ముదివర్తి కొండమాచార్యులు

తెలుగు పండితుడు, రచయిత

ముదివర్తి కొండమాచార్యులు నెల్లూరు జిల్లా గూడూరు వాస్తవ్యుడు. ఇతడు 1923, సెప్టెంబర్ 2న జన్మించాడు. ఇతడు మద్రాసు విశ్వవిద్యాలయం నుండి ‘విద్వాన్‌’ పట్టా పుచ్చుకున్నాడు. నెల్లూరు జిల్లా పరిషత్తు ఉన్నతపాఠశాలల్లో 30 సం||లు ప్రధానాంధ్రపండితుడిగా పనిచేసి ఉద్యోగ విరమణచేశాడు. 1980లో తిరుమల తిరుపతి దేవస్థానంవారి పుస్తక ప్రచురణ విభాగంలో ఉపసంపాదకునిగా చేరి ఆ విభాగం సంచాలకునిగా పనిచేశాడు[1].

ముదివర్తి కొండమాచార్యులు
జననం(1923-09-02)1923 సెప్టెంబరు 2
India
వృత్తిపండితుడు, రచయిత, కవి
ప్రసిద్ధిబ్రహ్మగాంధర్వము
మతంహిందూ

రచనలు మార్చు

వీరి రచనల్లో కొన్ని తిరుమల తిరుపతి దేవస్థానముల ఈ-బుక్స్ ద్వారా చదువుకొనడానికి అందుబాటులోకి తేబడ్డాయి.[2]

  • హిందూ ధర్మ పరిచయము, స్తోత్ర మంజరి - సముద్రాల లక్ష్మణయ్యతో కలిసి
  • ముకుందమాల (టి. లక్ష్మణాచార్యుల టీకాతాత్పర్యసహితము) (సంపాదకులు: ముదివర్తి)[3]
  • చ్యవనమహర్షి
  • అన్నమయ్య విన్నపాలు
  • ఆనంద నిలయము
  • అమృతసారము
  • శ్రీనివాసతేజము
  • బ్రహ్మగాంధర్వము, 1988 (అన్నమాచార్యులవారి ఆధ్యాత్మసంకీర్తనలకు సీసపద్యానుసరణము) [4]
  • మధూకమాల
  • కూనలమ్మ
  • వీరమనీడు
  • ధర్మదీక్ష - ఖండకావ్యం
  • నారాయణమ్మ
  • త్యాగమూర్తి చారిత్రక నవల
  • రాజర్షి
  • కనిష్ఠ భిక్షువు
  • కుమార రాముడు
  • పూర్ణాహుతి
  • వకుళమాల (కథలసంపుటి, మొదటి ముద్రణ: 1949)[5]

మూలాలు మార్చు

  1. ఎమెస్కో బుక్స్ వారి జాలస్థలిలో ముదివర్తి కొండమాచార్య వివరాలు[permanent dead link]
  2. తిరుమల.ఆర్గ్ లో విద్వాన్ ముదివర్తి కొండమాచార్యులు.
  3. https://archive.org/details/in.ernet.dli.2015.385258/mode/2up
  4. ముదివర్తి కొండమాచార్యులు (1988). బ్రహ్మగాంధర్వము. తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానములు. Retrieved 20 September 2020.
  5. ముదివర్తి కొండమాచార్యులు (1949). వకుళమాల. నెల్లూరు: వడ్లమూడి రామయ్య. Retrieved 20 September 2020.