మొలకెత్తే కాగితం
విత్తన బంతుల లాగానే విత్తనాలను మొలకెత్తించేందుకు కాగితం గుజ్జును వాడి విత్తనాలను మొలకెత్తించేందుకు వాడే సాంకేతికత పేరే మొలకెత్తే కాగితం లేదా సీడ్ పేపర్ టెక్నాలజీ.దీని ద్వారా కాగితం గుజ్జుతో తయారయిన అట్టను పైనున్న కాగితం తీసి భూమిలో వుంచి నీటిని చల్లుతూ వున్నట్లయితే దానినుంచి మొలకలు వస్తాయి. అటవీ ప్రాంతాలలో వీటిని వెదజల్లినా వర్షాలు రాగానే మొలకలు బయటికి వస్తాయి. విత్తనాలు మొలకలగా వృద్ధి చెందడాన్ని విత్తనోత్పత్తి లేక బీజోత్పత్తి లేక అంకురోత్పత్తి అంటారు. విత్తనోత్పత్తిని ఆంగ్లంలో జెర్మినేషన్ (Germination) అంటారు.
సీడ్ పేపర్ తయారీ విధానం
మార్చు- వృథాగా పడేసే కూరగాయల తొక్కలను మిక్సీలో వేసి, గుజ్జుగా చేసుకోవాలి..
- ఓ టిష్యూ పేపర్‌పై ఆ గుజ్జుతో అలికేయాలి..
- అలికిన కాగితంపై విత్తనాలను నలుమూలలా చల్లాలి.. పైన ఎండిన వేపాకును చల్లాలి..
- దానిపై మళ్లీ ఒక టిష్యూ పేపర్‌ను పరచాలి..
- రెండ్రోజులు ఈ కాగితాన్ని ఆరబెట్టాలి..
- జొన్నరొట్టెలా గట్టిపడిన ఆ కాగితాన్ని.. మట్టి పైపొరను తీసి లోపలపెట్టి.. మళ్లీ మట్టిని వేయాలి. కాస్త నీళ్లు చిలకరిస్తే చాలు. విత్తనాలు మొలకెత్తుతాయి. కాగితం విత్తనాలను బంధుమిత్రులకు కానుకగా ఇవ్వొచ్చు. లేదంటే అడవుల్లో, బీడు భూముల్లో వేయొచ్చు.
సీడ్ పేపర్ ప్రయోగాత్మక తయారీదారులు
మార్చుతెలంగాణ రాష్ట్రం, నల్లగొండ జిల్లా, నల్లగొండ పట్టణానికి చెందిన అరుణజ్యోతి అనే గృహిణి తన వంటగదినుంచి వెలువడే వివిధ వ్యర్ధాలను ఉపయోగించి ఇటువంటి సీడ్ పేపర్ ను తయారుచేసి మొలకెత్తించి చూసారు. [1]
ఇవికూడా చూడండి
మార్చుమొక్కల వర్గీకరణ
మార్చుమూలాలు
మార్చు- ↑ "మొలకెత్తే కాగితం." www.andhrajyothy.com. Retrieved 28 July 2020.
బయటిలింకులు
మార్చు- సీడ్ పేపర్ తయారీ పద్దతులు Archived 2020-07-28 at the Wayback Machine