పామ్‌కెర్నల్ నూనె

(పామ్‌కెర్నల్‌ నూనె నుండి దారిమార్పు చెందింది)

పామ్‌ కెర్నల్‌నూనె/కొవ్వు (Palm kernel oil/fat) : పామ్‌పళ్లలోని గుజ్జు (mesocarp) నుండి పామాయిల్ ఉత్పత్తికాగా, పామ్‌ గింజనుండి పామ్‌కెర్నల్‌ నూనె/కొవ్వు ఉత్పత్తి అగును. పామ్‌కెర్నల్‌ కొవ్వు ఖాద్యతైలం. పామ్ పళ్లనుండి పామాయిల్, పామ్‌కెర్నల్‌ కొవ్వు ఉత్పత్తి అయ్యి నప్పటికి, రెండింటిలోని కొవ్వుఆమ్లాలు, వాటి భౌతిక ధర్మాలు వేరువేరుగా వుండును. రెండింటిలోను సంతృప్త కొవ్వుఆమ్లాలు అధికశాతంలో వున్నప్పటికి, పామాయిల్‌లో పామాటిక్‌ ఆసిడ్ (40-45%), పామ్‌ కెర్నల్‌ కొవ్వులో లారిక్‌ ఆసిడ్ (50-5%) వరకు వుండును. పామ్‌కెర్నల్ కొవ్వు అయోడిన్ విలువ 17-20 మధ్య వుండటం వలన తక్కువ ఉష్ణోగ్రత వద్ద గడ్డకట్టును.[1]

పామ్ విత్తనం(seed/nut)

మార్చు
 
నూనె తీసిన పామ్‌కెర్నల్ కేకు

పామ్ పళ్లలో గింజ 25-30% వరకు వుండును. విత్తనం పైన బ్రౌన్‌రంగులో గట్టి పెంకు (shell) వుండును.లోపలమెత్తటి గింజ (kernel) వుండును.మొత్తం నట్‌లో కొవ్వుశాతం 25-30% వరకు, కేవలం గింజ/పిక్కలో 40% వరకు కెర్నల్‌కొవ్వు వుండును. నట్‌ గోళాకారంగా వుండి, పై భాగం కొద్దిగా సాగినట్లు వుండును. సన్నని నూగు వంటిది నట్‌సెల్‌ పైవుండును. నట్‌లో పెంకు శాతం30-40% వరకు వుండును. కెర్నల్‌ నుండి కొవ్వును పైనున్నపెంకును తొలగించి (decorticated) కాని లేదా యధాతతంగా కొవ్వును తీయుదురు. పామాయిల్ మిల్‌నుండి సేకరించిన నట్లను (nuts) మొద్దట శుభ్రంచేసి, ఆరబెట్టి తేమ శాతాన్ని తగ్గించెదరు. తేమశాతం 6-7% వున్నచో మంచిది. మొత్తం సీడును క్రష్‌చేసినచో 14-16% కొవ్వు దిగుబడి వచ్చును, కేకులో 10-12% వరకు నూనె/కొవ్వు వుండిపోవును. విత్తనాలను మొదట రోస్టరులో రోస్ట్ చేసి, డికార్డ్‌కేటరు యంత్రం ద్వారా విత్తనం పైనున్న పెంకును తొలగించెదరు. పెంకు తొలగించిన విత్తనాలను హెమరు మిల్లుసహాయంతో చిన్నముక్కలుగా చేసెదరు. ఈ విత్తన ముక్కలను స్టీముద్వారా వేడిచేసి ఎక్సుపెల్లరు యంత్రంలో ఆడింది నూనెను తీయుదురు. పెంకును తొలగించివిత్తనాన్ని క్రష్‌చేసినచో 35% వరకు ఆయిల్‌ రికవరి వుండును. కెర్నల్‌నుండి సాధారణంగా మొదట ఎక్స్‌పెల్లరుల ద్వారా క్రష్‌చేసి కొవ్వును తీయుదురు. కేకులో మిగిలివున్న నూనె/కొవ్వును సాల్వెంట్‌ ప్లాంట్‌ ద్వారా తీయుదురు. కొందరు కెర్నల్‌ను ఫ్లేక్స్‌గా చేసి మొత్తం కొవ్వును సాల్వెంట్‌ప్లాంట్‌ ద్వారా తీయుదురు. ఆఫ్రికాలోని గ్రామీణ ప్రాంతాలలో గానుగ నుపయోగించెదరు.[2] పామ్‌కెర్నల్‌కేకులో ప్రోటిన్‌16-18% వరకు, డి్‌ఆయిల్డ్‌కేకులో 19-20% వరకు ప్రోటిన్ వుండును. పశువులదాణాగా, కోళ్ళదాణాగా వుపయోగిస్తారు.

పామ్‌కెర్నల్‌కొవ్వు

మార్చు

పామ్ గింజ కొవ్వు పోలిపోయిన పసుపు రంగులో లేదా వర్ణరహితంగా వుండును.కొబ్బరినూనె వలె ఇది లారిక్‌ కొవ్వుఆమ్లాన్ని ఎక్కువ ప్రమాణంలో కలిగివున్నందున కొబ్బరినూనె వంటి వాసన వచ్చును. కొబ్బరినూనెకు, పామ్‌గింజనూనెకు పోలికలు చాలా దగ్గరిగా న్నాయి.

