ముస్తాక్ మహ్మద్

పాకిస్తాన్ క్రికెట్ కోచ్, మాజీ క్రికెటర్

ముస్తాక్ మహ్మద్ (జననం 1943, నవంబరు 22) పాకిస్తాన్ క్రికెట్ కోచ్, మాజీ క్రికెటర్. 1959 నుండి 1979 వరకు 57 టెస్టులు, 10 వన్డేలు ఆడాడు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ గా, లెగ్ స్పిన్నర్ గా రాణించాడు. పాకిస్తానీ ఆల్-రౌండర్లలో ఒకడిగా ఉన్నాడు. పంతొమ్మిది టెస్టు మ్యాచ్‌లలో కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఒకే టెస్ట్ మ్యాచ్‌లో రెండుసార్లు ఒక ఇన్నింగ్స్‌లో సెంచరీ, ఐదు వికెట్లు తీసిన ఏకైక పాకిస్తానీ ఆటగాడిగా నిలిచాడు.[1]

ముస్తాక్ మహ్మద్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1943-11-22) 1943 నవంబరు 22 (వయసు 80)
జునాగఢ్, జునాగఢ్ రాష్ట్రం, బ్రిటిష్ ఇండియా
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడి చేయి లెగ్‌బ్రేక్ గూగ్లీ
పాత్రఆల్ రౌండర్
బంధువులువజీర్ మొహమ్మద్ (సోదరుడు)
రయీస్ మొహమ్మద్ (సోదరుడు)
హనీఫ్ మొహమ్మద్ (సోదరుడు)
సాదిక్ మొహమ్మద్ (సోదరుడు)
షోయబ్ మహ్మద్ (మేనల్లుడు)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 31)1959 మార్చి 26 - వెస్టిండీస్ తో
చివరి టెస్టు1979 మార్చి 24 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 5)1973 ఫిబ్రవరి 11 - న్యూజీలాండ్ తో
చివరి వన్‌డే1978 నవంబరు 3 - ఇండియా తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలుs]] ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 57 10 502 180
చేసిన పరుగులు 3,643 209 31,091 4,471
బ్యాటింగు సగటు 39.17 34.83 42.07 29.22
100లు/50లు 10/19 0/1 72/159 1/24
అత్యుత్తమ స్కోరు 201 55 303* 131
వేసిన బంతులు 5,260 42 47,226 2,090
వికెట్లు 79 0 936 49
బౌలింగు సగటు 29.22 24.34 30.24
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 3 39 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 2 0
అత్యుత్తమ బౌలింగు 5/28 7/18 4/30
క్యాచ్‌లు/స్టంపింగులు 42/– 3/– 349/– 48/–
మూలం: ESPNcricinfo, 2013 మార్చి 14

ఫస్ట్ క్లాస్ క్రికెట్ మార్చు

ముస్తాక్ 13 సంవత్సరాల 41 రోజుల వయస్సులో తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌ను ప్రారంభించాడు. అరంగేట్రంలో 87 పరుగులు, 28 పరుగులకు 5 వికెట్లు తీసుకున్నాడు. స్వదేశంలో కరాచీ, పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు ఆడాడు. 1966 నుండి 1977 వరకు కౌంటీ క్రికెట్‌లో నార్తాంప్టన్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ప్రతి సీజన్‌లో 1,000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు.

502 మ్యాచ్ ల ఫస్ట్-క్లాస్ కెరీర్‌లో 72 సెంచరీలు చేశాడు. 25,000 ఫస్ట్-క్లాస్ పరుగులు చేసిన మొదటి పాకిస్తానీగా నిలిచాడు. 31,091 పరుగులతో ముగించాడు. అత్యధిక స్కోరు 303 నాటౌట్‌గా నిలిచాడు.

టెస్ట్ క్రికెట్ మార్చు

1959, మార్చి 26న లాహోర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో, తన అన్నలు వజీర్, హనీఫ్ తర్వాత టెస్ట్ క్రికెట్‌లోకి ప్రవేశించాడు. మ్యాచ్‌లో 18 పరుగులు చేశాడు.

1970లో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ తరపున ఆడాడు. 1973 ప్రారంభంలో, అతను సిడ్నీలో ఆస్ట్రేలియాపై 121 పరుగులు, ఒక నెల తర్వాత తన తదుపరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 201 పరుగులు చేశాడు. ఒక టెస్ట్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ, ఐదు వికెట్లు తీసిన ఏకైక క్రికెటర్ అయ్యాడు. 86.33 సగటుతో 777 పరుగులతో సంవత్సరాన్ని ముగించాడు.

1976-77 నుండి 1978-79 వరకు 19 టెస్ట్ మ్యాచ్‌లకు పాకిస్తాన్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. 1976-77లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో వెస్టిండీస్‌పై వెస్టిండీస్‌పై 121, 56 పరుగులు చేసి ఎనిమిది వికెట్లు తీశాడు. తద్వారా గార్ఫీల్డ్ సోబర్స్ తర్వాత ఒక టెస్ట్ మ్యాచ్‌లో ఒకటి కంటే ఎక్కువ సందర్భాలలో సెంచరీ చేసి ఐదు వికెట్లు తీసిన రెండవ ఆటగాడిగా కూడా ముస్తాక్ నిలిచాడు.[2] 1978-79లో పద్దెనిమిదేళ్ళ తర్వాత రెండు దేశాలు పరస్పరం తమ మొదటి సిరీస్‌ను ఆడినప్పుడు భారత్‌పై 2-0తో విజయం సాధించాడు.[3]

అవార్డులు మార్చు

  • 1963లో పాకిస్తాన్ అధ్యక్షునిచే ప్రైడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అవార్డు [4]

మూలాలు మార్చు

  1. 5 for and century espncricinfo. Retrieved 10 March 2020
  2. "Records/test matches/all round records/a hundred and five wickets". Retrieved 22 May 2022.
  3. Nadeem F. Paracha (19 September 2013). "Pakistan cricket: A class, ethnic and sectarian history". Dawn. Pakistan. Retrieved 10 March 2020.
  4. Mushtaq Mohammad's Pride of Performance Award on Pakistan Sports Board website Archived 2018-12-26 at the Wayback Machine Retrieved 10 March 2020

బాహ్య లింకులు మార్చు