మోమిన్ ఖాన్ మోమిన్ (ఉర్దూ: مومن خان) (జననం. 1800 - మరణం. 1851) భారత ఉర్దూ కవి, తన గజల్ లకు ఖ్యాతి గాంచాడు. పేరు మోమిన్ ఖాన్, తఖల్లుస్ (కలంపేరు) మోమిన్. ఢిల్లీ లో జన్మించాడు. ఇతడు మంచివైద్యుడు కూడానూ, హకీమ్ మోమిన్ ఖాన్ అని కూడా పిలువబడ్డాడు.

మోమిన్ తన సుందరమైన గజల్ లకు, గజల్ లలో తన తఖల్లుస్ ను సున్నితంగా ఉపయోగించిన రీతిని బట్టి ప్రసిధ్ధిచెందాడు.

ఇతడు రచించిన గజల్ లో ఒక షేర్ ను చూసి, సమకాలీనుడైన గాలిబ్ అంతటివాడే ఈ షేర్ నాకిచ్చివేయి, నా దీవాన్ (కవితాగ్రంధం) తీసుకో అని అన్నట్టు నానుడి.

ఆ షేర్:

తుమ్ మెరే పాస్ హోతె హో గోయా

జబ్ కొయీ దూస్ రా నహీఁ హోతా

తాత్పర్యం :

నీవెల్లప్పుడూ నాచెంతనే వున్నట్టుంటుంది

ఎపుడయితే ఎవరూ నాచెంతనుండరో,