మహబూబ్ కళాశాల

మహబూబ్ కళాశాల తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాదులో ఉన్న కళాశాల. రాష్ట్రపతి రోడ్డు, సరోజనీదేవి రోడ్ల మధ్యలో సుమారు ఏడున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కళాశాలలో అనేకమంది ప్రముఖులు, మేధావులు చదువుకున్నారు.[1]

మహబూబ్ కళాశాల
సాధారణ సమాచారం
రకంవిద్యాసంస్థ
చిరునామాసికింద్రాబాదు, తెలంగాణ, భారతదేశం
ప్రారంభం1862

చరిత్రసవరించు

నిజాం రాజుల కాలంలో సికింద్రాబాద్ ప్రాంతంలో బ్రిటిషు వాళ్ళు నివసించేవారు. యువతకు, బాలికలకు విద్య ముఖ్యమని భావించిన బ్రిటిషు వారు అత్యంత ఆధునిక విద్యా సౌకర్యాలను అందించారు. కంటోన్మెంట్‌కు సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టరైన పి. సోమసుందరం ముదలియార్ బ్రిటిష్ అధికారుల సహాయం తీసుకుని బ్రిటిష్ సైనికుల పిల్లల కోసం 1862లో ఆంగ్లో వెర్నాక్యులర్ స్కూలు అనే పేరుతో ఒక పాఠశాలను ప్రారంభించాడు. దీనిలో తక్కువ ఫీజుతో ఇంగ్లిష్, తెలుగు, తమిళ భాషలు బోధించేవారు. నిధులు కొరత తీర్చడానికి ఆరో నిజాం ప్రభువు మీర్ మహబూబ్ ఆలీ ఖాన్ ఈ పాఠశాల నిర్వహణకు ఆర్థిక సహాయాన్ని అందించేవాడు. అలా ఇది మహబూబ్ పాఠశాలగా మార్చబడింది. అటుతరువాత కళాశాలగా రూపుదిద్దుకుంది.[1]

ఇతర వివరాలుసవరించు

  1. రఘుపతి వెంకటరత్నం నాయుడు,మాడపాటి హనుమంతరావు తదితరులు దీనికి ప్రిన్సిపాల్స్‌గా పనిచేశారు
  2. స్వామి వివేకానంద అమెరికాలోని చికాగో సర్వమత సమ్మేళనానికి వెళ్లేముందు 1893, ఫిబ్రవరి 13న ఈ కళాశాల ప్రాంగణంలోనే ప్రసంగించారు
  3. జవహర్‌లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి ప్రముఖులు ఈ కళాశాలను సందర్శించారు

కళాశాల పూర్వ విద్యార్ధులుసవరించు

  1. శ్యామ్ బెనగళ్
  2. ముహమ్మద్ అజహరుద్దీన్
  3. అడ్మిరల్ రామ్ దాస్ కటారి
  4. ఎం.ఎల్.జయసింహ
  5. మోహన్ కందా
  6. సతీష్ ఉడ్పా

మూలాలుసవరించు

  1. 1.0 1.1 సాక్షి, ఫీచర్స్ (25 March 2015). "మహబూబ్ కళాశాల". మల్లాది కృష్ణానంద్. Archived from the original on 29 January 2019. Retrieved 29 January 2019.