ముజీబ్ ఉర్ రహమాన్
ముజీబ్ ఉర్ రహ్మాన్ జద్రాన్ (జననం 2001 మార్చి 28) ఆఫ్ఘన్ క్రికెట్ ఆటగాడు. అతను ఆఫ్ఘనిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టు కోసం ఆడుతున్నాడు. అతని అంతర్జాతీయ రంగప్రవేశం జరిగిన రెండు నెలల తర్వాత, 16 సంవత్సరాల 325 రోజుల వయస్సులో, అతను వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసి, అది సాధించిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. [2] 2018 జూన్‌లో భారతదేశానికి వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్ యొక్క మొట్టమొదటి టెస్టు మ్యాచ్‌లో ఆడిన పదకొండు మంది క్రికెటర్లలో అతను ఒకడు. ఇది అతని ఫస్టు క్లాస్ క్రికెట్ రంగప్రవేశం కూడా. [3] అతని మేనమామ నూర్ అలీ జద్రాన్ కూడా ఆఫ్ఘన్ అంతర్జాతీయ క్రికెటరు.
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | ముజీబ్ ఉర్ రహమాన్ జద్రాన్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | ఖోస్త్, ఆఫ్ఘనిస్తాన్ | 2001 మార్చి 28||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 5 అ. 11.5 అం. (1.82 మీ.) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలరు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు |
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక టెస్టు (క్యాప్ 7) | 2018 జూన్ 14 - ఇండియా తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 43) | 2017 డిసెంబరు 5 - ఐర్లాండ్ తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2023 సెప్టెంబరు 5 - శ్రీలంక తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 88 | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 36) | 2018 ఫిబ్రవరి 5 - జింబాబ్వే తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2023 జూలై 16 - బంగ్లాదేశ్ తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 88 | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2017–present | Spin Ghar Region | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2017 | Boost Defenders | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2017–2020 | Comilla విక్టోరియాns | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018–2020 | కింగ్స్ XI పంజాబ్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018 | హాంప్‌షైర్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018–present | Nangarhar Leopards | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018/19–2021/22 | Brisbane Heat | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2019, 2021 | మిడిల్‌సెక్స్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2020 | జమైకా Tallawahs | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2021-present | Peshawar Zalmi | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2021 | సన్ రైజర్స్ హైదరాబాద్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2021 | Northern Superchargers | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2023- present | ఫార్చూన్ బరిషాల్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2022 | [B Love Kandy]] | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2022/23 | Melbourne Renegades | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 18 February 2023 |
దేశీయ, T20 ఫ్రాంచైజీ కెరీర్
మార్చు2017 ఆగస్టు 10 న రహమాన్, 2017 ఘాజీ అమానుల్లా ఖాన్ ప్రాంతీయ వన్డే టోర్నమెంట్‌లో స్పీన్ ఘర్ రీజియన్‌కు తన తొలి లిస్ట్ A క్రికెట్ ఆడాడు [4] అతను 2017 ష్పగీజా క్రికెట్ లీగ్‌లో 2017 సెప్టెంబరు 11 [5] లో బూస్టు డిఫెండర్స్ తరఫున తన ట్వంటీ20 రంగప్రవేశం చేసాడు. 2017 నవంబరులో, అతను 2017–18 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ సీజన్ కోసం కొమిల్లా విక్టోరియన్స్‌తో సంతకం చేశాడు. [6]
2018 జనవరిలో, 2018 IPL వేలంలో కింగ్స్ XI పంజాబ్ అతన్ని కొనుగోలు చేసింది. [7] [8] 2018 ఏప్రిల్ 8న, 17 సంవత్సరాల 11 రోజుల వయస్సులో, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడిన అతి పిన్న వయస్కుడైన క్రికెటరయ్యాడు. [9]
2018 మేలో, అతను ఇంగ్లాండ్‌లో 2018 t20 బ్లాస్టు టోర్నమెంట్‌లో ఆడేందుకు హాంప్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్‌తో సంతకం చేశాడు. [10] 2018 సెప్టెంబరులో, అతను ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటు మొదటి ఎడిషన్‌లో నంగర్హర్ జట్టులో ఎంపికయ్యాడు. [11] అతను టోర్నమెంట్‌లో తొమ్మిది మ్యాచ్‌లలో పన్నెండు అవుట్‌లతో, నంగర్‌హర్ లెపర్డ్స్ జట్టుకు జాయింట్ లీడింగ్ వికెట్-టేకరయ్యాడు. [12]
