మురసోలి మారన్

భారతీయ రాజకీయ నాయకుడు
(మురసోలి మారన్‌ నుండి దారిమార్పు చెందింది)

మురసోలి మారన్ తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి. ఆయన ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) పార్టీ సీనియర్ నాయకుడు.[2] ఆ పార్టీ వ్యవస్థాపక నేత, ఎం.కరుణానిధికి మేనల్లుడు. అయన 2003 నవంబరు 23లో ఆనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలో మరణించాడు.[3][4]

మురసోలి మారన్‌
మురసోలి మారన్


కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి
పదవీ కాలం
1989 డిసెంబరు 2 – 1990 నవంబరు 10
ప్రధాన మంత్రి వీపీ. సింగ్

వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ
పదవీ కాలం
1999 – 2002
ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి
ముందు రామకృష్ణ హెగ్డే
తరువాత అరుణ్ శౌరీ
పదవీ కాలం
1996 జూన్ 1 – 1998 మార్చి 19
ప్రధాన మంత్రి హెచ్.డి. దేవే గౌడ
ఐ.కె. గుజ్రాల్

లోక్ సభ సభ్యుడు
పదవీ కాలం
1996 – 2003
ముందు ఎర ఆన్బరాసు
తరువాత దయానిధి మారన్
నియోజకవర్గం చెన్నై సెంట్రల్
పదవీ కాలం
1967 – 1977
ముందు సి.ఎన్. అన్నాదురై
తరువాత రామస్వామి వెంకటరామన్
నియోజకవర్గం చెన్నై సెంట్రల్

రాజ్యసభ సభ్యుడు
పదవీ కాలం
1977 – 1995
నియోజకవర్గం తమిళనాడు

వ్యక్తిగత వివరాలు

జననం (1934-08-17)1934 ఆగస్టు 17
తిరుక్కువలై , మద్రాస్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా (ఇప్పుడు in తిరువరూర్ జిల్లా, తమిళనాడు), భారతదేశం)
మరణం 2003 నవంబరు 23(2003-11-23) (వయసు 69)[1]
[చెన్నై]], తమిళనాడు, భారతదేశం
రాజకీయ పార్టీ ద్రావిడ మున్నేట్ర కజగం (డీఎంకే)
తల్లిదండ్రులు తండ్రి: షణ్ముగసుందరం
తల్లి : షణ్ముగసుందరి
జీవిత భాగస్వామి మల్లికా మారన్
సంతానం కళానిధి మారన్
దయానిధి మారన్
ఆన్బుకరాసి
నివాసం చెన్నై, తమిళనాడు, భారతదేశం
పూర్వ విద్యార్థి పచైయప్పస్ కాలేజీ , మద్రాస్ లా కాలేజీ
నవంబరు 23, 2003నాటికి

వ్యక్తిగతం మార్చు

మురసోలి మారన్‌ 1934 ఆగస్టు 17లో షణ్ముగసుందరం, షణ్ముగసుందరి దంపతులకు తమిళనాడు రాష్ట్రం, తిరుక్కువలై గ్రామంలో జన్మించాడు. తల్లి షణ్ముగ సుందరి, డిఎంకె నాయకుడు కరుణానిధికి సోదరి. మారన్‌కు తల్లిదండ్రులు పెట్టిన పేరు త్యాగరాజ సుందరం. తరువాతి కాలంలో ఈ సంస్కృత పేరును మార్చుకుని అచ్చతమిళ పేరు మారన్ అని అతడే పెట్టుకున్నాడు.[5]

స్వగ్రామంలోనే ప్రాథమిక విద్యను పూర్తి చేసి, ఉన్నత చదువులకోసం మద్రాసు వెళ్ళాడు. చెన్నైలోని పచ్చయప్ప కళాశాలలో ఎంఏ (ఆర్ట్స్) పూర్తి చేశాడు.

మారన్ 1963లో మల్లికను వివాహమాడాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు - కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్, సన్ నెట్ వర్క్ సీఈఓ కళానిధి మారన్ - ఒక కూతురు అన్బుకారసి మారన్ (కార్డియాలజిస్టు) ఉన్నారు.

