ఏనుగు నరసింహారెడ్డి

ఏనుగు నరసింహారెడ్డి (ఆంగ్లం: Enugu Narasimha Reddy) తెలంగాణకు చెందిన కవి, రచయిత, సాహిత్య విమర్శకుడు, అనువాదకుడు. 2017 నుండి 2020 వరకు తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి కార్యదర్శిగా పనిచేశాడు. ప్రస్తుతం మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు.[1]

ఏనుగు నరసింహారెడ్డి
జననం
ఏనుగు నరసింహారెడ్డి

ఏప్రిల్ 6, 1968
జాతీయతభారతీయుడు
వృత్తికవి, రచయిత,
జీవిత భాగస్వామిఅరుణ
పిల్లలుఇద్దరు కుమార్తెలు (తేజస్విని, గీతాంజలి)
తల్లిదండ్రులు
  • కృష్ణారెడ్డి (తండ్రి)
  • లక్ష్మమ్మ (తల్లి)

జననం, విద్య

మార్చు

నరసింహారెడ్డి 1968, ఏప్రిల్ 6న కృష్ణారెడ్డి - లక్ష్మమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, కల్లోనికుంటలో జన్మించాడు.[2] నరసింహారెడ్డి జన్మించిన మూడేళ్ళకు తండ్రి కృష్ణారెడ్డి టీబీ వ్యాధితో మరణించగా, తల్లి లక్ష్మమ్మ నరసింహారెడ్డిని తీసుకొని హైదరాబాదు (తార్నాక)కు వెళ్ళింది. అక్కడ ఇబ్బందులు ఎదురుకావడంతో చిట్యాలకు వచ్చి స్థిరపడింది.

చిట్యాలతో పదవ వరగతి, రామన్నపేటలో ఇంటర్ విద్య పూర్తిచేశాడు. సికింద్రాబాద్ లోని సర్దార్ పటేల్ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం, నల్గొండలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండవ సంవత్సరం, మూడో సంవత్సరం చదివాడు. ఆ తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ, తెలుగు విశ్వవిద్యాలయం లో ఎంఫిల్, పీహెచ్.డి పూర్తిచేశాడు.

వ్యక్తిగత జీవితం

మార్చు
 
2017లో ఉగాది కవి సమ్మేళనంలో సత్కారం అందుకుంటున్న ఏనుగు నరసింహారెడ్డి

డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్న సమయంలోనే నరసింహారెడ్డికి తన మేనమరదలు అరుణతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు (తేజస్విని, గీతాంజలి)

ఉద్యోగం

మార్చు
 
2017 ఉగాది కవి సమ్మేళనంలో కవిత్వ పఠనం చేస్తున్న ఏనుగు నరసింహా రెడ్డి

పీహెచ్.డి చదువుతున్న సమయంలోనే ఏపీపీఎస్సీ గ్రూప్-2ఎలో రెండవర్యాంకు సాధించిన నరసింహారెడ్డికి, ప్రొబేషనరీ డిప్యూటీ తహసీల్దారుగా ఉద్యోగం రావడంతో, జేఆర్ఎఫ్ కు రాజీనామా చేసి పీహెచ్.డీ కొనసాగించాడు. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో వివిధ స్థాయిలో ఉద్యోగాలు నిర్వహించాడు. తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శిగా ప్రపంచ తెలుగు మహాసభలు సమర్థవంతంగా నిర్వహించాడు.

సాహిత్య ప్రస్థానం

మార్చు

స్కూల్ లైబ్రరీలో రష్యన్ అనువాదాలు, బెంగాలీ అనువాదాలు, కుప్రీన్, టాల్ స్టాయ్, తుర్గనేవ్ రచనలు చదివాడు. విద్యార్థి దశలోనే పల్లె జీవనంపై మట్టిపాట పేరుతో శతకం రాశాడు. పదవతరగతిలో ఉన్నప్పుడు బాలల మాసపత్రిక పెట్టిన బాలల నవల పోటీకి 120 పేజీలతో 'ఊరు మారింది' అనే నవల రాసి పోటీకి పంపించాడు. ఆ తరువాత 'సినీయాక్టర్ని' అనే నవల రాశాడు. 1983లో 'పాఠశాల' అనే విద్యార్థి మ్యాగజైనుకు శ్రీనాథ మహాకవిపై రాసిన వ్యాసానికి మొదటి బహుమతి వచ్చింది. ఆటలలో, వ్యాస రచనలో, వక్తృత్వ పోటీలలో పాల్గొనేవాడు. తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు పాఠశాల విద్యార్థి సంఘం కార్యదర్శిగా, 10వ తరగతిలో అధ్యక్షుడిగా ఎన్నిక్యాడు. ఇంటర్ చదువుతూ ఉన్నరోజుల్లో యువవాణిలో కవిత్వం చదవడానికి అవకాశం లభించింది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి పురాణ ప్రబోధ పరీక్షలో జిల్లా ఫస్టు ర్యాంకు రజత పతకం అందుకున్నాడు. డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నప్పుడు రాసిన పగిలిన గుండెలు నవల ప్రజాపోరాటం సాయంకాల దినపత్రికలో డైలీ సీరియల్ గా రెండున్నర నెలలు ప్రచురించబడింది.[3]

రచనలు

మార్చు

నరసింహారెడ్డి రాసిన పుస్తకాలు:[2]

