మేడా వెంకట మల్లికార్జునరెడ్డి

మేడా వెంకట మల్లికార్జునరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో రాజంపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

మేడా వెంకట మల్లికార్జునరెడ్డి
మేడా వెంకట మల్లికార్జునరెడ్డి


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
23 మే 2019 - ప్రస్తుతం
నియోజకవర్గం రాజంపేట నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 26 జనవరి 1963
చెన్నైయ్యగారిపల్లె గ్రామం, నందలూరు మండలం, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు మేడా రామకృష్ణారెడ్డి, లక్ష్మినరసమ్మ
జీవిత భాగస్వామి సుచరిత
బంధువులు మేడా రఘునాథ్ రెడ్డి (సోదరుడు)
సంతానం మేడా వెంకటరామిరెడ్డి, మేడా కృష్ణతేజారెడ్డి

జననం, విద్యాభాస్యం మార్చు

మేడా వెంకట మల్లికార్జునరెడ్డి 26 జనవరి 1963లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లా , నందలూరు మండలం, చెన్నైయ్యగారిపల్లె గ్రామంలో మేడా రామకృష్ణారెడ్డి, లక్ష్మినరసమ్మ దంపతులకు జన్మించాడు.[2] ఆయన రాజంపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 1984లో బీఎస్సీ పూర్తి చేశాడు.[3]

రాజకీయ జీవితం మార్చు

మేడా వెంకట మల్లికార్జునరెడ్డి రాజకీయాల్లోకి రాక ముందు మేడ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (భవన నిర్మాణ సంస్థ) ను స్థాపించి వ్యాపారరంగంలో ఉన్నాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2012 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున పోటీచేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆకేపాటి అమరనాథరెడ్డి చేతిలో 38219 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

మేడా వెంకట మల్లికార్జునరెడ్డి అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరాడు. ఆయన 2014లో జరిగిన ఎన్నికల్లో టిడిపి నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆకేపాటి అమరనాథరెడ్డి పై 11617 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై, తెలుగుదేశం ప్రభుత్వంలో చీఫ్‌ విప్‌‌గా, తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడిగా పని చేశాడు.

మేడా వెంకట మల్లికార్జునరెడ్డి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను కలవడంతో 22 జనవరి 2019న ఆయనను టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు. ఆయన 31 జనవరి 2019న హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరాడు.[4]ఆయన 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ పార్టీ అభ్యర్థి బత్యాల చెంగల్రాయుడు పై 35272 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచి 12 జూన్ 2019న శాసనసభ్యుడిగా ప్రమాణం స్వీకారం చేశాడు.[5]

మూలాలు మార్చు

  1. Sakshi (2019). "Rajampet Constituency Winner List in AP Elections 2019". Archived from the original on 29 July 2021. Retrieved 29 July 2021.
  2. Sakshi (20 March 2019). "ఒక మండలం.. ఐదుగురు ఎమ్మెల్యేలు". Archived from the original on 29 July 2021. Retrieved 29 July 2021.
  3. Sakshi (18 March 2019). "కడప బరిలో..వైఎస్సార్‌ సీపీ దళం". Archived from the original on 14 February 2022. Retrieved 14 February 2022.
  4. HMTV (31 January 2019). "వైసీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి". Archived from the original on 29 July 2021. Retrieved 29 July 2021.
  5. Sakshi (12 June 2019). "ముగిసిన సభ్యుల ప్రమాణ స్వీకారం". Archived from the original on 29 July 2021. Retrieved 29 July 2021.