మోతే మండలం

తెలంగాణ లోని మండలం


మోతె మండలం లేదా మోతే మండలం, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లాకు చెందిన మండలం.[1] మోతే, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన సూర్యాపేట నుండి 20 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నల్గొండ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం సూర్యాపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు.

మోతే మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో సూర్యాపేట జిల్లా, మోతే మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సూర్యాపేట జిల్లా, మోతే మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°10′00″N 79°48′00″E / 17.1667°N 79.8000°E / 17.1667; 79.8000
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సూర్యాపేట జిల్లా
మండల కేంద్రం మోతే
గ్రామాలు 16
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 44,132
 - పురుషులు 22,212
 - స్త్రీలు 21,920
అక్షరాస్యత (2011)
 - మొత్తం 43.13%
 - పురుషులు 54.16%
 - స్త్రీలు 31.89%
పిన్‌కోడ్ 508212

నల్గొండ జిల్లా నుండి మార్పుసవరించు

లోగడ మోతే మండలం,నల్గొండ జిల్లా,మిర్యాలగూడ రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా మోతే మండలాన్ని (1+15) పదహారు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన సూర్యాపేట జిల్లా, సూర్యాపేట రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[3]

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 191 చ.కి.మీ. కాగా, జనాభా 44,132. జనాభాలో పురుషులు 22,212 కాగా, స్త్రీల సంఖ్య 21,920. మండలంలో 11,676 గృహాలున్నాయి.[4]

మండల జనాభాసవరించు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 44,132 - పురుషులు 22,212 - స్త్రీలు 21,920

మండలంలోని రెవిన్యూ గ్రామాలుసవరించు

  1. రవిపహాడ్
  2. సర్వారం
  3. కూడలి
  4. ఉర్లుగుండ
  5. నెరెదవాయి
  6. అన్నారిగూడెం
  7. విభలపూర్
  8. బుర్కచర్ల
  9. సిరికొండ
  10. నామవరం
  11. రాఘవపూరం
  12. మోతే
  13. హుసైనాబాద్
  14. తుమ్మలపల్లి
  15. మామిల్లగూడెం

గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలుసవరించు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "సూర్యాపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
  3. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2020-01-24.
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలుసవరించు