చిట్టెం రామ్మోహన్ రెడ్డి

చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున మక్తల్ శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[1]

చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి
చిట్టెం రామ్మోహన్ రెడ్డి


పదవీ కాలం
 2005 - 2009, 2014 - 2018, 2018 - ప్రస్తుతం
నియోజకవర్గం మక్తల్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1963, జనవరి 30
ధన్వాడ, నారాయణపేట జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు చిట్టెం నర్సిరెడ్డి , సుమిత్రారెడ్డి
జీవిత భాగస్వామి సుచరితారెడ్డి
సంతానం చాణక్య , పృథ్వీష్‌
నివాసం మక్తల్‌

జననం, విద్య

మార్చు

రామ్మోహన్ రెడ్డి 1963, జనవరి 30న నర్సిరెడ్డి - సుమిత్రారెడ్డి దంపతులకు నారాయణపేట జిల్లా, ధన్వాడలో జన్మించాడు.[2] రామ్మోహన్ రెడ్డి కుటుంబం మక్తల్‌లో స్థిరపడింది. తండ్రి చిట్టెం నర్సిరెడ్డి స్వాతంత్ర్య సమరయోధుడు, మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేశాడు.[3]

ధన్వాడలో ఆరోతరగతి వరకు చదివి, ఉన్నత చదువుల కోసం 1970లో హైదరాబాదుకు వెళ్ళాడు. అక్కడే 1982లో బికాంలో డిగ్రీ పూర్తి చేసి, పోలీస్‌ కావాలనే కోరికతో ఎస్‌ఐ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొన్నాడు. తర్వాత చదువు మానేసి 1984లో వ్యాపారరంగంలోకి అడుగుపెట్టాడు.

వ్యక్తిగత జీవితం

మార్చు

రామ్మోహన్ రెడ్డికి 1986లో రంగారెడ్డి జిల్లాకు చెందిన సుచరితతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు (చాణక్య, పృథ్వీష్‌) ఉన్నారు.[4]

రాజకీయ విశేషాలు

మార్చు

2005, ఆగస్టు 15న అప్పటి మక్తల్ ఎమ్మెల్యేగా ఉన్న చిట్టెం నర్సిరెడ్డి నక్సలైట్ల కాల్పుల్లో మరణించగా, 2005లో జరిగిన ఉపఎన్నికలో రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[5] 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాడు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీచేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి ఎల్కోటి ఎల్లారెడ్డి పై 10,027 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. 2016లో టిఆర్ఎస్ పార్టీలో చేరాడు.[6] 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీచేసి స్వతంత్ర అభ్యర్థి జలందర్ రెడ్డి పై 48,315 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[7] ఆయనను 2023లో జరిగే శాసనసభ ఎన్నికల్లో మక్తల్ నుండి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు.[8]

మూలాలు

మార్చు
  1. "Member's Profile - Telangana-Legislature". www.telanganalegislature.org.in. Archived from the original on 2021-05-27. Retrieved 2021-09-05.
  2. Eenadu (25 October 2023). "ప్రజాప్రతినిధుల వాడ.. ధన్వాడ". Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.
  3. Sakshi (4 August 2019). "'పోలీస్‌ కావాలనుకొని ఎమ్మెల్యేనయ్యాను'". Archived from the original on 31 జూలై 2021. Retrieved 31 July 2021.
  4. admin (2019-01-08). "Makthal MLA Chittem Ram Mohan Reddy". Telangana data (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-09-05.
  5. "Chittem Ram Mohan Reddy | MLA | Makthal | Mahbubnagar". the Leaders Page (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-04-15. Retrieved 2021-09-05.
  6. "టీఆర్ఎస్ లో చేరిన డీకే అరుణ సోదరుడు". Sakshi. 2016-04-13. Retrieved 2021-09-05.
  7. "Makthal Election Result 2018 Live Updates: Chittem Rammohan Reddy of TRS Wins". News18 (in ఇంగ్లీష్). Retrieved 2021-09-05.
  8. Namasthe Telangana (22 August 2023). "సమరానికి సై". Archived from the original on 13 November 2023. Retrieved 13 November 2023.