మౌనం (సినిమా)
మౌనం 1995 లో విడుదలైన థ్రిల్లర్ చిత్రం దర్శకత్వం సి. ఉమామహేశ్వరరావు.[1] ఈ చిత్రాన్ని హిందీలోకి మౌన్‌గా అనువదించారు. ఈ చిత్రం రాజకీయ నాయకులు నేరస్థుల స్నేహం, ఓ వివాహిత జంట, ఓ అణు శాస్త్రవేత్త చుట్టూ తిరుగుతుంది.
మౌనం (1995 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సి. ఉమామహేశ్వరరావు |
---|---|
నిర్మాణం | అరవింద స్వామి |
రచన | సి. ఉమామహేశ్వరరావు |
తారాగణం | అరవింద స్వామి నగ్మా చారు హాసన్ రఘువరన్ |
సంగీతం | ఎం.ఎం. కీరవాణి |
విడుదల తేదీ | 1995 |
నిడివి | 137 mins |
భాష | తెలుగు |
కథసవరించు
కిరణ్ ( అరవింద్ స్వామి ) హైదరాబాదులో పోలీస్ ఇన్స్పెక్టర్. అతని అందమైన, ఆకర్షణీయమైన భార్య మంజరి ( నాగ్మా ) పేరున్న నటి. వారి జీవితంలోకి అపార్థం ప్రవేశించి, వారు విడిపోతారు. వారి ఏకైక కుమారుడు రాజు (మాస్టర్ అనిల్ రాజ్) తన తల్లి మంజరితో నివసిస్తున్నాడు. రాజుకు ఏకైక స్నేహితుడు నారాయణ్. వారు చిన్నప్పుడు పాఠశాల రోజుల నుండి స్నేహితులే. ప్రసిద్ధ అణు శాస్త్రవేత్త అయిన డాక్టర్ హమీద్ ఆలీ ( చారు హసన్ ) ని చంపడానికి అవినీతి రాజకీయ నాయకుల బృందం ఒకటి ప్రణాళిక వేసింది. అనుకోకుండా ఒక దొంగ ( శివాజీ రాజా ) డాక్టర్ హమీద్ అలీ హత్య ప్రణాళికలను తెలుసుకుంటాడు.
హత్యకు ప్రణాళిక వేసిన ఆ రహస్య సమావేశంలో పోలీసు కమిషనరు కూడా ఉంటాడు. ఈ దొంగ సమావేశాన్ని వీడియో రికార్డింగ్ చేస్తాడు. కాని అతను దొరికిపోతాడు. అతన్ని కాలుస్తారు, అతడు గాయపడతాడు. కాలు మడతపడి కింద పడతాడు. ఆ నలుగురి ముఠా అతనిని అనుసరిస్తుంది. అయినా ఆ దొంగ తప్పించుకుంటాడు. కొండ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఏకాంత ఆలయాన్ని సందర్శిస్తున్న రాజు, నారాయణలను అతడు కలుస్తాడు. బిత్తరపోయిన రాజు, నారాయణ్‌లకు ఏమి చేయాలో తెలియదు. కానీ రాజు తెలివైనవాడు. తాము మౌనంగా ఉందామని, ఆ టేపు గురించి ఎవరికీ ఏమీ చెప్పవద్దనీ నారాయణ్కు చెబుతాడు. కానీ రాజు హంతకుల దృష్టిలో పడతాడు. వారు అతనిని వెంబడిస్తారు. కారణం రాజు ఆ హత్యలను చూశాడు. కిల్లర్‌ను పట్టుకునే పని రాజు తండ్రి కిరణ్‌కు ఇస్తారు అతను తన కొడుకు కోసం గట్టి జాగ్రత్తలు తీసుకుంటాడు. డాక్టర్ హమీద్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్త శాస్త్రవేత్తల సమావేశాన్ని ఏర్పాటు చేసాడు. డాక్టర్ హమీద్ అలీ హత్యకు మాస్టర్ ప్లానర్ అయిన మిస్టర్ ఎక్స్ (రఘువరన్) ఈ సమావేశానికి వస్తాడు. డాక్టర్ హమీద్ అలీ అధ్యక్షత వహించబోయే వేదిక వద్ద మిస్టర్ ఎక్స్ బాంబును పెడతాడు.
డాక్టర్ హమీద్ అలీ ప్రాణాలనూ, హంతకుల నుండి తన కొడుకు ప్రాణాలనూ కిరణ్ రక్షించగలుగుతాడా? ఈ జంట ఏకమవుతుందా? ఇది మిగతా చిత్రంలో తెలుస్తుంది.
తారాగణంసవరించు
- ఇన్స్పెక్టర్ కిరణ్ గా అరవింద్ స్వామి
- మంజరిగా నగ్మా
- డాక్టర్ హమీద్ అలీగా చారు హాసన్
- మిస్టర్ ఎక్స్ గా రఘువరన్
- రాజుగా మాస్టర్ అనిల్ రాజ్
- దొంగగా శివాజీ రాజా
- సెక్యూరిటీ గార్డుగా ఐరన్‌లెగ్ శాస్త్రి
- జీవా
పాటలుసవరించు
ఈ చిత్రం లోని పాటలను ఎంఎం కీరవాణి స్వరపరిచాడు. అవి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. "నిద్ర లేని నిన్నని .." పాట చార్ట్‌బస్టర్ అయింది.
మూలాలుసవరించు
- ↑ "మౌనం నటీనటులు-సాంకేతిక నిపుణులు | Mounam Cast & Crew Details in Telugu - Filmibeat Telugu". telugu.filmibeat.com. Archived from the original on 2020-08-22. Retrieved 2020-08-22.