మున్నంగివారిపాలెం

ఆంధ్రప్రదేశ్, బాపట్ల జిల్లా, యద్దనపూడి మండలంలోని గ్రామం


మున్నంగివారిపాలెం, బాపట్ల జిల్లా, యద్దనపూడి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఈ గ్రామం జాగర్లమూడికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. రవాణాసౌకర్యాలు బాగా లేవు. మార్టూరు లేక పర్చూరు నుండి ఆటోలో చేరుకోవాలి.ఈ కుగ్రామం జనాభా 250 మంది. చెరుకూరి నాగేశ్వరరావు ప్రస్తుత గ్రామ సర్పంచిగా ఉన్నారు. ఈ కుగ్రామం, వ్యవసాయ రంగంతో పాటుగా విద్యా, వ్యాపార, ఉద్యోగ రంగాలలో అబివృద్ధి చెందినదనుటలో సందేహం లేదు. విదేశాలలో కూడా ఈ గ్రామ వాసులు ఉద్యోగ, వ్యాపార రంగాలలో రాణిస్తున్నారు.

మున్నంగివారిపాలెం
గ్రామం
పటం
మున్నంగివారిపాలెం is located in ఆంధ్రప్రదేశ్
మున్నంగివారిపాలెం
మున్నంగివారిపాలెం
అక్షాంశ రేఖాంశాలు: 16°1′15.600″N 80°5′6.000″E / 16.02100000°N 80.08500000°E / 16.02100000; 80.08500000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల
మండలంయద్దనపూడి
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )

ఈ గ్రామం నుండి పలువురు ఆఫ్రికా ఖండంలోని ఉగాండాకు వ్యాపార నిమిత్తం తరలి వెళ్ళినారు. అందులో మాజీ సర్పంచి శ్రీ మున్నంగి బ్రహ్మారెడ్డి కుమారులు శ్రీ మున్నంగి సీతారామిరెడ్డి, మహేశ్వరరెడ్డి కూడా ఉన్నారు. దశాబ్దాల క్రితం వెళ్ళిన వీరిరువురూ, గ్రామాభివృద్ధికి ఆర్థిక సాయం అందించారు. గ్రామస్తుల దాహార్తి తీర్చేటందుకు మూడు సంవత్సరాల క్రితం, 25 లక్షల రూపాయలతో మంజూరయిన పైలట్ ప్రాజెక్టుకు, ప్రజల భాగస్వామ్యం క్రింద 4 లక్షల రూపాయలు, వారిద్దరూ సమకూర్చారు. రు. 5 లక్షలతో సిమెంటు రహదార్ల నిర్మాణానికి, ఒకటిన్నర లక్షల మ్యాచింగు గ్రాంటు., ఆలయంలో నేల చదును చేయడానికి మరో లక్షన్నర, గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు క్రీడా పరికరాలు, కంప్యూటరు కొనుగోలుకు ఒక లక్ష రూపాయలు, సమకూర్చి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. వీరితోపాటు గ్రామానికి చెందిన మరో 15 మంది గ్రామస్థులు ఉగాండాలోనే ఉన్నారు. అమెరికాలో నలుగురు, సాఫ్ట్ వేర్ ఉద్యోగాలలో మరో 20 మంది గ్రామస్థులు స్థిరపడినారు.

గ్రామ పంచాయతీ

మార్చు

ఈ గ్రామ పంచాయతీకి 2013, జూలై 23న జరిగిన ఎన్నికలలో చెరుకూరి పెద నాగేశ్వరరావు, ఒక్క ఓటు మెజారిటీతో, సర్పంచి పదవిని దక్కించుకున్నారు.

మూలాలు

మార్చు