మైనేనివారిపాలెం

మైనేనివారిపాలెం బాపట్ల జిల్లా రేపల్లె మండలం లోని రెవెన్యూయేతర గ్రామం. పిన్ కోడ్ నం. 522 265., ఎస్.టి.డి.కోడ్ = 08648.

మైనేనివారిపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
మైనేనివారిపాలెం is located in Andhra Pradesh
మైనేనివారిపాలెం
మైనేనివారిపాలెం
అక్షాంశరేఖాంశాలు: 16°01′44″N 80°45′42″E / 16.028783°N 80.761713°E / 16.028783; 80.761713
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం రేపల్లె
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522265
ఎస్.టి.డి కోడ్ 08648.

మైనేని అనే ఇంటి పేరు కల వారు అధికంగా ఉండుట వలన దీనికి ఆ పేరు వచ్చింది.

ఈ గ్రామం కృష్ణా నది వొడ్డున ఉంది.

గ్రామానికి రవాణా సౌకర్యాలు మార్చు

ఈ గ్రామం చేరుకొనుటకు రహదారి మార్గం గలదు. ఈ గ్రామంనుండి మండల ప్రధాన పట్టణమును 20 నిముషాలలో జిల్లా ప్రధాన పట్టణమును 2 గంటలలో చేరుకొనవచ్చు. రేపల్లె నుండి బస్సు, ఆటో ల ద్వరా మైనేనివారిపాలెం (8కి.మీ దూరం రేపల్లే కి) చేరుకోవచ్చు. రేపల్లే నుండి మైనేనివారిపాలెంకి రెండు మార్గలు వున్నవి:-

  1. రేపల్లే నుండి పెనుమూడి మీదగా మైనేనివారిపాలెం చేరుకోవచ్చు.
  2. రేపల్లే నుండి నల్లురు మీదగా మైనేనివారిపాలెం చేరుకోవచ్చు.

గ్రామంలో విద్యా సౌకర్యాలు మార్చు

  1. గ్రామంలో స్వర్ణోత్సవం జరుపుకున్న SVNA (సనాతన వేధాంత నిష్ఠాశ్రమ ఉన్నత) పాఠశాల ఉంది. ఈ పాఠశాల చాలా బాగుంటుంది. ఈ పాఠశాలని 1953 లో నిర్మించారు. ఈ పాఠశాలలో బాలురకు ఉచిత హస్టల్ వసతి గలదు.

గ్రామంలో మౌలిక వసతులు మార్చు

  1. రైసు మిల్లు.
  2. సంగం డైరీ పాల కేంద్రం.

గ్రామ పంచాయతీ మార్చు

ఈ గ్రామంని రెండు పంచాయితీలుగా విబజించిరి అవి, కామరాజుగడ్డ, చాట్రగడ్డ.

  1. చాట్రగడ్డ పంచాయితి క్రింద చాట్రగడ్డ గ్రామం, కాలని గ్రామం, ఎస్.వి.ఎన్.ఏ పాఠశాల, దత్తాత్రేయుని ఆలయము, ఆంజనేయస్వామి ఆలయము గలవు.
  2. కామరాజుగడ్డ పంచాయితి క్రింద రైసు మిల్లు, సంగం డైరీ పాలకేంద్రం కలదు, బ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామివారి దేవాలయము, అరుణాచలేశ్వరుని దేవాలయము, సాయినాధుని ఆలయం, రామాలయం, ఆశ్రమం గలవు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

  1. శ్రీ భ్రమరాంబా సమేత శ్రీ చెన్నమల్లేశ్వరస్వామివారి ఆలయం:- శ్రీ కొల్లిపర కళ్యారాం, ప్రశాంతి దంపతులు ఈ ఆలయంలోని స్వామివారికి 30,000-00 రూపాయల విలువైన ఒక వెండి జటాజూటం సమర్పించారు. శ్రీ కల్యాణరాం తల్లిదండ్రులు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరరావు, జయలక్ష్మి, దీనిని 2017, ఫిబ్రవరి-24వతేదీ శుక్రవారం, మహాశివరాత్రినాడు, అలయానికి సమర్పించారు. ఈ సందర్భంగా స్వామివారికి నిర్వహించిన ప్రత్యేకపూజలలో గ్రామస్థులు, భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
  2. శ్రీ అరుణాచలేశ్వరస్వామివారి ఆలయం.
  3. శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం.
  4. శ్రీ దత్తాత్రేయస్వామివారి ఆలయం.
  5. శ్రీ కోదండరామస్వామివారి ఆలయం:- ఈ ఆలయ పునఃప్రతిష్ఠా కార్యక్రమాలు, 2015, నవంబరు-20వ తేదీ శుక్రవారంనాడు వైభవంగా నిర్వహించారు. అనంతరం ఆలయ పర్యవేక్షణ కమిటీ అధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు.
  6. శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం.
  7. ప్రశాంతమైన ఆశ్రమం:- ఈ ఆశ్రమంనందు వృద్దులకు వసతి సౌకర్యం కలిపించు విధానం కూడా ఉంది.

గ్రామంలో ప్రధాన పంటలు మార్చు

వరి ప్రధానమైన పంట. నదీ పారివాహిక ప్రాంతము అగుటచే ఈ గ్రామంనందు అరటి, తమలపాకు, కూరగాయ పంటలు కూడా పండిస్తారు, మత్యకారులకు ఈ గ్రామం ప్రక్కనే ప్రవహించుచున్న కృష్ణానది జీవనాదారం.

గ్రామంలో ప్రధాన వృత్తులు మార్చు

ఈ గ్రామంలో వ్యవసాయం ప్రజల జీవనాధారం.

గ్రామ ప్రముఖులు మార్చు

ఇక్కడ డాక్టర్ మైనేని సీతారామయ్య అనే ఆయన గ్రామ ప్రముఖుడు.