ముగ్గురు మొనగాళ్ళు (1994 సినిమా)

1994 సినిమా

ముగ్గురు మొనగాళ్ళు 1994, జనవరి 7న విడుదలైన తెలుగు చలనచిత్రం. అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై నాగేంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిర్మాణ సారథ్యంలో కె. రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి , నగ్మా, రమ్యకృష్ణ, రోజా తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో చిరంజీవి మొదటిసారిగా త్రిపాత్రాభినయం చేశాడు. బాక్సాఫీస్ వద్ద యావరేజ్ హిట్ గా నిలిచింది.[2]

ముగ్గురు మొనగాళ్ళు
ముగ్గురు మొనగాళ్ళు సినిమా పోస్టర్
దర్శకత్వంకె.రాఘవేంద్రరావు
నిర్మాతనాగేంద్రబాబు
పవన్ కళ్యాణ్
తారాగణంచిరంజీవి ,
నగ్మా,
రమ్యకృష్ణ,
రోజా
కూర్పుVellaiswamy
సంగీతంవిద్యాసాగర్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1994 జనవరి 7 (1994-01-07) [1]
దేశంభారతదేశం
భాషతెలుగు

కథా నేపథ్యం సవరించు

రంగనాథ్, శ్రీవిద్య తమ కుమారులు పృథ్వీ, విక్రమ్, దత్తాత్రేయ (చిరంజీవి త్రిపాత్రాభినయం)లతో ఒక గ్రామంలో నివసిస్తున్నారు. ఒక కేసు విషయంలో రంగనాథ్ ను శరత్ సక్సేనా చంపివేస్తాడు. గర్భవతి అయిన శ్రీవిద్య పారిపోతూ పృథ్వీ నుండి విడిపోతుంది. గూండాల నుండి తప్పించుకునేటప్పుడు తన కొడుకు చంపబడ్డాడని అనుకుంటుంది. ఒక ఆలయంలోకి వెళ్ళి అక్కడ కవలలకు జన్మనిస్తుంది. సంతానం లేని పూజారి ఒక కొడుకును దత్తత తీసుకుంటాడు, శ్రీవిద్యతో ఉన్న విక్రమ్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ అవుతాడు. దత్తాత్రేయ నృత్య ఉపాధ్యాయుడు. సోదరులు ఒకరినొకరు, తల్లిని ఎలా కలిసారు, విలన్లపై ప్రతీకారం ఎలా తీర్చుకుంటారు అనేది మిగతా కథ.

తారాగణం సవరించు

సాంకేతికవర్గం సవరించు

పాటలు సవరించు

ఈ చిత్రానికి విద్యాసాగర్ సంగీతం అందించాడు.

పాటపేరు గాయకులు
"కొట్టు కొట్టు కొబ్బరికాయ" ఎస్.పి. బాలు, కె.ఎస్. చిత్ర
"చామంతి పువ్వా పువ్వా" ఎస్.పి. బాలు, కె.ఎస్. చిత్ర
"అమ్మ అంటే" ఎస్.పి. బాలు, కె.ఎస్. చిత్ర
"నువ్వొక్కసారి అంటే ఓకేస్" ఎస్.పి. బాలు, కె.ఎస్. చిత్ర
"రారా రారా గోపాలా" ఎస్.పి. బాలు, కె.ఎస్. చిత్ర
"రాజశేఖర" ఎస్.పి. బాలు, ఎస్. జానకి
"ఆజా ఆజా" మనో, కె.ఎస్. చిత్ర

మూలాలు సవరించు

  1. 10TV (7 January 2019). "పాతికేళ్ళ ముగ్గురు మొనగాళ్ళు" (in telugu). Archived from the original on 10 December 2021. Retrieved 10 December 2021.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-02-09. Retrieved 2020-07-19.
  3. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (19 February 2019). "మరోసారి మెగా కాంపౌండ్ లోకి నగ్మా..?". www.andhrajyothy.com. Archived from the original on 19 July 2020. Retrieved 19 July 2020.

ఇతర లంకెలు సవరించు