2019 ఫిబ్రవరిలో, అతను ఇంగ్లండ్‌లో 2019 టి20 బ్లాస్టు టోర్నమెంట్‌లో ఆడేందుకు మిడిల్‌సెక్స్ కౌంటీ క్రికెట్ క్లబ్‌తో సంతకం చేశాడు. [13] 2019 నవంబరులో, అతను 2019–20 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో కుమిల్లా వారియర్స్ తరపున ఆడేందుకు ఎంపికయ్యాడు. [14] 2020 డిసెంబరు 30న, 2020–21 బిగ్ బాష్ లీగ్ సీజన్‌లో, అతను హోబార్ట్ హరికేన్స్‌పై బ్రిస్బేన్ హీట్ తరఫున 15 పరుగులకు 5 వికెట్లతో T20 క్రికెట్‌లో తన మొదటి ఐదు వికెట్ల పంట సాధించాడు. [15] 2021 ఫిబ్రవరిలో, 2021 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ముందు జరిగిన IPL వేలంలో ముజీబ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. [16]
అంతర్జాతీయ కెరీర్
మార్చుఅతను 2017 ACC అండర్-19 ఆసియా కప్‌లో ఐదు మ్యాచ్‌లలో ఇరవై వికెట్లతో అగ్రస్థానంలో నిలిచాడు, ఇది ఆఫ్ఘనిస్తాన్ వారి తొలి ACC అండర్-19 కప్ టైటిల్‌ను గెలుచుకోవడంలో సహాయపడింది. [17] ఈ ప్రదర్శన ఫలితంగా, అతను 2017 డిసెంబరులో ఐర్లాండ్‌తో జరిగిన వారి సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ యొక్క వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే) జట్టులో ఎంపికయ్యాడు. [18] అతను 2017 డిసెంబరు 5న ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ తరపున తన వన్‌డే రంగప్రవేశం చేసాడు [19] తొలిమ్యాచ్‌లో తన 10 ఓవర్ల కోటాలో [20] 24 పరుగులకు 4 వికెట్లు పడగొట్టి, జట్టును 138 పరుగుల తేడాతో గెలిపించాడు. అతని ప్రదర్శనకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. [21]
2017 డిసెంబరులో, అతను 2018 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టులో ఎంపికయ్యాడు. [22] అతను 2018 ఫిబ్రవరి 5న జింబాబ్వేపై ఆఫ్ఘనిస్తాన్ తరపున తన ట్వంటీ20 ఇంటర్నేషనల్ (T20I) రంగప్రవేశం చేసాడు [23] 2018 ఫిబ్రవరి 16న షార్జాలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో, ముజీబ్ తన తొలి వన్‌డేలో ఐదు వికెట్లు సాధించాడు. [24] వన్డేల్లో ఐదు వికెట్లు తీసిన అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచి, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా కూడా ఎంపికయ్యాడు. [25] [26]
2018 ఫిబ్రవరిలో, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి), 2018 క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్ టోర్నమెంట్‌కు ముందు గమనించవలసిన పది మంది ఆటగాళ్లలో ముజీబ్ ఒకరిగా పేర్కొంది. [27] 2018 మార్చి 15న వరల్డ్ కప్ క్వాలిఫైయర్‌లో సూపర్ సిక్స్‌ల మొదటి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై 33 పరుగులకు 3 వికెట్లు తీశాడు. అతను రషీద్ ఖాన్ బౌలింగ్‌లో క్యాచ్ తీసుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ 3 వికెట్ల తేడాతో గెలిచింది. ముజీబ్ తన మూడవ వన్‌డే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. [28]
2018 క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్ ఫైనల్లో, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ముజీబ్ 9.5 ఓవర్లలో 4/43 సాధించాడు. ఆఫ్ఘనిస్తాన్ వెస్టిండీస్‌ను 204 స్కోరుకు పరిమితం చేయడంలో ఇది సహాయపడింది. [29] 205 పరుగుల లక్ష్యాన్ని ఆఫ్ఘనిస్థాన్ మరో పది ఓవర్లు మిగిలి ఉండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించి, తొలి ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ క్వాలిఫయర్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. [30] [31] [32] అతను టోర్నమెంట్‌లో 17 వికెట్లతో సహచర మణికట్టు స్పిన్నర్, రషీద్ ఖాన్, స్కాట్లాండ్‌కు చెందిన సఫ్యాన్ షరీఫ్‌లతో కలిసి ఉమ్మడిగ అత్యధిక వికెట్లు తీసుకున్నాడు.[33]
క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్ టోర్నమెంట్ ముగిసిన తరువాత ఐసిసి, ముజీబ్‌ను ఆఫ్ఘనిస్తాన్ జట్టులో రైజింగ్ స్టార్‌గా పేర్కొంది. [34]
2018 మేలో, అతను భారతదేశంతో ఆడిన వారి ప్రారంభ టెస్టు మ్యాచ్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టులో ఎంపికయ్యాడు. [35] [36] అతను 2018 జూన్ 14న భారతదేశానికి వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్ తరపున టెస్టుల్లో అడుగుపెట్టాడు.[37] ముజీబ్ టెస్టు మ్యాచ్‌లోనే తన తొలి ఫస్టు క్లాస్ ఆడిన ఆరో ఆటగాడిగా, మొదటి ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడిగానూ నిలిచాడు. [38] అతను 21వ శతాబ్దంలో పుట్టిన మొట్టమొదటి టెస్టు క్రికెట్ ఆటగాడు, వారి దేశ ప్రారంభ టెస్టు మ్యాచ్‌లో (17 సంవత్సరాల 78 రోజులు) ఆడిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడు.[39] [40] అతని మొదటి, ఏకైక టెస్టు వికెట్ చతేశ్వర్ పుజారా.
