మోహన్ చరణ్ మాఝీ

ఒడిశాకు చెందిన రాజకీయ నాయకుడు

మోహన్ చరణ్ మాఝీ ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. మోహన్ చరణ్ మాఝీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా 2019 ఒడిశా శాసనసభ ఎన్నికలలో కియోంజర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఒడిశా శాసనసభకు ఎన్నికయ్యాడు. మోహన్ చరణ్ మాఝీ 2000 నుండి 2009 వరకు కియోంజర్‌ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.[1][2][3][4]

మోహన్ చరణ్ మాఝీ
మోహన్ చరణ్ మాఝీ


Taking office
2024 జూన్ 12
గవర్నరు రఘు బోర్ దాస్
డిప్యూటీ కనక్ వర్ధన్ సింగ్
Succeeding నవీన్ పట్నాయక్

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2019
ముందు అభిరామ్ నాయక్
నియోజకవర్గం కియోంజర్ శాసనసభ నియోజకవర్గం
పదవీ కాలం
2000 – 2009
ముందు జోగేంద్ర నాయక్
నియోజకవర్గం కియోంజర్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1972-01-06) 1972 జనవరి 6 (వయసు 52)
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి ప్రియాంక మరండి
నివాసం ఒడిశా, భారతదేశం
వృత్తి సామాజిక కార్యకర్త రాజకీయ నాయకుడు

మోహన్ చరణ్ మాఝీ 2024 ఒడిశా శాసనసభ ఎన్నికలలో కియోంజర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గా ఎన్నికయ్యాడు. మొహన్ చరణ్ మాఝీ బీజేడీ అభ్యర్థిపై 11577 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

2024 జూన్ 11న భారతీయ జనతాపార్టీ తరుపున ఒడిశా ముఖ్యమంత్రిగా అధికార బాధ్యతలు చేపట్టిన మొదటి ముఖ్యమంత్రి.[5]

ప్రారంభ, వ్యక్తిగత జీవితం

మార్చు

మోహన్ చరణ్ మాఝీ 1972 జనవరి 6న కెందుఝార్ జిల్లా లోని రాయికల్ గ్రామంలోని ఆదివాసీ కుటుంబంలో జన్మించాడు.[6][7] అతని తండ్రి గుణరామ్ మాఝీ ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలో జవానుగా పనిచేశారు.[8] అతని కుటుంబం సంతాల్ ఆదివాసీ వర్గానికి చెందింది.[9][10]అతను 1987లో తన పాఠశాల విద్యను ఝుంపురా హైస్కూల్‌లో చదివాడు. 1990లో అనదాపూర్ కళాశాల నుండి తన హయ్యర్ సెకండరీని పూర్తి చేసాడు. అతను చంపువాలోని చంద్ర శేఖర్ కళాశాల నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని, ధెంకనల్ లా కాలేజీ నుండి ఎల్.ఎల్.బి. పొందాడు. అతను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నిర్వహిస్తున్న పాఠశాలల నెట్‌వర్క్‌లో భాగమైన జుంపురాలోని సరస్వతి శిశు మందిర్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు.[11][12] అతను ప్రియాంక మరాండీని వివాహం చేసుకున్నాడు.[13]

రాజకీయ జీవితం

మార్చు

మాఝీ 1997 నుండి 2000 వరకు రాయికల్ పంచాయతీ గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు.[14]అతను 1997 నుండి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర యూనిట్ గిరిజన విభాగానికి కార్యదర్శిగా పనిచేస్తున్నాడు.[15] మాఝీ 2000లో కియోంఝర్ నుండి మొదటిసారి ఒడిశా శాసనసభకు ఎన్నికయ్యారు.[16]అతను 2004లో తిరిగి ఎన్నికయ్యాడు. 2005 నుండి 2009 వరకు ప్రభుత్వ డిప్యూటీ చీఫ్ విప్‌గా పనిచేశాడు.[17][18]మాఝీ 2009 - 2014లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఓడిపోయారు, కానీ 2019లో అదే నియోజకవర్గం నుండి గెలుపొందాడు. బిజెపి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మారడంతో, మాఝీ పార్టీ చీఫ్ విప్‌గా నియమితులయ్యారు.[19] అతను షెడ్యూల్డ్ కులాలు, తెగల స్టాండింగ్ కమిటీ సభ్యుడు. 2022 నుండి 2024 వరకు రాష్ట్రంలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి అధ్యక్షుడిగా పనిచేసాడు.[20][21]

