మధ్యప్రదేశ్ రాష్ట్ర 51 జిల్లాలలో గ్వాలియర్ (ఆంగ్లం: Gwalior; హిందీ: ग्वालियर) ఒకటి. ఇది మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని చారిత్రక పట్టణం, జిల్లా కేంద్రంగా కూడా ఉంది. ఈ నగరం ఆగ్రాకు దక్షిణాన 122 కి.మీ. దూరానవున్నది. భారత్‌లోని అత్యధిక జనాభాగల నగరాలలో దీని స్థానం 46వది. జిల్లాలో అంతారి, బితర్వర్, బిలౌయా, దబ్రా, మొరర్ కంటోన్మెంట్, పిచోర్, తెకన్‌పూర్ వంటి ప్రధాన పట్టణాలు ఉన్నాయి. జిల్లా వైశాల్యం 5,214 చ.కి.మీ. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1,629,881. 1991 కంటే జనసంఖ్య 26% అభివృద్ధి చెందింది.

Gwalior జిల్లా

ग्वालियर जिला
Madhya Pradesh లో Gwalior జిల్లా స్థానము
Madhya Pradesh లో Gwalior జిల్లా స్థానము
దేశంభారతదేశం
రాష్ట్రంMadhya Pradesh
పరిపాలన విభాగముGwalior
ముఖ్య పట్టణంGwalior
మండలాలు1. Gwalior, 2. Bhitarwar, 3. Dabra
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలుGwalior (shared with Shivpuri district)
 • శాసనసభ నియోజకవర్గాలు1. Gwalior Rural, 2. Gwalior, 3. Gwalior East, 4. Gwalior South, 5. Bhitarwar and 6. Dabra
విస్తీర్ణం
 • మొత్తం5,214 కి.మీ2 (2,013 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం20,30,543
 • సాంద్రత390/కి.మీ2 (1,000/చ. మై.)
జనగణాంకాలు
 • అక్షరాస్యత77.93 per cent
 • లింగ నిష్పత్తి862
జాలస్థలిఅధికారిక జాలస్థలి
కొండపైనున్న గ్వాలియర్ కోట

సరిహద్దులుసవరించు

గ్వాలియర్ జిల్లా ఈశాన్య సరిహద్దులో బింద్ జిల్లా, తూర్పు సరిహద్దులో దతియా జిల్లా, దక్షిణ సరిహద్దులో శివ్‌పురి జిల్లా, తూర్పు సరిహద్దులో షెయోపూర్ జిల్లా, వాయవ్య సరిహద్దులో మొరెన జిల్లా ఉన్నాయి. జిల్లా గ్వాలియర్ డివిషన్‌లో ఉంది.

స్వతంత్ర సమరంసవరించు

1857 స్వాతంత్ర్య సమరంలో గ్వాలియర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. కల్పి (ఝాన్సీ) బ్రిటిష్ పరం అయ్యాక ఝాన్సీ లక్ష్మీభాయి గ్వాలియర్ కోటలో ఆశ్రయం కోరాడు. బ్రిటిష్ ప్రభుత్వానికి భయపడి గ్వాలియర్ రాజు రాణిభాయికి ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరించాడు. అయినప్పటికీ సైన్యం రాణిభాయి మీద గౌరవంతో కోటలో ఆశ్రయం ఇవ్వడానికి మద్దతు తెలిపారు. ఏమాత్రం ఎదిరింపు లేకుండా రాణిభాయి కోటలో ప్రవేశింది. బ్రిటిష్ ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాణిభాయి కొరకు గ్వాలియర్ కోటమీద దాడి చేసింది. రాణిభాయి అపారమైన బ్రిటిష్ సైన్యంతో తన స్వల్పసైన్యం సాయంతో అత్యంత సాహసోపేతంగా పోరాడి వీరస్వర్గం అలకరించింది. గ్వాలియర్ కోట బ్రిటిష్ స్వాధీనం చేసుకుంది. ఆనాటి మరపురాని చారిత్రక సంఘటనకు గ్వాలియర్ కోట సాక్ష్యంగా నిలబడింది.

గురురాధా కిషన్సవరించు

స్వతత్ర సమర నాయకులలో ఒకరైన గురు రాధా కిషన్ తమ సమకాలీన స్వాతంత్ర్య యోధుడు రామచంద్ర సర్వేట్ పట్ల గ్వాలియర్ రాజాస్థానం అనుసరించిన విధానాలను వ్యతిరేకిస్తూ ప్రజాఉద్యమం చేపట్టాడు. ఇండోర్లో స్వాతంత్ర్య సమరానికి చురుకుగా పాల్గొన్నందుకు వ్యతిరేకంగా గ్వాలియర్ రాజాస్థానం ఆయనకు అరెస్ట్ వారెంటు పంపిన తరువాత రాధాకిషన్ గ్వాలియర్‌లో ప్రవేశించాడు. బ్రిటిష్ పాలనా కాలంలో పేదల ఆర్థికాభివృద్ధి కొరకు గురు రాధా కిషన్ విశేషంగా కృషిచేసాడు. ప్రముఖ గాంధేయవాది " దాదా ధర్మాధికారి " రాధా కిషన్ కార్యకలాపాలను హృదయపూర్వహంగా ఆదరించాడు.

భౌగోళికంసవరించు

గ్వాలియర్ జిల్లా గిర్ద్ భూభాగం కేంద్రస్థానంలో ఉంది. జిల్లా భూభాగం దాదాపు చదరంగా ఉంటుంది. మైదానం దక్షిణ భూభాగం లోతట్టు కొండలు ఉంటాయి. ఇది సముద్రమట్టానికి కొన్ని వందల అడుగుల ఎత్తులో మాత్రమే ఉంటుంది. వేసవి సమయంలో వాతావరణం వేడిగా ఉంటుంది. వేసవిలో ఉష్ణోగ్రత 44 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. నవంబరు నుండి సెప్టెంబరు వరకు కొనసాగే శీకాలపు ఉష్ణోగ్రత కనిష్ఠ స్థాయికి చేరుకుంటుంది.

విభాగాలుసవరించు

  • గ్వాలియర్ జిల్లాలో 3 తాలూకాలు ఉన్నాయి : గ్వాలియర్, భితర్వర్, దాద్రా.
  • జిల్లాలో 6 శాసనసభ స్థానాలు ఉన్నాయి :- గ్వాలియర్ (గ్రామీణ) శాసనసభ నియోజక వర్గం, బితర్వర్ శాసనసభ నియోజక వర్గం, గ్వాలియర్ శాసనసభ నియోజక వర్గం, తూర్పు గ్వాలియర్ శాసనసభ నియోజక వర్గం, దాబ్రా శాసనసభ నియోజక వర్గం.
  • ఇవన్నీ గ్వాలియర్ పార్లమెంటు నియోజకవర్గం భాగంగా ఉన్నాయి.

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,030,543,[1]
ఇది దాదాపు. స్లోవేనియా దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. న్యూమెక్సికో నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 227వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 425 .[1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 24.41%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 862:1000,[1]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 77.93%.[1]
జాతియ సరాసరి (72%) కంటే.

మూలాలుసవరించు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Slovenia 2,000,092 July 2011 est. line feed character in |quote= at position 9 (help)
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. New Mexico - 2,059,179

వెలుపలి లింకులుసవరించు

బయటి లింకులుసవరించు

వెలుపలి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=గ్వాలియర్&oldid=2974981" నుండి వెలికితీశారు