-13. Retrieved 2021-12-14.
- ↑ సాక్షి, హోం (12 August 2013). "ఎస్పీ బాలుకి డబ్బింగ్ చెప్పాలనేది నా డ్రీమ్! - ఆర్.సి.ఎం.రాజు". Archived from the original on 29 February 2020. Retrieved 29 February 2020.
- ↑ నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (12 April 2020). "స్వరమే వరం". ntnews. Archived from the original on 15 April 2020. Retrieved 15 April 2020.
- ↑ తెలుగువే2మూవీస్, న్యూస్ (5 August 2011). "Nandi Awards Winners List -2010". telugu.way2movies.com. Archived from the original on 22 December 2013. Retrieved 29 February 2020.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 29 June 2020.
- ↑ మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 29 June 2020.
- ↑ సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 29 June 2020.
- ↑ నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 29 June 2020.
- ↑ టి మసాల. "బాబుమోహన్ కు హస్యనట బిరుదు". tmasala.com. Retrieved 9 January 2017.[permanent dead link]
- ↑ స్వరసామ్రాట్ ఆర్.సి.యం. రాజు, బంగారు తంగేడు, మే-జూలై 2016 (త్రైమాసిక పత్రిక), పుట. 37-40