మురళీధర్ మోహోల్

మురళీధర్ కిసాన్ మోహోల్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన 18వ లోక్‌సభ ఎన్నికలలో పూణే లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారిగా ఎంపీగా ఎన్నికై 2024 జూన్ 9న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మోదీ మంత్రివర్గంలో కేంద్ర సహాయ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[1]

మురళీధర్ మోహోల్
మురళీధర్ మోహోల్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
11 జూన్ 2024
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
04 జూన్ 2024
నియోజకవర్గం పూణే

పదవీ కాలం
నవంబర్ 2019 – 15 మార్చి 2022
ముందు ముక్తా తిలక్
తరువాత అడ్మినిస్ట్రేటివ్ రూల్

వ్యక్తిగత వివరాలు

జననం (1974-11-09) 1974 నవంబరు 9 (వయసు 49)
పూణె
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ

రాజకీయ పదవులు

మార్చు
  • 1993 : రాజకీయాల్లోకి ప్రవేశించి పూణేలో వార్డు స్థాయిలో నిర్వహించడం ప్రారంభించాడు.[2]
  • 2002 : మున్సిపల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సభ్యునిగా ఎన్నికయ్యాడు.
  • 2006 : కెలెవాడి వార్డుకు జరిగిన మున్సిపల్ ఉప ఎన్నికలో విజయం సాధించాడు.
  • 2009 : ఖడక్వాస్లా నుండి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.
  • 2012 : ఆయన భార్య మోనికా మోహోల్ ఐడియల్ కాలనీ నుండి మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందాడు.
  • 2017 : పూణె మునిసిపల్ కార్పొరేషన్‌లోని 12 సి వార్డు నుండి కార్పొరేటర్‌గా ఎన్నికై స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా నియమితులయ్యాడు.
  • నవంబర్ 2019 : ముక్తా తిలక్ తర్వాత పూణే మేయర్‌గా ఎన్నికయ్యాడు.
  • 2021 : అతని నాయకత్వంలో, గ్లోబల్ మేయర్స్ ఛాలెంజ్ కోసం పూణే 50 ఛాంపియన్ నగరాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.
  • మార్చి 2022 : పూణే మున్సిపల్ కార్పొరేషన్ పదవీకాలం ముగిసింది, మేయర్‌గా అతని పదవీకాలం ముగిసింది.
  • 2024 : పూణే లోక్‌సభ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికై నరేంద్ర మోడీ ప్రభుత్వంలో సహాయ మంత్రిగా చేరాడు.[3][4]

ఎన్నికల చరిత్ర

మార్చు
మురళీధర్ మోహోల్ ఎన్నికల చరిత్ర
సంవత్సరం ఎన్నికల నియోజకవర్గం ప్రత్యర్థి ఫలితం మెజారిటీ
2002 పూణె మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కెలెవాడి వార్డు గెలుపు +
2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఖడక్వాస్లా రమేష్ వాంజలే (MNS) ఓటమి -49,793[5]
2017 పూణె మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు 12 సి వార్డు గెలుపు +
2024 లోక్‌సభ ఎన్నికలు పూణే రవీంద్ర ధంగేకర్ (కాంగ్రెస్) గెలుపు +123,038 ఓట్లు[6][7]

మూలాలు

మార్చు
  1. India Today (10 June 2024). "First time MP from Pune Murlidhar Mohol sworn in as minister in union cabinet" (in ఇంగ్లీష్). Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
  2. "From wrestler to minister: A glimpse into Mohol's journey". Pune Mirror. 2024-06-09. Retrieved 2024-06-10.
  3. The Times of India (10 June 2024). "Murlidhar Mohol becomes Pune's first Lok Sabha MP to get central ministerial berth since 1996". Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
  4. The Indian Express (9 June 2024). "Mohol becomes Minister: Only 2nd Lok Sabha MP from Pune in 38 years to get the honour" (in ఇంగ్లీష్). Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
  5. "MNS opens account with big victory in Khadakwasla". The Indian Express (in ఇంగ్లీష్). 2009-10-23. Retrieved 2024-06-13.
  6. "Pune Lok Sabha Election Results 2024 Highlights: BJP's Murlidhar Mohol wins". Financial Express. 2024-06-05. Retrieved 2024-06-10.
  7. "Hat-trick for BJP as Murlidhar Mohol clinches Pune LS seat". Hindustan Times. 2024-06-05. Retrieved 2024-06-10.