మేడారం జాతర - 2018

ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతర

మేడారం జాతర-2018 ఈ జాతర తెలంగాణ రాష్ట్రం లోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా, తాడ్వాయి మండలంలో జరుగుతుంది. రెండెళ్ళకొకసారి జరిగే ఈ జాతర ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరుంది. ఈ జాతర జనవరి 31, 2018 నుంచి ఫిబ్రవరి 1, 2018 వ తేదీ వరకు కొనసాగింది. జనవరి 31న సారలమ్మ, ఫిబ్రవరి 1న సమ్మక్క గద్దెకు వచ్చి. ఫిబ్రవరి 3న అమ్మవార్లు తిరిగి వనప్రవేశం చేస్తారు. ఈ జాతరకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఛత్తీస్‌గఢ్‌ సీఎం రమణ్‌సింగ్‌ అమ్మవార్లను దర్శించుకన్నారుు. [1]

మేడారం జాతర - 2018
నిర్వహించు దేశంభారతదేశం
తేదిs31 జనవరి నుండి ఫిబ్రవరి 3
నగరాలుతాడ్వాయి మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా
సారధితెలంగాణ రాష్ట్రం

నిర్వహించు తేదీలు

మార్చు
  • జనవరి 31 తొలిరోజు సారలమ్మను మేడారం గద్దెల వద్దకు తీసుకు వస్తారు.
  • ఫిబ్రవరి 1 న రెండో రోజు సమ్మక్క దేవతను చిలుకలగుట్ట నుంచి గ‌ద్దెలపైకి తీసుకువస్తారు.
  • ఫిబ్రవరి 2న భక్తులు మొక్కులు సమర్పించుకుంటారు.
  • ఫిబ్రవరి 3న వనదేవతలు తిరిగి వనప్రవేశం చేస్తారు.

జాతర విశేషాలు

మార్చు
  • 15 వేల మంది సిబ్బందితో పోలీసుశాఖ సిద్ధమైంది.
  • 12 వేల మంది సిబ్బందితో 4200 బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది.
  • 1.25 కోట్ల మంది భక్తులు వచ్చారని అధికారులు తెలిపారు.

మేడారం జాత‌ర యాప్

మార్చు

మేడారం జాత‌ర‌కు వ‌చ్చే భ‌క్తుల కోసం "మేడారం గైడ్" అనే యాప్ ని ఆవిష్క‌రించారు. ఈ యాప్ మేడారం జాత‌ర‌కు వ‌చ్చే భ‌క్తులకు రూట్ మ్యాప్ గా ఉప‌యోగ‌ప‌డుతుంది.

మూలాలు

మార్చు
  1. మేడారం జాతర - 2018. "మేడారం జాతర ఏర్పాట్లపై సమీక్ష". www.ntnews.com. నమస్తే తెలంగాణ. Retrieved 23 December 2017.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)[permanent dead link]