మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ శిల్పారామం

తెలంగాణ రాష్ట్రం, మహబూబ్​నగర్ పట్టణంలో ఉన్న ఒక పర్యాటక కేంద్రం

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ శిల్పారామం అనేది తెలంగాణ రాష్ట్రం, మహబూబ్​నగర్ పట్టణంలో ఉన్న ఒక పర్యాటక కేంద్రం.

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ శిల్పారామం
సాధారణ సమాచారం
రకంకళల నైపుణ్య గ్రామం
నిర్మాణ శైలిజాతి
ప్రదేశంమహబూబ్​నగర్, తెలంగాణ
పూర్తి చేయబడినది2023
ప్రారంభం2023 మే 6

ఏర్పాటు మార్చు

మహబూబ్‌నగర్‌ పట్టణంలో మినీ శిల్పారామం ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2019 జూలై 26న జీఓ నెం.53ను విడుదల చేసి, ఈ నిర్మాణానికి 8కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.[1]

నిర్మాణం మార్చు

ప్రధాన ముఖ ద్వారం, పచ్చిక బయళ్ళు, ఫౌంటెన్‌లు, అన్ని రకరకాల మొక్కలు, చిన్నారుల ప్రత్యేక ఆటస్థలం, పెద్దలు సేదతీరడం కోసం పార్కు, వాకింగ్‌ ట్రాక్స్‌ను, వివిధ రకాల వంటకాలతో ఫుడ్‌కోర్ట్, సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఓపెన్‌ ఎయిర్‌ ఆడిటోరియం, సమావేశాల కోసం కాన్ఫరెన్స్‌హాల్, ఫంక్షన్‌హాల్, చేనేత, హస్తకళల స్టాల్స్, పల్లెదనం ఉట్టిపడేలా గ్రామీణ వాతావరణంలో ఉండే ఎద్దుల బొమ్మలు, రైతుల బొమ్మలు ఏర్పాటుచేశారు.[1]

ప్రారంభం మార్చు

2023 మే 6న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈ శిల్పారామంను ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖామంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్‌ సి. లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వరరెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, గుర్కా జైపాల్ యాదవ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, కసిరెడ్డి నారాయణ రెడ్డి, చల్లా వెంకట్రామ్ రెడ్డితోపాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[2]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "పాలమూరులో మినీ శిల్పారామం". Sakshi. 2019-07-27. Archived from the original on 2023-05-06. Retrieved 2023-05-06.
  2. Today, Telangana (2023-05-06). "KTR inaugurates mini Shilparamam in Mahabubnagar". Telangana Today. Archived from the original on 2023-05-06. Retrieved 2023-05-06.

బయటి లింకులు మార్చు