మూడు కొండలు, విశాఖపట్నం
విశాఖపట్నం వన్ టౌన్ లో పోర్ట్ కు దగ్గర ప్రాంతంలో వేంకటేశ్వర ఆలయం, మసీదు దర్గా లు, చర్చి ఒకే కొండ మీద ఉన్నట్లు ఉంటాయి. అయితే అవి మూడు కొండలు - రాస్ కొండ (రాస్ హిల్), శృంగమణి కొండ, దర్గా కొండలు. పోర్ట్ ఏరియాలోని పాత తపాలా కార్యాలయం (ఓల్డ్ పోస్ట్ ఆఫీస్) నుండి ఈ మూడు కొండలు రైల్వే స్టేషన్ నుంచి ఒక కిలోమీటర్ దూరంలోను , RTC కాంప్లెక్స్ నుండి 5 కిలోమీటర్ల దూరంలోను ఉన్నాయి. ఇవి స్థానికుల మత సామరస్యానికి ప్రత్యేక నిదర్శనంగా నిలిచాయి. ఓడరేవు ఛానల్, ఓడలు, లైనర్‌ల కోసం అంతర్గత నౌకాశ్రయం ప్రవేశ ద్వారాన్ని ఈ కొండల నుండి కనపడుతుంది.
‘శృంగమణి కొండ’పై వేంకటేశ్వర ఆలయం, ‘రాస్ హిల్’పై రాస్ హిల్ చర్చి, ‘దర్గా కొండ’పై బాబా ఇష్క్ మదీనా దర్గా ఉన్నాయి. దర్గా సుమారు 700 ఏళ్లనాటిది కాగా, ఈ ఆలయం రెండు శతాబ్దాల నాటిది. రాస్ హిల్ చర్చి కూడా ఒక శతాబ్దానికి పైగా పాతది.
లార్డ్ వెంకటేశ్వర ఆలయం (శృంగమణి కొండ)
మార్చుప్రవేశ ద్వారం వద్ద ఉన్న పిరమిడ్ ఆకారం లో గోపురం ఉంటుంది. 17వ శతాబ్దం చివరలో, యూరోపియన్ కెప్టెన్ బ్లాక్‌మూర్ నేతృత్వంలోని డచ్ షిప్ వైజాగ్ తీరంలో తీవ్రమైన తుఫాను వలన దెబ్బతింది. బోర్డులోని కార్మికుల ప్రార్థనల వలన ఓడ సురక్షితంగా లోపల ప్రశాంతమైన జలాలకు చేరుకుంది, ఒక పెద్ద బండరాయి సముద్ర జలాల్లోకి తిరిగి లాగబడకుండా అడ్డుకుంది. మరుసటి రోజు, తుఫాను తగ్గినప్పుడు, ఓడను నిలువరించే ‘రాతి’ని శ్రీ వేంకటేశ్వరుని విగ్రహమని భావించి నౌకాశ్రయానికి అభిముఖంగా ఉన్న గంభీరమైన శృంగమణి కొండపై స్థానికులు, ఓడ నావికులు విగ్రహాన్ని ప్రతిష్టించారు.
బాబా ఇష్క్ మదీనా (దర్గా కొండ)
మార్చుఉత్తరాన ఉన్న దర్గా కొండ మీద ఒక మసీదు, ఇంకా బాబా ఇషాక్ మదీనా అనే ముస్లిం సన్యాసి సమాధి ఉంది. అతని ప్రవచనాలను హిందూ, ముస్లిం భక్తులు గౌరవిస్తారు. స్థానిక కథనం ప్రకారం, మక్కా మదీనాకు చెందిన ఈ బాబా ఇషాక్ మదీనా వల్లీ తన అనుచరులతో కలిసి సుమారు 700 సంవత్సరాల క్రితం ఈ కొండపై స్థిరపడ్డాడు. అతను ఔరంగజేబు కలలో ఇచ్చిన ఆదేశం మేరకు దర్గా నిర్మించాడు. ఔరంగజేబు దాని సిబ్బంది నిర్వహణ కోసం భారీ భూములను కూడా మంజూరు చేశాడు. బాబా సమాజానికి భక్తులకు చేసిన సేవకు గుర్తింపుగా విశాఖపట్నాన్ని ‘ఇషాక్ పట్నం’ అని పిలుస్తారని బాబా భక్తుల విశ్వాసం. ఇక్కడ 'పీర్ల పండగ' పెద్ద ఎత్తున జరుగుతుంది.[1]
రాస్ హిల్ చర్చి (రాస్ హిల్)
మార్చుమూడింటిలో మధ్య ఎత్తైన కొండకు 1864లో స్థానిక న్యాయమూర్తి మాన్సియర్ రాస్ పేరు పెట్టారు. 1866లో అప్పటి బిషప్ Msgr J.M. టిస్సోట్ బంగ్లాను స్వాధీనం చేసుకున్నారు ఆగస్ట్ 15, 1867న ఒక బలిపీఠం నిర్మించారు. మరియు అప్పటి వికార్ జనరల్ Fr ఒక ప్రార్థనా మందిరాన్ని నిర్మించాడు. 1870, 1876లో తుఫానుల విధ్వంసం ప్రార్థనా మందిరాన్ని కూడా ప్రభావితం చేసింది. తత్ఫలితంగా, మే 1, 1877న, అవర్ లేడీ ఆఫ్ ది సేక్రేడ్ హార్ట్ యొక్క కొత్త విగ్రహం పునఃస్థాపన చేశారు. ఏప్రిల్ 1942లో విశాఖపట్నంపై జపనీయుల దాడి తరువాత, బిషప్ రౌసిల్లాన్ తన ప్రజలను రాస్ హిల్ రక్షణలోకి తీసుకువెళ్లాడు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి దాడులు జరగలేదు. మొదటి 'థాంక్స్ గివింగ్ ఊరేగింపు' ఫిబ్రవరి 10, 1946 ఆదివారం నాడు జరిగింది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 8వ తేదీ సాయంత్రం సెయింట్ అలోసియస్ స్కూల్ నుండి రాస్ కొండపైకి ఊరేగింపు ఈ వైజాగ్ సంస్కృతి లో అంతర్భాగంగా మారింది.[2]
ఇతర లింకులు
మార్చు- Visakhapuri Mary Matha Shrine Archived 2024-01-23 at the Wayback Machine
- ఇంటాక్ వైజాగ్
మూలాలు
మార్చు- ↑ "Vizag's Three Holy Hills Accentuating Communal Harmony!". YO! VIZAG. 11 June 2024. Retrieved 23 January 2024.
- ↑ "Ross Hill Church Vizag (Timings, History, Built by, Location, Images & Facts)". Vizag Tourism. Retrieved 23 January 2024.