ముర్తుజా బేగ్

భారత మాజీ క్రికెటర్.

ముర్తుజా అలీ బేగ్ ( 8 నవంబరు 1941 - 17 జూలై 2015) తెలంగాణకు చెందిన భారత మాజీ క్రికెటర్. 1958, 1971 మధ్యకాలంలో హైదరాబాదు, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం క్రికెట్ జట్ల తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు.

ముర్తుజా బేగ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ముర్తుజా అలీ బేగ్
పుట్టిన తేదీ(1941-11-08)1941 నవంబరు 8
హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
మరణించిన తేదీ2015 జూలై 17(2015-07-17) (వయసు 73)
బంజారా హిల్స్, హైదరాబాదు, తెలంగాణ
బ్యాటింగుకుడిచేతి
బౌలింగుకుడిచేతి ఆఫ్ స్పిన్
బంధువులుఅబ్బాస్ అలీ బేగ్ (అన్న)
మజ్హర్ అలీ బేగ్ (తమ్ముడు)
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1958-59 to 1970-71హైదరాబాదు క్రికెట్ జట్టు
1961 to 1964ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం క్రికెట్ క్లబ్
కెరీర్ గణాంకాలు
పోటీ ఫస్ట్
మ్యాచ్‌లు 48
చేసిన పరుగులు 1898
బ్యాటింగు సగటు 27.50
100లు/50లు 1/10
అత్యుత్తమ స్కోరు 103
వేసిన బంతులు 474
వికెట్లు 6
బౌలింగు సగటు 49.83
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు
అత్యుత్తమ బౌలింగు 4/44
క్యాచ్‌లు/స్టంపింగులు 13/–

ముర్తుజా 1941, నవంబరు 8న తెలంగాణలోని హైదరాబాదులో జన్మించాడు.

క్రీడారంగం

మార్చు

ముర్తుజా 1958-59లో జరిగిన రంజీ ట్రోఫీలో హైదరాబాదు క్రికెట్ జట్టు తరఫున మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా తొలిసారిగా క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. ఆ సీజన్‌లో ఒకసారి, 1959-60లో మూడుసార్లు ఆడాడు.

హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదివిన తరువాత ఆక్స్ఫర్డ్ లోని న్యూ కాలేజీకి వెళ్ళాడు. 1961, 1964 మధ్యకాలంలో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం తరపున 28సార్లు క్రికెట్ ఆడి, 27.53 సగటుతో 1349 పరుగులు చేశాడు.[1] 1962లో డెర్బీషైర్‌పై 103 పరుగుల అత్యధిక స్కోరు చేశాడు.[2] కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంతో జరిగిన వార్షిక మ్యాచ్‌లో అతను మూడుసార్లు ఆడాడు; 1962లో అతని సోదరుడు అబ్బాస్ కూడా జట్టులో అడాడు, ఇన్నింగ్స్ మొదటి బంతికి ఆక్స్ఫర్డ్ మొదటి వికెట్ కోల్పోయిన తరువాత ఇద్దరూ కలిసి రెండవ వికెట్ కు 72 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నారు.[3]

భారతదేశానికి తిరిగి వచ్చి 1965-66, 1970-71 మధ్యకాలలో హైదరాబాదు క్రికెట్ జట్టు తరఫున ఆడాడు. 1966-67లో హైదరాబాదు క్రికుట్ జట్టు తరపున ఆంధ్రా క్రికెట్ జట్టుతో ఆడినపుడు అత్యధిక స్కోరు 83 పరుగులు చేసి, రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు.[4]

తన భార్య దిల్నాజ్‌తో కలిసి హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో నివసిస్తున్న ముర్తుజా[5] 2015 జూలై 17న తన స్వగృహంలో మరణించాడు.[6]

మూలాలు

మార్చు
  1. Murtuza Ali Baig batting by team
  2. Oxford University v Derbyshire 1962
  3. Wisden Cricketers' Almanack 1963, pp. 354-55.
  4. Andhra v Hyderabad 1966-67
  5. Contemporising traditions Retrieved మే 16 2014.
  6. "Ex-Cricketer Murtuza Baig Passes Away". Press Reader. Retrieved మార్చి 22 2021. {{cite web}}: Check date values in: |access-date= (help)

బయటి లింకులు

మార్చు