మహ్మద్ మహమూద్ అలీ

భారతీయ రాజకీయవేత్త
(మొహమ్మద్ ఆలీ (తెలంగాణ) నుండి దారిమార్పు చెందింది)

మహ్మద్ మహమూద్ అలీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఇతడు కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి 2014, జూన్ 2న ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.[1] ఇతడు 2014–2018 మధ్యకాలంలో స్టాంప్స్, రిజిస్ట్రేషన్, రిలీఫ్ అండ్ రీహాబితేషన్ శాఖలకు కూడా మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.[2][3] 2019 నుండి తెలంగాణ హోం, జైళ్లు, అగ్నిమాపక శాఖ మంత్రిగా ఉన్నాడు. తెలంగాణ తొలి హోంమంత్రి నాయిని నర్సింహ రెడ్డి తరువాత ఇతడు తెలంగాణ రెండవ హోం మంత్రి. ఇతడు తెలంగాణ శాసన మండలి సభ్యుడు.

మొహమ్మద్ మహమూద్ ఆలీ
మొహమ్మద్ మహమూద్ ఆలీ (2014)
హోంమంత్రి
తెలంగాణ ప్రభుత్వం
Assumed office
13 డిసెంబరు 2018
ముఖ్యమంత్రికె. చంద్రశేఖర్ రావు
నియోజకవర్గంతెలంగాణ శాసన మండలి సభ్యుడు
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి
In office
2 జూన్ 2014 – 6 సెప్టెంబరు 2018
ముఖ్యమంత్రికె. చంద్రశేఖర్ రావు
అంతకు ముందు వారుహోదా ఏర్పాటు
తెలంగాణ శాసన మండలి సభ్యుడు
Assumed office
2010
నియోజకవర్గంతెలంగాణ
వ్యక్తిగత వివరాలు
జననం (1952-03-03) 1952 మార్చి 3 (వయసు 72)
హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
రాజకీయ పార్టీభారత్ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామినస్రీన్ ఫాతిమా
సంతానంఒక కుమారుడు (ఎండీ అజామ్ అలీ), ఇద్దరు కుమార్తెలు
నివాసంహైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
కళాశాలఉస్మానియా విశ్వవిద్యాలయం
వెబ్‌సైట్వెబ్సెటు

ప్రారంభ జీవితం

మార్చు

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జన్మించిన అలీ, అజాంపురాలో నివసిస్తున్నాడు. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి వాణిజ్యశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తిచేసి, పాడి వ్యవసాయ వ్యాపారంలో అడుగుపెట్టాడు. డైరీ వ్యాపారంలో విజయం సాధించాడు.

వ్యక్తిగత జీవితం

మార్చు
 
2017 లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో మహమూద్ అలీ


ఆలీకి నస్రీన్ ఫాతిమాతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. ఆలీకి జంతువుల మీద ప్రేమ ఎక్కువ. 2013లో శాసన మండలి సభ్యుడిగా ఎన్నికైనప్పుడు, ఆలీకి 20 లక్షల రూపాయలు విలువచేసే 85 గేదెలు ఉన్నాయి, వాటిని టిన్ షెడ్‌లో ఉంచి పెంచేవాడు. కొన్ని సంవత్సరాల తరువాత ఆ 85 గేదెలకు అదనంగా 15 చేర్చగా, వాటి విలువ రూ. 42 లక్షలకు పెరిగింది.[4]

రాజకీయ జీవితం

మార్చు

ఆయన 2010లో అంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యునిగా ఎన్నికైనారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ రాష్ట్రంలో శాసన మండలి సభ్యునిగా ఉన్నారు.[5] ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి మైనారిటీ సెల్ అధ్యక్షునిగా కూడా ఉన్నారు.[6][7][8] కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తొలి మంత్రివర్గంలో ఉపముఖ్యమంత్రి హోదాతోపాటు కీలకమైన రెవెన్యూ, రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్, అర్బన్‌ల్యాండ్ సీలింగ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలు దక్కాయి.[9] 2019 నుండి తెలంగాణ హోం, జైళ్లు, అగ్నిమాపక శాఖ మంత్రిగా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన రికార్డు కూడా ఆయన సొంతం.[10]

ఉప ముఖ్యమంత్రి

మార్చు

తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించిన తరువాత ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు 2014, జూన్ 2న తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రిగా అలీని నియమించాడు.[11] 2018లో రెండవసారి ఉప ముఖ్యమంత్రిగా నియమంచబడ్డాడు.[12]

చిత్రమాలిక

మార్చు

మూలాలు

మార్చు
  1. "KCR to Be Sworn in Telangana State's First CM on June 2". Deccan-Journal. Archived from the original on 2 జూన్ 2014. Retrieved 2 June 2014.
  2. "Council of Ministers". telangana.gov.in. Archived from the original on 14 July 2014. Retrieved 14 July 2014.
  3. "Council of Ministers". telangana.gov.in. Retrieved 14 July 2014.
  4. "Minister Mohammad Mahmood Ali's assets remain his animals". The New Indian Express. Retrieved 2021-08-19.
  5. Mohammad Mahmood Ali president TRS minority cell felicitated | Siasat
  6. TRS names Mohammed Mahmood Ali as MLC candidate | Siasat
  7. "Heat in Delhi over MLC list | Deccan Chronicle". Archived from the original on 2014-12-08. Retrieved 2016-11-18.
  8. "Congress is misleading Muslims using religious groups: TRS - indtoday.com | indtoday.com". Archived from the original on 2014-06-05. Retrieved 2016-11-18.
  9. ఆంధ్రప్రభ, ముఖ్యాంశాలు (13 December 2018). "అల్లా సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసిన మహమూద్ అలీ". Archived from the original on 24 జూలై 2019. Retrieved 24 July 2019.
  10. "Telangana CM | KCR: K Chandrasekhar Rao takes oath as Telangana CM". The Economic Times. Retrieved 2021-08-19.
  11. "KCR keeps his promise; Mehmood Ali becomes first Deputy CM of Telangana". Two Circles. Retrieved 1 October 2017.
  12. "KCR Appoints Home Minister, His Party Colleague Since Nearly Two Decades". NDTV.com. Retrieved 2021-08-19.

ఇతర లింకులు

మార్చు