మెహర్ రమేష్

భారతీయ చలన చిత్ర దర్శకులు

మెహర్ రమేష్ తెలుగు చలనచిత్ర దర్శకుడు, రచయిత, నటుడు.[1]

మెహర్ రమేష్
Meher Ramesh.jpg
జననంచిక్కాల మెహర్ రమేష్
విజయవాడ, ఆంధ్రప్రదేశ్
వృత్తిచలనచిత్ర దర్శకుడు, రచయిత , నటుడు
క్రియాశీలక సంవత్సరాలు2005 - ప్రస్తుతం

జననం - విద్యాభ్యాసంసవరించు

మెహర్ రమేష్ కృష్ణా జిల్లా లోని విజయవాడలో జన్మించాడు. ఇతని తండ్రిపేరు చిక్కాల కృష్ణమూర్తి (రిటైర్డు పోలీస్ ఇన్సిపెక్టర్).

సినీరంగ ప్రస్థానంసవరించు

మెహర్ రమేష్, 2002లో విడుదలైన బాబీ చిత్రంలో మహేష్ బాబు స్నేహితుడిగా నటించాడు. 2004లో ఆంధ్రావాలా చిత్రాన్ని కన్నడంలో వీర కన్నడిగగా రిమేక్ చేసి దర్శకుడిగా మారాడు. 2008లో జూనియర్ ఎన్. టి. ఆర్ హీరోగా కంత్రితో తెలుగు సినిమారంగంలో దర్శకుడిగా అడుగుపెట్టాడు.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బాచీ (2000), ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం (2001) వంటి చిత్రాలకు సహాయ దర్శకుడిగా, పోకిరి (2006) చిత్రానికి సహా రచయితగా, దేశముదురు (2007) చిత్రంలో నటుడిగా చేశాడు. తను దర్శకత్వం వహించిన కంత్రి (2008), బిల్లా (2009) చిత్రాలలోని టైటిల్ పాటలను రాశాడు.

చిత్రాల జాబితాసవరించు

  • నటుడిగా:
సంవత్సరం చిత్రంపేరు భాష పాత్రపేరు
2002 బాబీ తెలుగు సునీల్ (బాబీ స్నేహితుడు)
  • దర్శకుడిగా:
సంవత్సరం చిత్రంపేరు భాష ఇతర వివరాలు
2004 వీర కన్నడిగ కన్నడ ఆంధ్రావాలా రిమేక్
2006 అజయ్ కన్నడ ఒక్కడు రిమేక్
2008 కంత్రి తెలుగు
2009 బిల్లా తెలుగు
2011 శక్తి తెలుగు
2013 షాడో[2] తెలుగు

మూలాలుసవరించు

  1. టాలీవుడ్ ఫోటో ప్రోఫైల్స్ బ్లాగ్. "మెహర్ రమేష్ , Mehar Ramesh(director)". tollywoodphotoprofiles.blogspot.in. మూలం నుండి 19 మార్చి 2017 న ఆర్కైవు చేసారు. Retrieved 5 December 2017.
  2. "First Look: Venkatesh In Shadow". Retrieved 5 December 2017. Cite news requires |newspaper= (help)

బయటి లింకులుసవరించు