అడవిఆముదం నూనె

(జట్రొఫా నూనె నుండి దారిమార్పు చెందింది)

అడవి ఆముదము చెట్టు పొదవలె పలు కొమ్మలు కలిగున్న చెట్టు. ఈచెట్టు వృక్షశాస్త్ర నామం జట్రొఫ కుర్‍కస్ (jatropha curcas). ఈ చెట్టులో పలు రకాలున్నాయి. ఈచెట్టు యుఫోర్బియేసి కుటుంబానికి చెందినది. ఈచెట్టు దక్షిణామెరికాకు చెందినది . పొర్చుగీసుల ద్వారా ఆఫ్రికా, ఆసియాదేశాలకు వ్యాప్తిచెందినది [1] వ్యవసాయానికి అనువుకాని నేలల్లో, బంజరు నేలలో, వర్షపాతం తక్కువ వుండు ప్రాంతాలలో పెంచుటకు అనువైన చెట్టు. నీటిఎద్దడిని తట్టుకొని పెరిగే మొక్క. భారతదేశంలో బయోడిసెల్ ఉత్పత్తికై ఈచెట్టు నూనెను ఉపయోగించుటకై వ్యవసాయానికి అనుకూలంగాని నేలలో సాగుచేయుటకై ప్రోత్యహిస్తున్నది భారతప్రభుత్వం.

మొక్క
మగపూలు
ఆడ పూలు
కాయలు
గింజలు

ఇతరభాషలలో వ్యవహారిక పేర్లు[2]

మార్చు

భారతదేశంలో సాగుకు అనుకూలమైన రాష్ట్రాలు[3]

మార్చు

ఈ చెట్లు భారత దేశమంతటా వ్యాప్తి చెందివున్నప్పటికి ఎక్కువఎకరాలలో సాగుకు అవసరమైన భూములను ఈదిగువ పేర్కొన్న రాష్ట్రాలలో గుర్తించారు.

నూనెను ఉత్పత్తిచెయ్యుట

మార్చు

విత్తనములో నూనె30-40% వరకుండును. కాయలను చక్కి (chakki) లేదా డికార్టికేటరు యంత్రాలలో ఆడి పైపొట్టును తొలగించి విత్తనాన్ని వేరుగా పొందెదరు.విత్తనాలను స్టీముద్వారా కుకింగ్‍చేసి ఎక్సుపెల్లరు నూనె యంత్రాలలో[4] ఆడించి, నూనెను ఉత్పత్తి చేయుదురు. గింజలనుండి ఎక్కువశాతం నూనె దిగుబడి పొందుటకై గింజలను యంత్రంలో డబుల్‍ క్రషింగ్ చేయుదురు. కేకులో మిగిలిన నూనెను సాల్వెంట్ పరిశ్రమలో ప్రాసెసెస్‍చేసి పొందెదరు. ఎక్సుపెల్లరులో ఆడినప్పుడు 29%వరకు రికవరి వుండును. సాల్వెంట్ఎక్సుట్రాక్షన్ ప్లాంట్ ద్వారా 39% వరకు రికవరి వుండు ను.

నూనె గుణగణాలు

మార్చు

అడవి ఆముదం నూనెయొక్క గుణగణాలు (భౌతిక, రసాయనిక లక్షనాలు, కొవ్వు ఆమ్లాల సమ్మేళనం వేరుశనగ నూనెను పోలి వున్నప్పటికి, ఈనూనెలో వున్నకొన్ని టాక్సినుల వలన ఇది ఖాద్యతైలం కాదు.

అడవిఆముదం/జట్రోఫా నూనెలోని కొవ్వు ఆమ్లంలశాతం[5]

ఫ్యాటి ఆమ్లాలు శాతం
మిరిస్టిక్ ఆమ్లం 0.5-1.4
పామిటిక్‌ ఆమ్లం 15.3874
స్టియరిక్ ఆమ్లం 6.26
అరచిడిక్ ఆమ్లం 2.5-6
ఒలిక్ ఆమ్లం 44.9
లినొలిక్ ఆమ్లం 43.40
మొత్తం అసంతృప్త ఆమ్లాలు 75.64
మొత్తం సంతృప్త ఆమ్లాలు 24.36

అడవిఆముదం/జత్రోఫా నూనె భౌతికలక్షణాల పట్టిక[5]

భౌతిక లక్షణాలు మితి
వక్రీభవన సూచిక 400Cవద్ద 1.496,280Cవద్ద
విశిష్ట గురుత్వం 30/300C 0.913,280Cవద్ద
అయోడిన్ విలువ 104.46
సపనిఫికెసను విలువ 175.12
అన్‌సఫొనిపియబుల్ పదార్థం 1.5-2.0% గరిష్ఠం
హైడ్రొక్ష్యిల్ విలువ 15 గరిష్ఠం
తేమశాతం 0.5% గరిష్ఠం
  • ఐయోడిన్‌విలువ:ప్రయోగశాలలో 100 గ్రాముల నూనెచే గ్రహింపబడు ఐయొడిన్‌ గ్రాముల సంఖ్య. ప్రయోగ సమయంలో ఫ్యాటిఆసిడుల ద్విబంధమున్న కార్బనులతో ఐయోడిను సంయోగంచెంది, ద్విబంధాలను తొలగించును. ఐయోడిమ్ విలువ అసంతృప్త ఫ్యాటిఆసిడ్‌లు ఏమేరకు నూనెలో వున్నది తెలుపును.
  • సపొనిఫికెసను విలువ: ఒక గ్రాము నూనెలోని ఫ్యాటి ఆసిడులను సబ్బుగా (saponification) మార్చుటకు కావలసిన పోటాషియంహైదృఆక్సైడ్, మి.గ్రాంలలో.
  • అన్‌సపొనిఫియబుల్‌ మేటరు: పోటాషియం హైడ్రాక్సైడుతో సపొనిఫికెసను చెందని నూనెలో వుండు పదార్థంలు. ఇవి అలిపాటిక్‌ ఆల్కహల్‌లు, స్టెరొలులు, హైడ్రొకార్బనులు, రంగునిచ్చు పదార్థాలు (pigments), రెసినులు.

నూనె ఉపయోగాలు

మార్చు
  • బయోడిసెల్ ఉత్పత్తిలో ఉపయోగించెదరు.[6]
  • కొవ్వొత్తులతయారి పరిశ్రమలలో, సబ్బులతయారి పరిశ్రమలో[7]
  • లుబ్రికెంట్ల తయారిలో
  • అల్కైడ్‍ల (Alkyds) తయారి పరిశ్రమలలో

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. http://www.jatrophabiodiesel.org/aboutJatrophaPlant.php Archived 2013-11-12 at the Wayback Machine.
  2. http://www.flowersofindia.net/catalog/slides/Physic%20Nut.html
  3. SEAHandBook-2009,By The Solvent Extractors' Association of India
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-04-24. Retrieved 2013-10-28.
  5. 5.0 5.1 http://www.ijabpt.com/pdf/60018-Rakesh[permanent dead link][1].pdf
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-08-26. Retrieved 2013-10-28.
  7. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-10-06. Retrieved 2013-10-28.