ముక్తేశ్వరం (అయినవిల్లి మండలం)

ఆంధ్రప్రదేశ్, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలంలోని పుణ్యక్షేత్రం

ముక్తేశ్వరం, తూర్పు గోదావరి జిల్లా, అయినవిల్లి మండలానికి చెందిన గ్రామం.[1]. పిన్ కోడ్: 533 211.

ముక్తేశ్వరాలయం

గ్రామ చరిత్ర మార్చు

 
క్షణ ముక్తేశ్వరాలయం.

తూర్పు గోదావరి జిల్లా లోని అమలాపురానికి 14 కిలోమీటర్ల దూరంలో గోదావరి తీరాన ఉన్న ఒక గ్రామం ముక్తేశ్వరం. 30-40 సంవత్సరాల క్రితం కేవలం ఒక అగ్రహారంగా ఉండేది. ఇప్పుడు వెడల్పాటి రహదారులతో, చక్కటి ఊరు ఏర్పడింది. చుట్టూ పచ్చటి ప్రకృతి, పంట కాల్వలు, అక్కడక్కడ లంక గ్రామాలు, కొబ్బరితోటలు, మామిడి చెట్లు..వెరసి, మొత్తం కోనసీమ అందాలన్నింటిని సంతరించుకున్న గ్రామం ముక్తేశ్వరం. ఊరికి కొద్ది దూరంలో గోదావరి తీరం. నదికి ఆవలి పక్కన కోటిపల్లి రేవు. ఈ మధ్యనే బ్రిటీషువారి కాలంలో వేయబడ్డ కాకినాడ - కోటిపల్లి రైల్వేలైను పునరుద్ధరింపబడింది.

గ్రామ ప్రముఖులు మార్చు

దేవాలయాలు మార్చు

ముక్తేశ్వరాలయం, క్షణ ముక్తేశ్వరాలయం

ఈ ఊరికి ఉన్న పేరు మీదుగా కల ముక్తేశ్వరుని దేవాలయము బహు పురాతనమైనది. ఒకదానికెదురుగా ఒకటిగా రెండు శివాలయములు ఉండటం ఇక్కడి ప్రత్యేకత. మెదటి దాని ఎదురుగ ఉండే ఆలయములో దేవుని క్షణ ముక్తేశ్వరుడు అంటారు. ముక్తేశ్వరస్వామి ఆలయములో శివలింగము చిన్నగా రుద్రాక్ష ఆకారము పోలి ఉంటుంది. దీనిని వనవాస సమయంలో ఇటు వైపుగా వచ్చిన శ్రీరాముడు ఇక్కడి శివలింగమును అర్చించి దాని మాహాత్మ్యమును తెలుసుకొని క్షణ కాలము ఇక్కడి పరమేశ్వరుని అర్చించిన ముక్తి కలుగునని చెప్పెనని స్థల పురాణము ద్వారా తెలియుచున్నది. ముక్తేశ్వరంలో నూతనముగా శ్రీ షిర్డీ సాయి బాబా ఆలయము శివాలయము వద్ద నిర్మింపబడింది. ఊరికి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో అయినవిల్లి గ్రామంలో జగత్ప్రసిద్దమైన మహాగణపతి ఆలయం ఉంది.

రవాణా సౌకర్యాలు మార్చు

మూలాలు మార్చు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2015-09-07.

వెలుపలి లంకెలు మార్చు