2019 ఏప్రిల్లో, అతను 2019 క్రికెట్ ప్రపంచ కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టులో ఎంపికయ్యాడు. [41] [42] ప్రపంచ కప్ తర్వాత, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ముజీబ్‌ను జట్టులో రైజింగ్ స్టార్‌గా పేర్కొంది. [43]
2021 సెప్టెంబరులో అతను, 2021 ఐసిసి పురుషుల T20 ప్రపంచ కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టులో ఎంపికయ్యాడు. [44] టోర్నమెంట్‌లో ఆఫ్ఘనిస్తాన్ మొదటి మ్యాచ్‌లో, స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో, ముజీబ్ ఇరవై పరుగులకు ఐదు వికెట్లతో T20I క్రికెట్‌లో తన మొదటి ఐదు వికెట్లు తీసుకున్నాడు. [45] దీంతో టీ20 ప్రపంచకప్‌లో రంగప్రవేశం లోనే ఐదు వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా కూడా నిలిచాడు. [46]
వ్యక్తిగత జీవితం
మార్చు2020లో, అతను 19 సంవత్సరాల వయస్సులో కాబూల్‌లో పెళ్ళి చేసుకున్నాడు [47]
మూలాలు
మార్చు- ↑ "20 cricketers for the 2020s". The Cricketer Monthly. Retrieved 6 July 2020.
- ↑ "Mujeeb Ur Rahman continues to makes history". International Cricket Council. Retrieved 17 February 2018.
- ↑ "Which bowler has dismissed the most opening batsmen in Tests?". ESPN Cricinfo. Retrieved 22 October 2019.
- ↑ "1st Match, Ghazi Amanullah Khan Regional One Day Tournament at Khost, Aug 10, 2017". ESPN Cricinfo. Retrieved 10 August 2017.
- ↑ "1st Match, Shpageeza Cricket League at Kabul, Sep 11 2017". ESPN Cricinfo. Retrieved 11 September 2017.
- ↑ "Comilla sign 16-year old Afghanistan offspinner Mujeeb Zadran". ESPN Cricinfo. Retrieved 24 November 2017.
- ↑ "List of sold and unsold players". ESPN Cricinfo. Retrieved 27 January 2018.
- ↑ "U19 World Cup stars snapped up in IPL auction". International Cricket Council. Retrieved 28 January 2018.
- ↑ "Rahul floors Daredevils with fastest IPL fifty". ESPN Cricinfo. Retrieved 8 March 2018.
- ↑ "Hampshire trust in Mujeeb to bring Blast campaign to life". ESPN Cricinfo. Retrieved 17 May 2018.
- ↑ "Afghanistan Premier League 2018 – All you need to know from the player draft". CricTracker. Retrieved 10 September 2018.
- ↑ "Afghanistan Premier League, 2018/19 - Nangarhar Leopards: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 19 October 2018.
- ↑ "Mujeeb Ur Rahman joins Middlesex for Vitality Blast campaign". ESPN Cricinfo. Retrieved 11 February 2019.
- ↑ "BPL draft: Tamim Iqbal to team up with coach Mohammad Salahuddin for Dhaka". ESPN Cricinfo. Retrieved 18 November 2019.
- ↑ "Hobart Hurricanes stunned by Afghanistan tweaker Mujeeb Ur Rahman". News.com.au. Retrieved 30 December 2020.
- ↑ "IPL 2021 auction: The list of sold and unsold players". ESPN Cricinfo. Retrieved 18 February 2021.
- ↑ "Faizi ton, Mujeeb five-for hand Afghanistan maiden U-19 Asia Cup title". ESPN Cricinfo. Retrieved 24 November 2017.
- ↑ "Mujeeb Zadran called for the ODI Series against Ireland". Afghanistan Cricket Board. Archived from the original on 3 డిసెంబరు 2017. Retrieved 2 December 2017.