వృత్తిగతం మార్చు

పాత్రికేయుడుగా మార్చు

ఆయన రాజకీయాల్లోకి రాకముందు కొన్నాళ్లు జర్నలిస్టుగా పనిచేశాడు. కరుణానిధి స్థాపించిన "మురసోలి" పత్రికకు సంపాదకుడుగా పనిచేసాడు. అప్పుడే తన పేరుకు ముందు మురసోలి అని తగిలించుకున్నాడు.[5]

సినీ రంగం మార్చు

మురసోలి మారన్ తమిళ సినిమాలకు స్క్రీన్ ప్లే, మాటలు అందించాడు. 5 చిత్రాలను నిర్మించి 2 చిత్రాలకు దర్శకత్వం వహించాడు.

సినీ రచయితగా మార్చు

  • కుల దైవం (1956)
  • అన్నైయిన్ (1958)
  • అన్బు ఎంగే (1958)
  • తలై కొడుతాన్ తంబీ (1959)
  • సహోదరి (1959)
  • నాళ్ల తీర్పు (1959)

నిర్మాతగా మార్చు

  • పిల్లైయో పిళ్ళై (1972)
  • మరక్క ముడియుమా? (1966)

దర్శకుడిగా మార్చు

  • మరక్క ముడియుమా? (1966)

రాజకీయాలు మార్చు

రాజకీయాలో డిఎంకె పార్టీ తరపున మారన్ కీలకమైన బాధ్యతలు నిర్వహించాడు. ఢిల్లీలో మారన్ ఆ పార్టీకి ప్రతినిధిగా ఉంటూ, పార్టీకు రాజకీయ పొత్తులు కుదర్చడంలో కీలకమైన పాత్ర నిర్వహించాడు. 1967 ఉండి అనేక పర్యాయాలు లోక్‌సభకు ఎన్నికయ్యాడు.[5]

నిర్వహించిన పదవులు మార్చు

  • 1967: లోక్ సభకు ఎన్నిక
  • 1971: ఉప ఎన్నికల్లో లోక్ సభకు తిరిగి ఎన్నిక
  • 1977–1995: రాజ్యసభ సభ్యుడు
  • 1977–1995: రాజ్యసభ సభ్యుడిగా- పబ్లిక్ అండర్‌టేకింగ్స్‌పై కమిటీలో మూడు పర్యాయాలు సభ్యుడిగా చేశాడు
  • 1980–1982: సభ్యుడు, సాధారణ ప్రయోజనాల కమిటీ
  • 1980–1982, 1991-1995: సభ్యుడు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ
  • 1982–1983, 1987-1988: సభ్యుడు, ఎస్సి & ఎస్టీ సంక్షేమ కమిటీ
  • 1988–1989: సభ్యడు, సబార్డినేట్ లెజిస్లేషన్
  • 1989-1990: కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి
  • 1992–1993: విచారణ కమిటీ సభ్యుడు, ఉభయ సభల సెక్యూరిటీలు, బ్యాంకింగ్ లావాదేవీలలో అవకతవకలు
  • 1996: లోక్ సభ సభ్యుడిగా మూడవసారి ఎన్నిక
  • 1996-1998: వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ
  • 1998: లోక్ సభ సభ్యుడిగా నాల్గొవసారి ఎన్నిక
  • 1999:లోక్ సభ సభ్యుడిగా ఐదవసారి ఎన్నిక
  • 1999-2002: వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ [6]

మూలాలు మార్చు

  1. "RAJYA SABHA MEMBERS BIOGRAPHICAL SKETCHES 1952 - 2003" (PDF). Rajya Sabha. Retrieved 25 March 2019.
  2. Parliament of India LOK SABHA. "Members : Lok Sabha". 164.100.47.194. Retrieved 3 May 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  3. The Financial Express (24 November 2003). "Murasoli Maran Passes Away". Archived from the original on 3 మే 2021. Retrieved 3 May 2021.
  4. 5.0 5.1 5.2 SUBRAMANIAN, T. S. "A man of many parts". Frontline (in ఇంగ్లీష్). Archived from the original on 2021-05-04. Retrieved 2021-05-04.
  5. The Economic Times (31 March 2002). "Maran launches 'Focus: Africa' programme". Archived from the original on 3 మే 2021. Retrieved 3 May 2021.