2021 అక్టోబరు 10న, కెందుఝర్ జిల్లా లోని మాండువా సమీపంలో మాఝీ కారుపై రెండు మూడు బాంబులు విసిరారు. అతని కారుకు స్వల్ప నష్టం జరగగా, మాఝీ గాయాలు లేకుండా బయటపడ్డాడు.[22][23]2023 సెప్టెంబరులో, మాఝీని ఒడిశా శాసనసభ నుండి అప్పటి స్పీకర్ ప్రమీలా మల్లిక్ ఆమె పోడియంపై పప్పు విసిరినందుకు సస్పెండ్ చేశారు. ప్రభుత్వం చేసిన వివిధ పప్పుధాన్యాల సేకరణలో ఆరోపించిన కుంభకోణానికి వ్యతిరేకంగా పప్పులు విసిసరటం ద్వారా నిరసన తెలిపారు.[24][25]

2024 ఒడిశా శాసనసభ ఎన్నికల్లో, మాఝీ నాల్గవ సారి కియోంజర్ స్థానాన్ని గెలుచుకున్నారు. ఒడిశా అసెంబ్లీలో 147 స్థానాలకు గాను 79 స్థానాలతో బిజెపి పార్టీ మెజారిటీ సాధించింది. మాఝీ 2024 జూన్ 11న ఒడిశా ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు.[26] అతను మరుసటి రోజు 15వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసాడు. ముఖ్యమంత్రులలో పనిచేసిన సంతాల్ తెగ సమాజానికి చెందిన హేమానంద బిస్వాల్. గిరిధర్ గమాంగ్ తర్వాత మాఝీ మూడవ వ్యక్తి.[27]

ఎన్నికల గణాంకాలు

మార్చు
సంవత్సరం నియోజకవర్గం జనాదరణ ఓట్లు % ఫలితం మూలం
2000 కియోంజర్ 51,449 59.08 గెలుపు [28]
2004 46,146 40.14 గెలుపు [29]
2009 29,202 24.29 ఓటమి [30]
2014 47,283 30.31 ఓటమి [31]
2019 72,760 42.10 గెలుపు [32]
2024 87,815 47.05 గెలుపు [33]

