యలమంచిలి సుజనా చౌదరి

యలమంచిలి సుజనా చౌదరి ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వ్యాపారవేత్త, తెలుగుదేశం పార్టీ నాయకుడు. ప్రస్తుతం ఈయన రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు.[2]

యలమంచిలి సుజనా చౌదరి
యలమంచిలి సుజనా చౌదరి

సుజనా చౌదరి


రాజ్యసభ సభ్యుడు
పదవీ కాలం
22 జూన్ 2010[1] – 2 ఏప్రిల్ 2022
నియోజకవర్గం ఆంధ్ర ప్రదేశ్

వ్యక్తిగత వివరాలు

జననం (1961-06-02) 1961 జూన్ 2 (వయసు 63)[1]
కంచికచెర్ల, కృష్ణా జిల్లా [1]
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ[1]
నివాసం హైదరాబాద్, తెలంగాణ
పూర్వ విద్యార్థి సి.బి.ఐ.టి, హైదరాబాదు [1]
వృత్తి వ్యాపారవేత్త
రాజకీయ నాయకుడు
వెబ్‌సైటు YSChowdary.com
[[జూన్ 5]], 2014నాటికి

ప్రారంభ జీవితం

మార్చు

సుజనా చౌదరి 1961 జూన్ 2న కృష్ణా జిల్లా కంచికచెర్లలో జన్మించాడు. ఆయన హైదరాబాద్ సీబీఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్, కోయంబత్తూరులోని సీఎస్‌జీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెషిన్ టూన్ ఇంజనీరింగ్‌లో పీజీ డిగ్రీ పూర్తి చేసి 1986లో సుజనా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌ను స్థాపించి రాజకీయాల్లోకి ప్రవేశించే వరకు సుజనా గ్రూప్‌ ఆఫ్ ఇండస్ట్రీస్‌కు అధిపతిగా ఉన్నాడు.

రాజకీయ జీవితం

మార్చు

సుజనా చౌదరి టీడీపీ పార్టీ రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2010లో తొలిసారిగా రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై ఎన్‌డీఏ ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉన్న సమయంలో 2014 నుండి 2018 వరకు మోదీ మంత్రివర్గంలో కేంద్ర సైన్స్, టెక్నాలజీ శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.

సుజనా చౌదరి 2016లో టీడీపీ తరపున రెండోసారి రాజ్యసభకు ఎన్నికై తెలుగుదేశం పార్టీ రాజ్యసభాపక్ష నాయకుడిగా పని చేసి ఆ తరువాత 20 జూన్ 2019న తన సహచర టీడీపీ ఎంపీలు సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహనరావులతో కలిసి డీల్లీలోని బీజేపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[3]

సుజనా చౌదరి 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి ఆసిఫ్ షేక్ పై 47032 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[4][5][6]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 [1] Archived 2012-05-05 at the Wayback Machine Government of India, YS Chowdary Detailed Profile. Retrieved 28 August 2012.
  2. The Hindu (4 June 2024). "BJP's Sujana Chowdary wins over YSRCP's Asif Shaik in Vijayawada West constituency" (in Indian English). Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  3. BBC News తెలుగు (20 June 2019). "బీజేపీలో చేరిన నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు.. ఎంపీల 'విలీనం'పై లీగల్ యాక్షన్ తీసుకుంటామన్న టీడీపీ". Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
  4. Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Vijayawada West". Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
  5. BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  6. EENADU (5 June 2024). "అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.