  1. సమాంతర స్వప్నం (1990)
  2. నేనే (2002)
  3. మట్టిపాట (2008)
  4. కొత్తపలక (2012)
  5. హైద్రాబాద్ విషాదం (2016)[4][5]
  6. మూలమలుపు (2018)
  7. అంతరంగం (2018)
  8. తెలుగు రాష్ట్రాల రెవెన్యూ వ్యవస్థ నిన్న నేడు రేపు (2019)
  9. సమాహార (2019)
  10. గుర్రం జాషువా, డిన్ థామస్ కవిత్వంలో బాల్యం (2019)
  11. తెలుగు హిందీ జాతీయోద్యమ గీతాలు (2019)
  12. తెలంగాణ రుబాయిలు (2020)[6][7]
  13. అసఫ్ జాహీ సంస్థానం విలీనగాథ (2020)
  14. నీడల దృశ్యం (2021)[8]

సంపాదకత్వం

మార్చు

నరసింహారెడ్డి సంపాదకత్వం వహించిన పుస్తకాలు:[2]

  1. ములాఖత్ (కవిత్వం)
  2. గునుగుపూలు పొద్దు (కవిత్వం)
  3. దిగులు వెన్నెల (కవిత్వం)
  4. అదే కల (కవిత్వం)
  5. తెలంగాణ చరిత్ర సంస్కృతి (ఇతరులతో కలిసి)
  6. అస్తిత్వ (ఇతరులతో కలిసి)
  7. పరంపర (ఇతరులతో కలిసి)

ఇతర వివరాలు

మార్చు

నరసింహారెడ్డిపై గుడిపాటి, గురిజాల రామిశేషయ్య సంపాదకత్వంలో అరతెర తీసిన రంగస్థలం, కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి ఏనుగు నరసింహారెడ్డి సాహిత్యాంతరంగం అనే పుస్తకాలు వచ్చాయి.

పురస్కారాలు

మార్చు

నరసింహారెడ్డి అందుకున్న పురస్కారాలు:[2]

  1. కొత్తపలక (వచన కవిత)కు తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పురస్కారం (2014)[9]
  2. బండ్ల సుబ్రహ్మణ్యం స్మారక బహుమతి (1995)
  3. రంజని కుందుర్తి ఉత్తమ కవితా పురస్కారం (2016)
  4. నెలవంక నెమలీక వారి కలహంస పురస్కారం (2018)
  5. వర్కింగ్ జర్నలిస్టు కవిత్వ బహుమతి
  6. నవతెలంగాణ పట్టికోట ఆళ్వారుస్వామి ఉత్తమ కవితా పురస్కారం (2016)
  7. తెలుగాణ రాష్ట్రస్థాయి ఈ సాహితీ పురస్కారం (2017)
  8. కళాంజలి విజ్ఞానపీఠం వారి గౌరవ పురస్కారం
  9. జగిత్యాల బోయినపల్లి వెంకటరామారావు సాహిత్య పురస్కారం (2016)
  10. అక్షరకళాభారతి వారి అక్షర సాహితీ పురస్కారం (2018)
  11. రాజారాం ఫౌండేషన్ రాష్ట్రస్థాయి సాహితీ పురస్కారం (2018)
  12. తెలంగాణ కళావేదిక వారి సామల సదాశివ రాష్ట్రస్థాయి పురస్కారం (2019)
  13. పాలమూరు సాహితీ పురస్కారం (2018)
  14. క్యాతం కృష్ణారెడ్డి స్మారక కవిత్వ పురస్కారం (2020)
  15. తెలంగాణ మహిళా సాహిత్య, సాంస్కృతిక సంస్థ మహబూబ్ నగర్ వారి కాళోజీ పురస్కారం (2020)
  16. తెలంగాణ రుబాయీలు' కు గిడుగు రామ్మూర్తి పురస్కారం (2020)
  17. తెలంగాణ దుబాబులు'కు రావి రంగారావు ట్రస్ట్ వారి పురస్కారం

మూలాలు

మార్చు
  1. Andhrajyothy (31 March 2021). "అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఏనుగు నర్సింహారెడ్డి". Archived from the original on 14 January 2022. Retrieved 14 January 2022.
  2. 2.0 2.1 2.2 2.3 ఏనుగు నరసింహారెడ్డి, పాలపిట్ట మాసపత్రిక, డిసెంబరు 2021, హైదరాబాదు, పుట. 27.
  3. Srinivas, Mittapalli (2016-12-02). "చిట్యాలకు వీచిన కల్లోనికుంట గాలి." www.telugu.oneindia.com. Archived from the original on 2022-01-03. Retrieved 2022-01-03.
  4. ALI, MEER LAIQ; REDDY, ANUGU NARSIMHA (2020-01-01). HYDERABAD VISHAADAM (in Telugu) (2020 ed.). Mohi Book Depot.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  5. "లాయక్‌ అలీ విషాదం". Sakshi. 2020-02-24. Archived from the original on 2021-11-02. Retrieved 2022-01-03.
  6. "తెలంగాణ రుబాయిలు (కవిత్వం)". lit.andhrajyothy.com. Archived from the original on 2021-12-16. Retrieved 2022-01-03.
  7. "తెలంగాణ రుబాయిలు పుస్తకావిష్కరణ | నల్గొండ | www.NavaTelangana.com". NavaTelangana. 2020-08-31. Archived from the original on 2022-01-03. Retrieved 2022-01-03.
  8. "ఆలోచింపజేసే కథలు - Sunday Magazine". EENADU. Archived from the original on 2021-12-19. Retrieved 2022-01-03.
  9. "1 న తెలుగు యూనివర్శిటీ పురస్కారాల ప్రదానం". 2016-11-28. Archived from the original on 2023-08-24. Retrieved 2023-08-24.

ఇతర లింకులు

మార్చు
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.