మిలియన్ మార్చ్ తెలంగాణ ఉద్యమ కాలంలో 2011 మార్చి 10 న ప్రజలందరు కలిసి అద్భుతంగా విజయవంతం చేసిన కార్యక్రమం మిలియన్ మార్చ్. ఉద్యమకారులకు, ప్రజలకు అదో మానసిక స్థైర్యాన్ని ఇచ్చింది. తెలంగాణా జే ఎ సి మిలియన్ మార్చ్ కు పిలుపునిచ్చింది. తొలుత మిలియన్ మార్చ్ ను చాలా భారీ ఎత్తున జరపాలనేది తెలంగాణ జేయేసీ వ్యూహం. అయితే మార్చి 10 న జరగవలసిన ఇంటర్ మీడియట్ పరీక్షను వాయిదా వేస్తామని మాట ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, తరువాత పరీక్ష వాయిదా వెయ్యలేదు. దీంతో మిలియన్ మార్చ్ ను కొంచెం వెనకకు జరుపుదామని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతిపాదించింది. అయితే జేయేసీలోని బీజేపీ, సీ.పీ.ఐ. ఎం.ఎల్, ఇతర ఉద్యోగ, ప్రజా సంఘాలు మాత్రం ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవద్దని గట్టిగా పట్టుబట్టాయి. దీనితో ప్రొ. కోదండరాం ఆధ్వర్యంలో జేయేసి ఒక రోజంతా చర్చించి చివరికి మధ్యేమార్గంగా మిలియన్ మార్చ్ ను ఒక ర్యాలీ రూపంలో జరపాలని నిర్ణయించాయి. ప్రజల నుంచి మిలియన్ మార్చ్ ప్రచారానికి అపూర్వ స్పందన రావడంతో టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వామపక్షాలు కూడా కలసికట్టుగా కదిలాయి. తెలంగాణ ఉద్యమ చరిత్రలో మిలియన్ మార్చ్ ది ఓ ప్రత్యేక స్థానం. మిలియన్ మార్చ్ పూర్వపరాలను పల్లెల్లో ఈ పిలుపు ఇచ్చిన స్పందనను పెద్దింటి అశోక్ కుమార్ తన లాంగ్ మార్చ్ నవలలో వివరంగా రాశారు.

ప్రొ. కోదండరాం, తెలంగాణ జేయేసి

నిర్బంధం

మార్చు

2011 మార్చి 10న మార్చ్ చేసేందుకు ఉద్యమకారులు ముందస్తు వ్యూహాలు సిద్దం చేసుకున్నారు. మార్చ్ ను ఫెయిల్ చేయాలని ప్రభుత్వం నిర్భంధాన్ని ప్రయోగించింది. జిల్లాల బార్డర్లలో పోలీసుల దిగ్భంధాలు, అడ్డంకులు, బ్యారికేడ్లు, ఇనుపకంచెలూ తెలంగాణ వాదులను ఆపలేకపోయాయి. హైదరాబాదు నగరమంతా పోలీసులను, పారామిలటరీ బలగాలను మోహరించినా ఫలితం లేకుండా పోయింది. ఇంటలిజెన్స్ వర్గాలు పసిగట్టలేనంత పక్కాగా ప్లాన్ చేసుకున్నారు తెలంగాణ వాదులు. ఇందిరా పార్కు ప్రాంతం లోని ఓ ఫంక్షన్ హాల్ లో పెళ్ళి ఏర్పాట్లు చేసుకుని పెళ్ళి బృందంలా ట్యాంక్ బండ్ పైకి వచ్చారు [1]మధ్యాహ్నం వరకే 10 తెలంగాణ జిల్లాల్లో పోలీసుల నిర్బంధం తీవ్రమైంది. మొత్తం తెలంగాణలో 1,00,000 మంది ప్రజలను ముందస్తుగా అదుపులోకి తీసుకోగా, ఒక్క హైదరాబాదులోనే 11,000 మందిని అరెస్టు చేశారు .

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-03-13. Retrieved 2018-03-12.