మీకు మాత్రమే చెప్తా

షమ్మీర్ సుల్తాన్ దర్శకత్వంతో 2019లో విడుదలైన చలనచిత్రం.

మీకు మాత్రమే చెప్తా 2019, నవంబరు 1న విడుదలైన తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా. కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ దేవరకొండ నిర్మించిన ఈ చిత్రానికి షమ్మీర్ సుల్తాన్ దర్శకత్వం వహించాడు. తరుణ్ భాస్కర్ దాస్యం, వాణి భోజన్ ప్రధాన పాత్రల్లో నటించారు.[1][2] ఈ సినిమాకు శివకుమార్ సంగీతం అందించగా, మ‌ద‌న్ గుణ‌దేవా సినిమాటోగ్రఫీ చేశాడు.[3] నిర్మాతగా విజయ్ కు, దర్శకుడిగా షమ్మీర్ కు ఇది తొలిచిత్రం.[4]

మీకు మాత్రమే చెప్తా
మీకు మాత్రమే చెప్తా సినిమా పోస్టర్
దర్శకత్వంషమ్మీర్ సుల్తాన్
రచనషమ్మీర్ సుల్తాన్
నిర్మాతవర్ధన్ దేవరకొండ
విజయ్ దేవరకొండ
తారాగణంతరుణ్ భాస్కర్ దాస్యం
వాణి భోజన్
అభినవ్ గోమఠం
నవీన్ జార్జ్ థామస్
అనసూయ భరధ్వాజ్
అవంతిక మిశ్రా
ఛాయాగ్రహణంమ‌ద‌న్ గుణ‌దేవా
కూర్పుశ్రీజిత్ సారంగ్
సంగీతంశివకుమార్
నిర్మాణ
సంస్థలు
విజయ్ దేవరకొండ ప్రొడక్షన్
కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్
పంపిణీదార్లుగ్లోబల్ సినిమాస్
విడుదల తేదీs
1 నవంబరు, 2019
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

చిన్న‌నాటి స్నేహితులైన రాకేష్‌ (త‌రుణ్ భాస్క‌ర్‌), కామేష్‌ (అభిన‌వ్ గోమ‌ఠం) ఒక టీవీ ఛానెల్‌లో ప‌నిచేస్తుంటారు. రాకేష్‌ ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి సిద్ధమవుతాడు. అన్ని అల‌వాట్లున్న రాకేష్, ప్రేమ కోసం తనకు కాబోయే భార్యకు అబద్ధం చెబుతాడు. పెళ్లికి ముహూర్తం నిర్ణయిస్తారు. సరిగ్గా అప్పుడే రాకేష్ న‌టించిన ఒక ఆగిపోయిన సినిమాలోని ఒక బూతు వీడియో ఆన్‌లైన్‌లో లీక్ అవుతుంది. పెళ్లి రెండు రోజుల ముందు ఆ వీడియో లీక్ కావ‌డంతో త‌న పెళ్లి ఎక్క‌డ ఆగిపోతుందోన‌ని భ‌య‌ప‌డ‌తాడు. అదే స‌మ‌యంలో త‌న స్నేహితులు కామేష్‌, పాపాతో క‌లిసి హ్యాక‌ర్‌ను క‌నిపెట్టే ప్ర‌య‌త్నం చేస్తారు. చివ‌ర‌కు వీడియో ఉన్న లింక్‌ను హ్యాక్ చేసి డిలీట్ చేశారా? అస‌లు ఆ వీడియో అప్‌లోడ్ చేసిందెవ‌రు? ఆ వీడియో కార‌ణంగా రాకేష్ ఎలాంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొన్నాడ‌నేది మిగతా కథ.[5]

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

 • రచన, దర్శకత్వం: షమ్మీర్ సుల్తాన్
 • నిర్మాత: వర్ధన్ దేవరకొండ, విజయ్ దేవరకొండ
 • సంగీతం: శివకుమార్
 • ఛాయాగ్రహణం: మ‌ద‌న్ గుణ‌దేవా
 • కూర్పు: శ్రీజిత్ సారంగ్
 • నిర్మాణ సంస్థ: విజయ్ దేవరకొండ ప్రొడక్షన్, కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్
 • పంపిణీదారు: గ్లోబల్ సినిమాస్

విడుదల మార్చు

ఈ చిత్ర అధికారిక టీజర్ ఆదిత్యా మ్యూజిక్ ద్వారా 2019, సెప్టెంబరు 6న విడుదల అయింది.[7] 2019, అక్టోబరు 16న ఈ చిత్ర అధికారిక ట్రైలర్ ను మహేష్ బాబు విడుదల చేశాడు.[8]

పాటలు మార్చు

మీకు మాత్రమే చెప్తా
పాటలు by
శివకుమార్
Releasedఅక్టోబరు 5, 2019
Recorded2019
Studioజూబ్లీ 10 స్టూడియోస్, హైదరాబాద్
త్రినిటి వేవ్స్, చెన్నై
Genreసినిమా
Languageతెలుగు
Labelఅదిత్యా మ్యూజిక్

ఈ చిత్రానికి శివకుమార్ సంగీతం అందించగా రాక్కేండు మౌళి, షమ్మీర్ సుల్తాన్, అసుర పాటలు రాసారు.

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "లా లా లా (రచన: రాక్కేండు మౌళి)"  హేమచంద్ర, కృష్ణన్ గణేషన్, ఉమా నేహా 2:56
2. "చాలు చాలు (రచన: షమ్మీర్ సుల్తాన్, రాక్కేండు మౌళి)"  అనురాగ్ కులకర్ణి 3:16
3. "అబద్దం (రచన: అసుర)"  చందన రాజు 2:58

మూలాలు మార్చు

 1. "Vijay Deverakonda's debut production venture titled 'Meeku Maathrame Cheptha'". The News Minute. 29 August 2019. Retrieved 27 October 2019.
 2. "Vijay Deverakond has turned into a producer with the film Meeku Maathrame Cheptha, which stars Pelli Choopulu director Tharun Bhascker as one of the lead actors in the film". India Today (in ఇంగ్లీష్). 30 August 2019. Retrieved 27 October 2019.
 3. "Meeku Mathrame Cheptha teaser: Vijay Deverakonda's maiden production sees Tharun Bhascker as a lying bloke". Firstpost (in ఇంగ్లీష్). 7 September 2019. Retrieved 1 November 2019.
 4. "Meeku Maathrame Cheptha". Times of India (in ఇంగ్లీష్). 23 September 2019. Retrieved 1 November 2019.
 5. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి-రివ్యూ (1 November 2019). "'మీకు మాత్ర‌మే చెప్తా' మూవీ రివ్యూ". www.andhrajyothy.com. Archived from the original on 1 November 2019. Retrieved 1 November 2019.
 6. ఆంధ్రప్రభ, సినిమా (29 October 2019). "విభిన్న పాత్రలు చేయాలని అనుకుంటున్నా..అభినవ్ గోమటం." Archived from the original on 29 అక్టోబరు 2019. Retrieved 29 October 2019.
 7. "Meeku Maathrame Cheptha Teaser - Tharun Bhascker Dhaassyam - Vijay Deverakonda - Anasuya Bharadwaj". YouTube. Vijay Deverakonda. 27 October 2019.
 8. "Meeku Maathrame Cheptha Trailer - Tharun Bhascker Dhaassyam - Vijay Deverakonda - Anasuya Bharadwaj". YouTube. Vijay Deverakonda. 27 October 2019.

ఇతర లంకెలు మార్చు