మూలాలు

మార్చు
  1. "Profile of Mohan Charan Majhi, Keonjhar, Odisha Vidhan Sabha Constituency, Odisha". odishahelpline.com.
  2. ""An Outlier in Poll Challenge": Mohan Charan Majhi". Archived from the original on 9 July 2019. Retrieved 9 July 2019.
  3. "Health Minister Orders Probe Into 'Misbehaviour' Towards MLA By Hospital". Archived from the original on 9 July 2019. Retrieved 9 July 2019.
  4. BJP appoints Bishnu Sethi as Deputy leader, Mohan Majhi as Chief whip
  5. "Mohan Charan Majhi sworn in as Odisha's first BJP Chief Minister - The Hindu". web.archive.org. 2024-10-09. Archived from the original on 2024-10-09. Retrieved 2024-10-09.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  6. "Shri Mohan Charan Majhi". Odisha Assembly. Archived from the original on 13 June 2024. Retrieved 11 June 2024.
  7. "Meet Mohan Charan Majhi, who will replace Naveen Patnaik as the new Odisha CM". CNBC. 12 June 2024. Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.
  8. "Mohan Majhi, A Security Guard's Son Who Will Be Odisha Chief Minister". NDTV. 12 June 2024. Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.
  9. "'First job after taking oath is to work to protect Odisha's asmita', says CM-designate". The Times of India. 12 June 2024. Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.
  10. "Bio-data of Present Member of Legislative Assembly in Orissa 2004" (PDF). Government of Odisha. Archived (PDF) from the original on 28 May 2024. Retrieved 12 June 2024.
  11. "Meet Mohan Charan Majhi, who will replace Naveen Patnaik as the new Odisha CM". CNBC. 12 June 2024. Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.
  12. "From Shishu Mandir teacher and sarpanch to Odisha's 1st BJP CM — who is Mohan Charan Majhi". The Print. 15 June 2024. Archived from the original on 12 June 2024. Retrieved 15 June 2024.
  13. "Never thought that my husband will become CM: Mohan Majhi's wife". The Hindu. 12 June 2024. Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.
  14. Kumar, Abhijeet (13 June 2024). "Who is Mohan Charan Majhi? Key details about Odisha's 15th Chief Minister". Business Standard. Archived from the original on 23 June 2024. Retrieved 23 June 2024.
  15. "Shri Mohan Charan Majhi". Odisha Assembly. Archived from the original on 13 June 2024. Retrieved 11 June 2024.
  16. "Tribal Leader Mohan Majhi Is Odisha's New CM: 5 Things You Need To Know About This 4-Time MLA". News18. 11 June 2024. Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.
  17. "Who is Mohan Charan Majhi, BJP's first Odisha CM". The Times of India. 11 June 2024. Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.
  18. "Profile of Mohan Charan Majhi, Keonjhar, Odisha Vidhan Sabha Constituency, Odisha". Odisha Helpline. Retrieved 1 June 2024.
  19. "BJP appoints Bishnu Sethi as Deputy leader, Mohan Majhi as Chief whip". UNI. Archived from the original on 3 November 2023. Retrieved 1 June 2023.
  20. "Odisha's first BJP CM, Deputy CMs to take oath today: Who are Mohan Charan Majhi, K V Singh Deo, Pravati Parida?". The Indian Express. 12 June 2024. Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.
  21. Chattopadhyay, Suhrid Sankar (2024-06-13). "Mohan Charan Majhi's rise as Chief Minister of Odisha highlights BJP's focus on tribal consolidation and breaking feudal patterns". Frontline (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2024. Retrieved 2024-06-23.
  22. Sharma, Vikash (10 October 2021). "Bombs Hurled At Odisha BJP MLA Mohan Majhi's Car In Keonjhar". Odisha TV. Archived from the original on 1 June 2023. Retrieved 13 June 2024.
  23. "3 arrested for attacking Keonjhar MLA Mohan Charan Majhi". Orissa Post. 14 October 2021. Archived from the original on 26 October 2021. Retrieved 13 June 2024.
  24. Pradhan, Ashok (29 September 2023). "Speaker suspends 2 BJP MLAs for 'throwing dal' in Odisha assembly". The Times of India. Archived from the original on 5 October 2023. Retrieved 13 June 2024.
  25. "2 Odisha BJP MLAs Throw Pulses At Speaker In Assembly, Suspended". NDTV. 28 September 2023. Archived from the original on 11 March 2024. Retrieved 13 June 2024.
  26. "Pleasant surprise for family of Odisha CM designate Mohan Charan majhi". The New Indian Express. 12 June 2024. Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.
  27. Mishra, Ashutosh (12 June 2024). "An RSS Hardliner, Mohan Majhi Has Risen Through Party Ranks to Become Odisha CM". The Wire. Archived from the original on 14 June 2024. Retrieved 14 June 2024.
  28. Statistical Report on General election to Odisha Assembly, 2000 (Report). Election Commission of India. Retrieved 1 June 2024.
  29. Statistical Report on General election to Odisha Assembly, 2004 (Report). Election Commission of India. Retrieved 1 June 2024.
  30. Statistical Report on General election to Odisha Assembly, 2009 (Report). Election Commission of India. Retrieved 1 June 2024.
  31. Statistical Report on General election to Odisha Assembly, 2014 (Report). Election Commission of India. Retrieved 1 June 2024.
  32. Statistical Report on General election to Odisha Assembly, 2019 (Report). Election Commission of India. Retrieved 1 June 2024.
  33. Odisha 2024 assembly elections results (Report). Election Commission of India. Archived from the original on 13 June 2024. Retrieved 1 June 2024.