మోహన్ కందా
మోహన్ కందా (సెప్టెంబర్ 4, 1945-) ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారిగా, ప్రభుత్వంలో పలు కీలకమైన పదవులు చేపట్టిన వ్యక్తిగా సుప్రసిద్ధులు. జాయింట్ కలెక్టర్ స్థాయి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యకార్యదర్శి వరకూ వివిధ హోదాల్లో పనిచేశారు.
మోహన్ కందా | |
---|---|
జననం | కందా మోహన్‌దాస్ 1945 సెప్టెంబరు 4 |
జాతీయత | భారతీయుడు |
ఇతర పేర్లు | మాస్టర్ మోహన్ |
విద్య | ఎం.ఎస్సీ., పి.హెచ్.డి. |
విద్యాసంస్థ | ఉస్మానియా విశ్వవిద్యాలయం |
వృత్తి | ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ |
క్రియాశీల సంవత్సరాలు | 1968-2005 |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | బాలనటుడు |
గుర్తించదగిన సేవలు | పెళ్ళి చేసి చూడు |
జీవిత భాగస్వామి | ఉష |
తల్లిదండ్రులు | కందా భీమశంకరం |
బంధువులు | సీతారాం ఏచూరి(మేనల్లుడు) |
వ్యక్తిగత జీవితం
మార్చు1945 సెప్టెంబర్ 4న మోహన్ కందా చెన్నైలో వెంకమ్మ మాణిక్యాంబ (పాపాయమ్మగా పిలువబడేవారు), భీమశంకరం దంపతులకు జన్మించాడు. ఈయన విద్యాభ్యాసం హైదరాబాదులోని ఆల్ సెయింట్స్ హైస్కూలు, సికింద్రాబాదులోని మహబూబ్ కళాశాల, నిజాం కళాశాలలో జరిగింది. మోహన్ తండ్రి కందా భీమశంకరం చెన్నై (ఆనాడు మద్రాసు) హైకోర్టులో న్యాయవాదిగా పనిచేసేవారు. ఇతని తల్లి సంఘసేవికురాలు. ఇతని మేనల్లుడు సీతారాం ఏచూరి సి.పి.ఎం.పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యుడిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు.
ఇతడు ధర్మదేవత, పెంపుడు కొడుకు వంటి కొన్ని సినిమాలలో బాలనటుడిగా మాస్టర్ మోహన్ అనే పేరుతో నటించాడు.[1] వాటిలో ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో 1952లో విడుదలైన పెళ్ళి చేసి చూడు సినిమాలోని "అమ్మా నొప్పులే అమ్మమ్మా నొప్పులే" అనే గేయనాటికలో ఇతని నటన మంచి పేరు తెచ్చిపెట్టింది.
వృత్తి జీవితం
మార్చుఇతడు తొలుత భారతీయ స్టేట్ బ్యాంకులో అధికారిగా తన ఉద్యోగజీవితాన్ని ప్రారంభించాడు. 1968లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులో ఎన్నికైన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేయసాగాడు. ఇతడు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ కార్యదర్శిగా, జాతీయ విపత్తుల నిర్వహాణా అథారిటీ(NDMA) ఉపాధ్యక్షుడిగా[2]. అంతకు ముందు ఇతడు నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో, తర్వాత వై.యస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు.
ఇతడు ప్రణాళికా సంఘం 12వ పంచవర్ష ప్రణాళిక వారి (2012-17) తయారీకి ముందు ఏర్పాటయిన వ్యవసాయ, సంబంధిత రంగాలకు చెందిన స్టీరింగ్ కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు.[3] [4] కోనసీమ రైతులు పంటవిరామం ప్రకటించిన నేపథ్యంలో ఆ రైతుల సమస్యలను అధ్యయనం చేయడానికి ఏర్పాటైన కమిటీకి ఇతడు నాయకత్వం వహించాడు.[5]
రచనలు
మార్చు- The Tinctured canvas : concept, practice & strategies in rural development
- Trekking over pebbles : life through a Hyderabadi's looking glass
- "Not by others' hands" : an anthology of a century of credit cooperatives in India : a tribute to the cooperative movement in the International Year of Cooperation, 2012
- Ethics in governance : resolution of dilemmas with case studies
- Vasundhara : an anthology of land resources in India
- Disaster management in India : evolution of institutional arrangements and operational strategies
- The Tictured Canvas concept : practice and strategies in rural development.
- Forgiving Earth
- పరిపాలనలో ధర్మపాలన: సందిగ్ధ సందర్భాలకు సోదాహరణ పరిష్కారాలు
- మోహన మకరందాలు అనుభవాలూ- జ్ఞాపకాలూ
మూలాలు
మార్చు- ↑ "మోహన్". IMDb.
- ↑ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి పత్రికా ప్రకటన
- ↑ "న్యూస్ ఆర్కీవ్స్: ది హిందూ". Archived from the original on 2011-06-13. Retrieved 2020-06-05.
- ↑ "Panel set up to study ryots issues". IBNLive. Archived from the original on 2012-10-17. Retrieved 2020-06-05.
- ↑ IBNLive. "CNN-IBN News: Breaking News India, Latest News, Current Headlines World - IBNLive". IBNLive.com. Archived from the original on 2012-10-17. Retrieved 2020-06-05.