బేగంపేట్ (బాలానగర్ మండలం)

హైదరాబాదులోని సికింద్రాబాదుకు చెందిన ప్రాంతం

బేగంపేట, హైదరాబాదులోని సికింద్రాబాదుకు చెందిన ప్రాంతం. ఆరవ నిజాం (మహబూబ్ అలీ ఖాన్, అసఫ్ జా VI) కుమార్తె బషీర్ ఉన్నిసా బేగం పేరుమీద ఈ బేగంపేట పేరు పెట్టారు. పైగా షామ్స్ ఉల్ ఉమ్రా అమీర్ ఇ కబీర్ రెండవ అమీర్‌ను వివాహం చేసుకున్నప్పుడు వివాహకట్నంలో భాగంగా బషీర్ ఉన్నిసా బేగానికి ఈ ప్రాంతాన్ని కానుకగా అందించారు.

బేగంపేట
నగర ప్రాంతం
బేగంపేట ప్రధాన రహదారి దృశ్యం
బేగంపేట ప్రధాన రహదారి దృశ్యం
బేగంపేట is located in Telangana
బేగంపేట
బేగంపేట
తెలంగాణలో ప్రాంతం ఉనికి
బేగంపేట is located in India
బేగంపేట
బేగంపేట
బేగంపేట (India)
నిర్దేశాంకాలు: 17°26′42″N 78°28′10″E / 17.444865°N 78.469396°E / 17.444865; 78.469396Coordinates: 17°26′42″N 78°28′10″E / 17.444865°N 78.469396°E / 17.444865; 78.469396
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు జిల్లా
మెట్రోహైదరాబాదు
ప్రభుత్వం
 • నిర్వహణహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
కాలమానంUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
500 016
వాహనాల నమోదు కోడ్టిఎస్
లోకసభ నియోజకవర్గంసికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ
జాలస్థలిtelangana.gov.in

వివరాలుసవరించు

హుసేన్ సాగర్ సరస్సుకి ఉత్తరాన ఉన్న ఈ బేగంపేట, హైదరాబాదు నగరంలోని ప్రధాన వాణిజ్య, నివాస కేంద్రాలలో ఒకటిగా ఉంది. బేగంపేట, పంజాగుట్ట మధ్యలో గ్రీన్లాండ్స్ ఫ్లైఓవర్ ఉంది. పూర్వకాలంలో ఈ బేగంపేట హైదరాబాదు, సికింద్రాబాదు నగరాల మధ్య ఒక చిన్న శివారు ప్రాంతంగా ఉండేది. బేగంపేట విమానాశ్రయం నగరానికి ఒక ప్రధాన ఆకర్షణ. శంషాబాద్‌లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభించిన తరువాత బేగంపేట విమానాశ్రయం వాణిజ్య విమానాల కోసం కాకుండా శిక్షణ, చార్టర్డ్ విమానాల కోసం మాత్రమే పనిచేస్తోంది.

పైగా ప్యాలెస్, గీతాంజలి సీనియర్ స్కూల్, బేగంపేట స్పానిష్ మసీదు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, సర్ రోనాల్డ్ రాస్ ఇన్స్టిట్యూట్ వంటి ముఖ్యమైన ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. హుస్సేన్ సాగర్ ఒడ్డున బేగంపేట సమీపంలో సంజీవయ్య పార్క్ కూడా ఉంది.

ఆస్పత్రులుసవరించు

  • పేస్ హాస్పిటల్స్ [1]
  • మాక్సివిజన్ ఐ హాస్పిటల్స్

రవాణాసవరించు

బేగంపేట్ రైల్వే స్టేషను ఈ ప్రాంతానికి ప్రధాన రవాణా సౌకర్యాన్ని అందిస్తోంది. సమీపంలో ఉన్న సంజీవయ్య పార్క్, జేమ్స్ స్ట్రీట్ వంటి ప్రాంతాలలో హైదరాబాదు ఎం.ఎం.టి.ఎస్ స్టేషన్లు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో బేగంపేట నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సులు నడుస్తున్నాయి. బేగంపేట మెట్రో స్టేషనులో మెట్రో రైలు కూడా ప్రారంభమైంది. విద్యార్థులతో పాటు ఇతర పౌరుల రవాణా సాధనల్లో అత్యంత ప్రజాదరణ పొందిన మార్గాలలో ఇది ఒకటి.

మూలాలుసవరించు

  1. "Gastro, Liver and Kidney Centre Hyderabad".

వెలుపలి లింకులుసవరించు