మోడరన్ టైమ్స్ (1936 సినిమా)

మోడరన్ టైమ్స్ 1936, ఫిబ్రవరి 5న విడుదలైన అమెరికా హాస్య చలనచిత్రం. చార్లీ చాప్లిన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రపంచ సినీచరిత్రలో మూకీచిత్రాలకు వీడ్కోలు పలికిన చిత్రంగా నిలిచింది. ఇందులో చార్లీ చాప్లిన్, పైలెట్ట గొడ్దార్డ్, హెన్రీ బెర్గ్మాన్, టినీ శాండ్ఫోర్డ్, చెస్టర్ కాంక్లిన్ తదితరులు నటించారు.[2]

మోడరన్ టైమ్స్
Modern Times poster.jpg
మోడరన్ టైమ్స్ సినిమా పోస్టర్
దర్శకత్వంచార్లీ చాప్లిన్
కథా రచయితచార్లీ చాప్లిన్
నిర్మాతచార్లీ చాప్లిన్
తారాగణంచార్లీ చాప్లిన్, పైలెట్ట గొడ్దార్డ్, హెన్రీ బెర్గ్మాన్, టినీ శాండ్ఫోర్డ్, చెస్టర్ కాంక్లిన్
ఛాయాగ్రహణంఇరా హెచ్. మోర్గాన్, రోలాండ్ టోటెరోహ్
కూర్పువిల్లార్డ్ నికో
సంగీతంచార్లీ చాప్లిన్
పంపిణీదారుయునైటెడ్ ఆర్టిస్ట్స్
విడుదల తేదీ
ఫిబ్రవరి 5, 1936
సినిమా నిడివి
87 నిముషాలు
భాషఇంగ్లీష్
బడ్జెట్$1.5 మిలియన్[1]
బాక్స్ ఆఫీసు$1.4 మిలియన్ (దేశీయ)[1]

కథా నేపథ్యంసవరించు

కర్మాగారాల్లో కార్మికులను ఎలా పనిచేయించుకుంటారో చూయించిన చిత్రం ఇది. మనిషి జీవితంలో ఆహారం, డబ్బు, ప్రేమ చాలా ముఖ్యమని, వాటికోసం ఆ మనిషి పడే తపనను సినిమాలో వ్యంగ్యంగా చూపించబడింది. యాంత్రిక జీవనంలో మనిషి పిచ్చివాడిలా మారే పరిస్థితి వస్తుంది. జీవితాన్ని ప్రామాణికం చేయడానికి జరుగుతున్న ప్రయత్నాల గురించి, మనుషులను మరలుగా మార్చడానికి జరుగుతున్న పద్ధతుల గురించి తనకు తోచినవిధంగా చార్లీ చాప్లిన్ చెప్పాడు.[3]

నటవర్గంసవరించు

 • చార్లీ చాప్లిన్
 • పైలెట్ట గొడ్దార్డ్
 • హెన్రీ బెర్గ్మాన్
 • టినీ శాండ్ఫోర్డ్
 • చెస్టర్ కాంక్లిన్
 • అల్ ఎర్నెస్ట్ గార్సియా
 • స్టాన్లీ బ్లిస్టోన్
 • రిచర్డ్ అలెగ్జాండర్
 • సెసిల్ రేనాల్డ్స్
 • మీరా మెకిన్నీ
 • ముర్డోక్ మాక్క్వారీ
 • విల్ఫ్రెడ్ లుకాస్
 • ఎడ్వర్డ్ లేసైన్ట్
 • ఫ్రెడ్ మాలటేస్టా
 • సమ్మీ స్టెయిన్
 • హాంక్ మాన్
 • లూయిస్ నతియాక్స్
 • గ్లోరియా డేహవెన్
 • జునా సుట్టన్
 • టెడ్ ఒలివర్
 • బాబీ బార్బర్
 • హ్యారీ విల్సన్

