మృగయా
మృగయా, 1976 జూన్ 6న విడుదలైన భారతీయ సినిమా. కె. రాజేశ్వరరావు నిర్మాణంలో మృణాళ్ సేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాల ద్వారా మిధున్ చక్రవర్తి, మమతా శంకర్ ఇద్దరూ సినీరంగంలోకి ప్రవేశించారు. భగవతి చరణ్ పాణిగ్రాహి రాసిన "షికార్" అని ఒడియా కథ ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. బ్రిటిష్ వలస ప్రభుత్వం, స్థానిక గ్రామస్తుల మధ్య సంబంధాలతోపాటు 1920లలో భారత భూస్వాముల దోపిడీని గురించిన తీసిన సినిమా ఇది. గేమ్ వేటలో నైపుణ్యం ఉన్న బ్రిటిష్ అడ్మినిస్ట్రేటర్, నిపుణుడైన స్థానిక గిరిజన విలుకాడిల మధ్య స్నేహాన్ని కూడా ఈ సినిమా వర్ణిస్తుంది.
మృగయా | |
---|---|
దర్శకత్వం | మృణాళ్ సేన్ |
రచన |
|
దీనిపై ఆధారితం | భగవతి చరణ్ పాణిగ్రాహి రాసిన "షికార్" కథ |
నిర్మాత | కె. రాజేశ్వరరావు |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | కెకె మహాజన్ |
కూర్పు | గంగాధర్ నాస్కర్, రాజు నాయక్, దినకర్ శెట్టి |
సంగీతం | సలీల్ చౌదరి |
విడుదల తేదీ | 6 జూన్ 1976 |
దేశం | భారతదేశం |
భాషలు | బెంగాలీ, హిందీ |
ఈ సినిమాకు సలీల్ చౌదరి సంగీతాన్నీ, కెకె మహాజన్ సినిమాటోగ్రఫీని అందించారు. 24వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఈ సినిమాకు జాతీయ ఉత్తమ సినిమా, జాతీయ ఉత్తమ నటుడు విభాగాల్లో అవార్డులు వచ్చాయి. 1977లో జరిగిన 10వ మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గోల్డెన్ ప్రైజ్‌కి నామినేట్ అయి ఉత్తమ సినిమాగా ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డును కూడా గెలుచుకుంది.
నటవర్గం
మార్చు- మిథున్ చక్రవర్తి (గినువా)
- మమతా శంకర్ (డుంగ్రి)
- రాబర్ట్ రైట్ (బ్రిటిష్ అడ్మినిస్ట్రేటర్)
- అసిత్ బందోపాధ్యాయ్
- శేఖర్ ఛటర్జీ
- సాధు మెహర్ డోరా
- జ్ఞానేష్ ముఖర్జీ
- అనూప్ కుమార్
- సజల్ రాయ్ చౌదరి (మనీలెండర్)
- సమిత్ భంజ (షోల్పు)
- టామ్ ఆల్టర్
థీమ్‌లు, ప్రభావాలు
మార్చుఒడియాకు చెందిన కథా రచయిత భగవతి చరణ్ పాణిగ్రాహి రాసిన షికార్ అనే కథ ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది.[1] 1930లలో భారత స్వాతంత్ర్యోద్యమ సమయంలో,[2] ఒక గ్రామంలో కఠినమైన జీవితాన్ని గడిపే గిరిజన ప్రజల జీవితాలను ఈ కథ వివరిస్తుంది. 1930లలో అసలు కథ జరిగినప్పటికీ, 1850లో జరిగిన సంతాల్ తిరుగుబాటు తరహాలో తిరుగుబాటు నేపథ్యంలో ఈ సినిమా స్క్రిప్ట్ సెట్ చేయబడింది.[3]
నిర్మాణం
మార్చుఅప్పటివరకు రాజకీయ సినిమాలు చేస్తున్న మృణాల్ సేన్, ఒక గ్రామ నేపథ్య కథను సినిమాగా తీయాలని నిర్ణయించుకున్నాడు.[4] 1974లో తీసిన కోరస్ సినిమా సరిగా ఆడకపోవడంతో భారీ నష్టాలను వచ్చి, అప్పులు చెల్లించలేకపోయాడు. మృగయా సినిమాను కె. రాజేశ్వరరావు నిర్మించాడు. మృణాల్ సేన్ మొట్టమొదటి కలర్ సినిమా ఇది.[5] ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో తన బోధన సెషన్‌లో ఒక విద్యార్థిగా ఉన్న మిథున్ చక్రవర్తిని చూసి, సినిమాకు ఎంపికచేశాడు.[6] ఉదయ్ శంకర్ కుమార్తె మమతా శంకర్ ను హీరోయిన్ గా తీసుకున్నాడు.[2][7] ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మద్రాసులో జరిగాయి.[5]
స్పందన
మార్చుఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. విమర్శకులు, ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందనలు వచ్చాయి. "కథతో చరిత్ర" కలపడం అనే ఆలోచనను ప్రేక్షకులు ఇష్టపడలేదు.[5] గిరిజనుడిగా మిథున్ నటనకు, మమతా శంకర్ నటనకు ప్రశంసలు వచ్చాయి.[8] సాధు మెహర్, సమిత్ భంజా, సజల్ రాయ్ చౌదరి వంటి నటీనటుల నటనకు మంచి ఆదరణ లభించింది.[3]
అవార్డులు
మార్చుఅవార్డు | వేడుక | విభాగం | గ్రహీతలు | ఫలితం |
---|---|---|---|---|
భారత జాతీయ చలనచిత్ర అవార్డులు | 24వ భారత జాతీయ చలనచిత్ర అవార్డులు (1976) | జాతీయ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ | కె. రాజేశ్వరరావు (నిర్మాత) మృణాళ్ సేన్ (దర్శకుడు) |
గెలుపు[2] |
జాతీయ ఉత్తమ నటుడు | మిధున్ చక్రవర్తి | గెలుపు[2] | ||
ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు | 24వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు (1976) | ఉత్తమ చిత్రంగా క్రిటిక్స్ అవార్డు | కె. రాజేశ్వరరావు | గెలుపు[3] |
మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ | 10 వ మాస్కో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (1977) | గోల్డెన్ సెయింట్ జార్జ్ | మృణాల్ సేన్ | ప్రతిపాదించబడింది[9] |
మూలాలు
మార్చు- ↑ Gulazāra & Chatterjee 2003, p. 362.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 Lokapally, Vijay (16 May 2013). "Mrigayaa (1976)". The Hindu. Retrieved 13 August 2021.
- ↑ 3.0 3.1 3.2 Kohli, Suresh (13 December 2012). "Mrigayaa (1976)". The Hindu. Retrieved 13 August 2021.
- ↑ Indian Horizons 1977, p. 24.
- ↑ 5.0 5.1 5.2 Mukhopadhyay 2014, p. 102.
- ↑ Ayaz, Shaikh (25 May 2013). "The Poor Man's Pop Star". Open (Indian magazine). Retrieved 13 August 2021.
- ↑ "A full life". The Hindu. 14 July 2002. Archived from the original on 3 May 2005. Retrieved 13 August 2021.
- ↑ Mukhopadhyay 2014, p. 103.
- ↑ "10th Moscow International Film Festival (1977)". MIFF. Archived from the original on 16 జనవరి 2013. Retrieved 13 ఆగస్టు 2021.