మెల్లెంపూడి
మెల్లెంపూడి, గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
మెల్లెంపూడి | |
— రెవెన్యూ యేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°25′32″N 80°37′35″E / 16.425678°N 80.626448°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
మండలం | తాడేపల్లి |
ప్రభుత్వం | |
- సర్పంచి | శ్రీమతి పుష్పరాణి |
పిన్ కోడ్ | 522303 |
ఎస్.టి.డి కోడ్ | 08645 |
గ్రామ చరిత్ర
మార్చుసీఆర్డీఏ పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[1]
గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు
మార్చుతాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.
గ్రామంలో విద్యా సౌకర్యాలు
మార్చుమండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల.
గ్రామ పంచాయతీ
మార్చుదర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చుశ్రీ విఘ్నేశ్వరస్వామివారి ఆలయం
మార్చుఈ ఆలయ వార్షికోత్సవాన్ని, 2017, ఫిబ్రవరి-15వతేదీ బుధవారంనాడు వైభవంగా నిర్వహించారు. ఆలయంలోని స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు.
గ్రామంలో ప్రధాన పంటలు
మార్చువాణిజ్య పంటలకు కేంద్రమైన మెల్లెంపూడిని ఒకప్పుడు మినీ బొంబాయి అని పిలిచేవారు. ఇక్కడ పండే పంటలను జలరవాణా ద్వారా ఇతర రాష్ట్రాలకు ఎగుమతిచేశేవారు. ఒకప్పుడు వ్యాపారాలతో కళకళలాడిన గ్రామం నేడు సమస్యల వలయంలో ఉంది. తాగేందుకు మంచినీరు లేదు. మురుగు కాలువలు ఏర్పాటు చేయలేదు. గ్రంథాలయానికి ఆలనాపాలనా లేదు. శ్మశానం లేదు.
గ్రామంలో జన్మించిన ప్రముఖులు
మార్చుశ్రీ ఆరుమళ్ళ శంకరరెడ్డి, పోలీసుశాఖ అత్యున్నత పురస్కారం ఇండియన్ పోలీస్ మెడల్ పురస్కార గ్రహీత.
గణాంకాలు
మార్చుమెల్లెంపూడి గ్రామ జనాభా=2231., ఓటర్లు=1636.
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-18.