సాంకేతికవర్గంసవరించు

 
చిత్రంలోని ఒక సన్నివేశంలో భారీ యంత్రంపై పనిచేస్తున్న ట్రాంప్
 
చార్లీ చాప్లిన్
 • రచన, నిర్మాత, సంగీతం, దర్శకత్వం: చార్లీ చాప్లిన్
 • ఛాయాగ్రహణం: ఇరా హెచ్. మోర్గాన్, రోలాండ్ టోటెరోహ్
 • కూర్పు: విల్లార్డ్ నికో
 • పంపిణీదారు: యునైటెడ్ ఆర్టిస్ట్స్

చిత్ర విశేషాలుసవరించు

 
పైలెట్ట గొడ్దార్డ్, చిత్ర కథానాయిక
 1. ఈ చిత్రంకోసం చార్లీ సంవత్సరంపాటు స్క్రిప్టును తయారుచేసుకొని, 11 నెలలపాటు చిత్రీకరించాడు.[4]
 2. సినిమాలో సంభాషణలు పెట్టాలనుకున్న చార్లీ అందుకోసం స్క్రీన్ ప్లే, మాటలను కూడా రాసుకున్నాడు. కానీ, చివరకు మూకీచిత్రంగానే రూపొందించాడు.[2]
 3. 1934, అక్టోబర్ 11న చిత్రీకరణ ప్రారంభమై, 1935, ఆగష్టు 30న ముగిసింది.[5]
 4. 1935-36లో బ్రిటీష్ బాక్సాఫీస్ వద్ద అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రంగా నిలిచింది.[6]
 5. 2003లో జరిగిన కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది.[7]
 6. అమెరికన్ ఫిల్మ్ ఇన్సిట్యూట్ వారిచే 1998లో అమెరికన్ ఫిల్మ్ ఇన్సిట్యూట్ వారి 100 సంవత్సరాలు...100 చిత్రాలు విభాగంలో 81వ చిత్రంగా,[8] 2000లో అమెరికన్ ఫిల్మ్ ఇన్సిట్యూట్ వారి 100 సంవత్సరాలు... 100 హాస్య చిత్రాలు సినిమాలు విభాగంలో 33వ చిత్రంగా,[9] 2007లో అమెరికన్ ఫిల్మ్ ఇన్సిట్యూట్ వారి 100 సంవత్సరాలు...100 సినిమాలు (10వ వార్షికోత్సవ సంచిక) విభాగంలో 78వ చిత్రంగా[10] గుర్తించబడింది.

మూలాలుసవరించు

 1. 1.0 1.1 Balio, Tino (2009). United Artists : The Company Built by the Stars. University of Wisconsin Press. ISBN 978-0-299-23004-3. Cite has empty unknown parameter: |coauthors= (help) p131
 2. 2.0 2.1 పాలకోడేటి సత్యనారాయణరావు 2007, p. 37.
 3. పాలకోడేటి సత్యనారాయణరావు 2007, p. 36.
 4. పాలకోడేటి సత్యనారాయణరావు 2007, p. 38.
 5. As said in Chaplin Today: Modern Times, a 2003 French documentary.
 6. "The Film Business in the United States and Britain during the 1930s" by John Sedgwick and Michael Pokorny, The Economic History Review New Series, Vol. 58, No. 1 (Feb., 2005), p. 97
 7. "Festival de Cannes: Modern Times". festival-cannes.com. Retrieved 20 February 2019.
 8. "AFI's 100 Years ... 100 Movies" (PDF). American Film Institute. Retrieved 20 February 2019.
 9. "AFI's 100 Years ... 100 Laughs" (PDF). American Film Institute. Retrieved 20 February 2019.
 10. "AFI's 100 Years ... 100 Movies (10th Anniversary Edition)" (PDF). American Film Institute. Retrieved 20 February 2019.

ఇతర లంకెలుసవరించు

ఆధార గ్రంథాలుసవరించు