పెంపుడు కొడుకు
పెంపుడు కొడుకు 1953, నవంబరు 13వ తేదీన విడుదలైన తెలుగు సినిమా.[1]
పెంపుడు కొడుకు (1953 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎల్.వి.ప్రసాద్ |
---|---|
తారాగణం | ఎల్.వి.ప్రసాద్, పుష్పవల్లి, సావిత్రి, కుమారి, ఎస్.వి.రంగారావు |
సంగీతం | సాలూరి రాజేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
కథ
మార్చురంగస్వామి (ఎల్.వి.ప్రసాద్) భార్య మంగమ్మ (పుష్పవల్లి) ఆస్పత్రిలో జబ్బుగా ఉంటుంది. ఇద్దరు పిల్లలను ఒక్కడే సాకడానికి యిబ్బంది పడుతుంటాడు. భార్య బ్రతకదేమోనన్న భయంతో చంటివాణ్ణి ఒక ధనికురాలికి (కుమారి) పెంపకం ఇస్తాడు. ఆమె వాణ్ణి తీసుకుని స్వస్థలం వేలూరు వెడుతుంది. మంగమ్మ ఆస్పత్రి నుంచి బతికి బయట పడుతుంది. రెండో పిల్లవాడు పెంపకం వెళ్లాడని తెలిసి భర్తను నిందిస్తుంది. రంగస్వామి వేలూరు వెళ్లి పిల్లవాడిని తిరిగి తీసుకురావడానికి అవసరమైన డబ్బుకోసం ఒక యిల్లు కట్టడం పనిలో చేరుతాడు. ప్రమాదవశాత్తు ఆ యింటి దూలం విరిగి మీదపడి మరణిస్తాడు. మంగమ్మ దుఃఖించి పెద్ద కొడుకుని వెంట బెట్టుకుని వేలూరు వెడుతుంది. అక్కడ ఒక హత్యానేరంలో చిక్కుకుని పదిహేనేళ్లు జైలు శిక్ష అనుభవిస్తుంది. పెద్దకొడుకు దిక్కులేనివాడై ఒక బడిపంతులు సౌజన్యం వల్ల అచ్చాఫీసులో నౌకరుగా పని చేస్తాడు. ఆ వూళ్లోనే ప్రొఫెసరు దంపతుల వద్ద రెండో కొడుకు పెరుగుతుంటారు. ఇద్దరూ (శ్రీరామమూర్తి, శివాజీ గణేశన్) పెద్దవారవుతారు. తామిద్దరం అన్నదమ్ములమని తెలియక ఇద్దరూ చిన్నతనం నుండే వైరం పెంచుకుని, గౌరి (సావిత్రి) అనే యువతి ప్రేమకోసం ఇంకా ప్రబల విరోధులవుతారు. ఈ లోగా మంగమ్మ జైలు నుండి విడుదలై ప్రొఫెసరు గారి ఇంట్లో వంటలక్కగా చేరుతుంది. తలవని తలంపుగా పెద్ద కొడుకును కలుసుకుంటుంది. ప్రొఫెసర్ ఇంట్లో పెరిగే మోహన్ తన రెండవ కొడుకేనని గ్రహిస్తుంది. మోహన్ తను ధనికుల బిడ్డననే గర్వంతో దుష్టుడై తన అన్నపైన, గౌరిపైన దొంగతనం నేరం మోపి జైలుకు పంపిస్తాడు. కాని వారు విడుదల అవుతారు. చివరకు అతడు ఇంతకాలం తను ద్వేషిస్తున్న మంగమ్మ తన తల్లే అని, ముత్తడు తన అన్న అనీ గ్రహిస్తాడు. పశ్చాత్తాప పడి క్షమాపణ వేడుకుంటాడు[2].
నటీనటులు
మార్చు- ఎల్.వి.ప్రసాద్
- పుష్పవల్లి
- కుమారి
- శ్రీరామమూర్తి
- శివాజీ గణేశన్
- సావిత్రి
- సురభి బాలసరస్వతి
- ఛాయాదేవి
- ఎస్.వి.రంగారావు
- ఆర్.నాగేశ్వరరావు
- మోహన్ కందా
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం : ఎల్.వి.ప్రసాద్
- సంభాషణలు: సదాశివ బ్రహ్మం
- పాటలు: శ్రీశ్రీ, అనిశెట్టి, సదాశివ బ్రహ్మం
- సంగీతం: సాలూరు రాజేశ్వరరావు
- నేపథ్య గానం: పి.లీల, ఎ.ఎం.రాజా,జిక్కి, ఎ.పి.కోమల,మాధవపెద్ది, ఎం.ఎస్.రామారావు
- ఛాయాగ్రహణం: ఆది ఇరానీ
- కళ: శేఖర్
పాటలు
మార్చు- అందములన్ని నీవేరా ఆనందములన్ని మావేరా అపురూపంగా - పి. లీల - రచన: శ్రీశ్రీ
- ఇంత దేశం ఇంత సౌఖ్యం కొందరికే సొంతమా ఎక్కడైనా - ఎ.ఎం. రాజా, జిక్కి - రచన: శ్రీశ్రీ
- ఉన్నవారికే అన్ని సుఖాలు రయ్యో రయ్యో లేనివారి గతి ఈ లోకంలో - జిక్కి - రచన: శ్రీశ్రీ
- చిన్నారి చిటిపాపా కన్నారి కనుపాప ఇన్నాళ్ళు పెరిగి ఈనాటితోనే - ఎ.పి. కోమల - రచన: శ్రీశ్రీ
- నమో నమో మాతా నమో నమో మాతా నమో - మాధవపెద్ది బృందం - రచన: శ్రీశ్రీ
- భయం భయం బ్రతుకు భయం అన్నా మనకీ లోకం - ఎం. ఎస్. రామారావు - రచన: అనిసెట్టి
- మబ్బులు మబ్బులు మబ్భులోచ్చినయి ఉబ్బెను - ఘంటసాల,జిక్కి - రచన: సదాశివబ్రహ్మం
- విరోధమేలనే సొగసులాడి ఇటు రావే నా సరైన జోడీ నీవే - ఎ. ఎం. రాజా - రచన: శ్రీశ్రీ
- సన్నజాజి తోటల మల్లెపూల బాటల కోయిలే పాడుకదా కుహూ - జిక్కి - రచన: శ్రీశ్రీ
- సరదాగా జల్సాగా అందరము మనమందరము ప్రతిరోజు - ఎ. ఎం.రాజా బృందం - రచన: శ్రీశ్రీ