- ↑ "1st ODI (D/N), Ireland tour of United Arab Emirates at Sharjah, Dec 5 2017". ESPN Cricinfo. Retrieved 5 December 2017.
- ↑ "Preview: Afghanistan U19 v Pakistan U19". International Cricket Council. Retrieved 12 January 2018.
- ↑ "Teenager Mujeeb Zadran spins out Ireland". ESPN Cricinfo. Retrieved 5 December 2017.
- ↑ "Mujeeb Zadran in Afghanistan squad for Under-19 World Cup". ESPN Cricinfo. Retrieved 7 December 2017.
- ↑ "1st T20I (N), Zimbabwe tour of United Arab Emirates at Sharjah, Feb 5 2018". ESPN Cricinfo. Retrieved 5 February 2018.
- ↑ "Mujeeb's maiden five-for seals Afghanistan's series win". ESPN Cricinfo. Retrieved 16 February 2018.
- ↑ "Mujeeb Zadran, Rashid Khan, Mohammad Nabi fold Zimbabwe for 134 in 4th ODI". Cricket Country. Retrieved 16 February 2018.
- ↑ "Spin once again Zimbabwe's downfall as Afghanistan seal series". International Cricket Council. Retrieved 16 February 2018.
- ↑ "10 stars to look out for at CWCQ". International Cricket Council. 27 February 2018. Retrieved 27 February 2018.
- ↑ "21st Match, Super Sixes, ICC World Cup Qualifiers at Harare, Mar 15 2018". ESPNcricinfo. Retrieved 15 March 2018.
- ↑ "Mujeeb, Shahzad Complete Fairytale Comeback With Title Win | TOLOnews". TOLOnews (in ఇంగ్లీష్). Retrieved 26 March 2018.
- ↑ "Final, ICC Cricket World Cup Qualifier at Harare, Mar 25 2018 | Match Report | ESPNCricinfo". ESPNcricinfo. Retrieved 26 March 2018.
- ↑ NDTVSports.com. "ICC World Cup Qualifiers: Afghanistan Thrash West Indies To Win Qualifying Final – NDTV Sports". NDTVSports.com (in ఇంగ్లీష్). Retrieved 26 March 2018.
- ↑ "The rapid rise of Mujeeb Ur Rahman" (in ఇంగ్లీష్). Retrieved 26 March 2018.
- ↑ "The Rapid Rise Of Mujeeb Zadran | TOLOnews". TOLOnews (in ఇంగ్లీష్). Retrieved 26 March 2018.
- ↑ "CWCQ 2018 Report Card: Afghanistan". International Cricket Council. Retrieved 26 March 2018.
- ↑ "Afghanistan Squads for T20I Bangladesh Series and on-eoff India Test Announced". Afghanistan Cricket Board. Archived from the original on 29 మే 2018. Retrieved 29 May 2018.
- ↑ "Afghanistan pick four spinners for inaugural Test". ESPN Cricinfo. Retrieved 29 May 2018.
- ↑ "Only Test, Afghanistan tour of India at Bengaluru, Jun 14-18 2018". ESPN Cricinfo. Retrieved 14 June 2018.
- ↑ "Records broken on Day 1 of the India-Afghanistan Test! - The12thMan". www.the12thman.in (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 15 జూన్ 2018. Retrieved 15 June 2018.
- ↑ "Test cricket's first 21st century man arrives". cricket.com.au (in ఇంగ్లీష్). Retrieved 15 June 2018.
- ↑ Desk, India.com Sports (14 June 2018). "IND v AFG: Mujeeb Becomes First 21st-century born Cricketer to Play Tests". India.com (in ఇంగ్లీష్). Retrieved 15 June 2018.
- ↑ "Hamid Hassan picked in Afghanistan's World Cup squad; Naib to captain". ESPN Cricinfo. Retrieved 22 April 2019.
- ↑ "Asghar Afghan included in Gulbadin Naib-led World Cup squad". International Cricket Council. Retrieved 22 April 2019.
- ↑ "CWC19 report card: Afghanistan". International Cricket Council. Retrieved 9 July 2019.
- ↑ "Rashid Khan steps down as Afghanistan captain over team selection". Cricbuzz. Retrieved 9 September 2021.
- ↑ "Mujeeb ur Rahman records five-wicket haul on World Cup debut". SportStar. Retrieved 25 October 2021.
- ↑ "Mujeeb magic and Scotland's record sequence of ducks". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-04-01.
- ↑ Dani, Bipin (2020-11-18). "Aged just 19, Afghanistan's spin sensation Mujeeb Ur Rahman ties the knot". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 2021-01-28.