వ్యాపరపరంగా విలువైన మూలకాలు కలిగిన రాళ్ళను ఖనిజాలు (Ores) అంటారు. ఇవి ఎక్కువగా కలిగియున్న ప్రదేశాలను గనులు (Mines) అంటారు. కొన్ని ఖనిజాలు ప్రత్యేకమైన స్పటికాకృతి మూలంగా పాలిష్ చేసి విలువైన రత్నాలుగా చలామణీ అవుతాయి.

ఇనుప ఖనిజము.
మాంగనీసు ఖనిజము.
సీసపు ఖనిజము.
బంగారపు ఖనిజము.

ఖనిజాలలోని మూలకాలకు ఈ క్రింది లక్షణాలుండాలి:

  • అవి విలువైనవిగా ఉండాలి
  • వాటి సాంధ్రత ఎక్కువగా ఉండి వ్యాపారపరంగా లాభసాటిగా ఉండాలి.
  • వాటిని రాతి భాగాల నుండి సాంకేతికంగా వేరుచేయగలిగి ఉండాలి.

కొన్ని ఖనిజాలు తక్కువ శాతం లేదా వేరుచేయలేని విధంగా కూడా ఉండవచ్చును. విలువ తక్కువగా ఉండే ఖనిజాలను వ్యర్ధపదార్ధాలుగా లెక్కించవచ్చును. ఖనిజాలలోని మూలకాల గ్రేడు లేదా సాంధ్రత, వాటిని ఉత్పత్తి చేయడానికి అయ్యే ఖర్చుల మీద ఆ మూలకపు లేదా లోహపు విలువ ఆధారపడి ఉంటుంది.

ఖనిజాలలోని మూలకాలు సాధారణంగా ఆక్సైడ్లు, సల్ఫైడ్లు, సిలికేట్లు మొదలైన రూపాలలో ఉంటాయి. బంగారం వంటి కొన్ని ఉస్కృష్టమైన లోహాలు సమ్మేళనాలుగా కాకుండా లభిస్తాయి.

ముఖ్యమైన ఖనిజాలు

మార్చు

మూలాలు

మార్చు