పామ్‌కెర్నల్‌కొవ్వు భౌతిక, రసాయనిక లక్షణాలు[3]

లక్షణము/గుణం మితి
సాంద్రత 0.899-0.914
వక్రీభవనసూచిక (250C) 1.448-1.452
ఐయోడిన్‌విలువ 16.0-20.0
సపొనిఫికెసను విలువ 230-254
అన్‌సపొనిఫియబుల్ పదార్థం (గరిష్ఠం) 1.2%
పెరాక్సైడ్ విలువ (mg/KOH/g) 2.90-2.96
జారు ద్రవీభవన ఉష్ణోగ్రత 26-300C

కొవ్వుఆమ్లాల శాతం[3]

కొవ్వుఆమ్లంపేరు కార్బనుల సంఖ్య:బంధాలు శాతం
సంతృప్త కొవ్వుఆమ్లాలు
కాప్రిలిక్‌ ఆమ్లం C8:0 3.0-4.0
కాప్రిక్ ఆమ్లం C10:0 3.0-4.0
లారిక్ ఆమ్లం C12:0 48-50
మిరిస్టిక్ ఆమ్లం C14:0 14-16
పామిటిక్ ఆమ్లం C16:0 8.0-10.0
స్టియరిక్ ఆమ్లం C18:0 2.5-3.0
అసంతృప్త కొవ్వుఆమ్లాలు
ఒలిక్ ఆమ్లం C18:1 14-16
లినొలిక్ ఆమ్లం C18:2 2.0-2.5

కొబ్బరినూనె-పామ్‌కెర్నల్‌ఫ్యాట్‌ పోలికలు

కొబ్బరి నూనె పామ్‌కెర్నల్‌ఫ్యాట్
సాంద్రత 0.915-0.920 0.899-0.901
ఐయోడిన్‌విలువ 6-11 14-19
సపోనిఫికెసన్‌విలువ 250 245-247
ద్రవీభవన ఉష్ణోగ్రత 250C 250C
స్మోక్‌పాయింట్ 2300C 230) C
అన్‌సపోనిఫియబుల్ <1.0 1.2
కొవ్వుఆమ్లాల శాతం
కాప్రొయిక్‌ఆసిడ్ <1.0
కాప్రిలిక్‌ఆసిడ్ 7-8 3.0-4.0
కాప్రిక్‌ఆసిడ్ 6-7 3.0-4.0
లారిక్‌ఆసిడ్ 45-50 48-50
మిరిస్టిక్‌ఆసిడ్ 18-20 14-16
పామిటిక్‌ఆసిడ్ 8-9 8-10
స్టియరిక్‌ఆసిడ్ 2.0-3.0 2.5-3.0
ఒలిక్‌ఆసిడ్ 6-7 14-16
లినొలిక్‌ఆసిడ్ 1.5-2.0 2.0-2.5

వినియోగం

మార్చు
  • కొబ్బరి నూనెను పోలి వుండటం వలన పామ్‌కెర్నల్‌ కొవ్వును కొబ్బరినూనెకు ప్రత్యామ్నయంగా వుపయోగించెదరు.
  • వనస్పతి తయారిలో వుపయోగిస్తారు.
  • 'మార్గరిను (margarine) 'ల తయారిలో వుపయోగుస్తారు.
  • క్రిమ్‌బిస్కత్తుల, సబ్బులతయారిలో వాడెదరు.
  • ఐస్‌క్రీమ్‌, చాకొలెట్‌లతయారిలో, తీపిమిఠాయిలతయారిలో వినియోగిస్తారు.

మార్గరిన్ (margarine) :మార్గరిను అనేది వెన్న (Butter) కు ప్రత్యామ్నాయంగా తయారుచేసింది. దీనినే టేబుల్‌బట్టరు అనికూడా అంటారు. మార్గరినులో 80% వరకు వనస్పతి (hydrogenated fat),12-15%నీరు (తేమగా, మిగిలినది రిపైండ్‌నూనె.రిపైండ్‌నూనె ఒకటి, లేదా అంతకు ఎక్కువ రకాలు చేర్చివుండవచ్చును. మార్గరిన్‌ను బేకరిఉత్పత్తులలో, కేకులో తయారిలో వుపయోగిస్తారు.

మార్గరినుకుండవలసిన భౌతిక, రసాయనిక లక్షణాల పట్టిక

లక్షణం మితి
ద్రవీభవన ఉష్ణోగ్రత 37-410C
వక్రిభవన విలువ (బుట్రొమీటరురిడింగ్) 40.0కు తగ్గకుండ
అన్‌సపొనిఫియబుల్‌పదార్థం 1.5%మించకుండ
ఫ్రీఫ్యాటీఆమ్లం% (ఒలిక్‌అసిడ్‌గా) 1.5% మించరాదు
బౌడిన్‌టెస్ట్ 2.5 రెడ్‌యూనిట్లకు తగ్గరాదు
సింథటిక్‌విటమిన్'A' 30.0 I.U.తగ్గరాదు

ఇవికూడా చూడండి

మార్చు

ఉల్లేఖనం/మూలాలు

మార్చు
  1. "OIL PALM". fao.org. Retrieved 2015-03-08.
  2. "Palm kernel cake extraction and utilisation in pig and poultry diets in Ghana". lrrd.org. Retrieved 2015-03-08.
  3. 3.0 3.1 "Organic Palm Kernel Oil, Refined" (PDF). cibaria-intl.com. Retrieved 2015-03-08.[permanent dead link]