ముఖ్యమంత్రి యువనేస్తం
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
ఈ పథకం 14వ తేదీ సెప్టెంబర్, 2018 ప్రారంభించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి యువనేస్తం అనే నూతన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని అర్హత కలిగిన సుమారు 12 లక్షల మంది నిరుద్యోగ యువతకు లబ్ది చేకూరుతుంది. యువత నైపుణ్యాభివృద్ధి / వృత్తి విద్యా కోర్సులు అభ్యసించేందుకు, నిరుద్యోగ యువత యొక్క కుటుంబాలపై భారం తగ్గించేందుకు లబ్దిదారులకు నెల నెలా నిరుద్యోగ భృతిని అందజేస్తారు.
అర్హత ప్రమాణాలు
మార్చు- దరఖాస్తుదారులు నిరుద్యోగులై ఉండాలి.
, ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారై ఉండాలి.
- విద్యా అర్హతలు గ్రాడ్యుయేషన్.
- 22-35 సంవత్సరాల వయస్సులో ఉండాలి.
- దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న కుటుంబానికి చెందినవాడు అయ్యి ఉండాలి.
- కుటుంబానికి అన్ని అర్హత పొందిన లబ్ధిదారులను అనర్హులు.
- 4 చక్రాలు వాహనం అనర్హుడు.
- 2.5 ఎకరాల తడి భూమి కలిగి, 5.00 ఎకరాల గరిష్ట భూమిని గరిష్టంగా అర్హులు.
- అనంతపురం జిల్లాకు సంబంధించి పరిమితి గరిష్ట తడి భూములు 5.00 ఎకరాలు, పొడి భూమి 10.00 ఎకరాల ఉంటుంది.
- అధికారిక విద్యను అభ్యసిస్తున్న వారు అర్హులు కాదు.
- పబ్లిక్ / ప్రైవేట్ సెక్టార్ / క్వాసి-ప్రభుత్వం లేదా స్వయం ఉపాధిలో పనిచేసే వారు అర్హత లేదు.
- నిరుద్యోగ భృతి పొందేందుకు ముఖ్యమంత్రి యువనేస్తం పథకానికి దరఖాస్తు చేసుకోవాలి
నిరుద్యోగ భృతిని రూ.2000 పెంపు
మార్చునిరుద్యోగ భృతిని 2000 పెంచుతూ చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు.ఈ మేరకు బడ్జెట్ సమావేశంలో నిరుద్యోగ భృతిని రూ.2000 చేస్తున్నట్లు ఆర్థికమంత్రి యనమల వెల్లడించారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో యువనేస్తం కింద రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఇచ్చే నిరుద్యోగ భృతిని రూ.1000 నుంచి రూ.2000 లకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి యనమల రామకృష్టుడు అసెంబ్లీలో ప్రకటించారు.
సమస్యలు
మార్చు- రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఫోన్‌కు ఓటీపీ రాకపోవడం.
- ప్రజా సాధికార సర్వేలో తప్పుగా నమోదయిన వివరాలే ‘భృతి’కి అర్హులైనారు.
- ఆధార్ నమోదు సమయంలో రిజిస్ట్రేషన్ చేసిన ఫోన్ నంబర్ లేకపోవడం.
- బ్యాంకు ఖాతాకు ఆధార్, ఫోన్ నంబరు అనుసంధానం లేకపోవడం.