యశోధర దాసప్ప

భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, గాంధేయవాది, సంఘ సంస్కర్త, కర్ణాటక రాష్ట్ర మాజీమంత్రి.

యశోధర దాసప్ప, భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, గాంధేయవాది, సంఘ సంస్కర్త, కర్ణాటక రాష్ట్ర మాజీమంత్రి.[2] భారతీయ జాతీయ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలిగా ఉంటూ ఎస్ఆర్ కాంతి (1962),[3] ఎస్. నిజలింగప్ప (1969) మంత్రివర్గంలో కర్ణాటక రాష్ట్ర మంత్రిగా పనిచేసింది.[4]

యశోధర దాసప్ప
జననం(1905-05-28)1905 మే 28 [1]
మరణం1980
విద్యాసంస్థక్వీన్ మేరీ కళాశాల, మద్రాస్
వృత్తిగాంధేయవాది
సంఘ సంస్కర్త
కర్ణాటక రాష్ట్ర మాజీమంత్రి.
జీవిత భాగస్వామిహెచ్.సి. దాసప్ప
పిల్లలురాందాస్, తులసీదాస్, ప్రభామోహన్ చంపా
పురస్కారాలుపద్మభూషణ్

జననం, విద్యాభ్యాసం

మార్చు

యశోధర దాసప్ప 1905, మే 28న కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులోని వొక్కలిగ కుటుంబంలో జన్మించింది.[5] తండ్రి కెహెచ్ రామయ్య సామాజిక కార్యకర్త. సంపన్న కుటుంబంలో జన్మించిన యశోధర, సామాజిక కార్యకర్తగా పనిచేస్తూ భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నది.[6] లండన్ మిషన్ స్కూల్ లో, మద్రాస్‌లోని క్వీన్ మేరీస్ కాలేజీలో తన చదువును పూర్తిచేసింది.

వ్యక్తిగత జీవితం

మార్చు

జవహర్‌లాల్ నెహ్రూ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన హెచ్‌సి దాసప్పతో యశోధర వివాహం జరిగింది.[7] వారి చిన్న కుమారుడు తులసీదాస్ దాసప్ప, చరణ్ సింగ్ మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా పనిచేశాడు.[2]

రాజకీయ జీవితం

మార్చు

భారత స్వాతంత్ర్య పోరాటం, 1930ల అటవీ సత్యాగ్రహ ఉద్యమం వంటి అనేక సామాజిక ఉద్యమాలలో చురుకుగా పనిచేసింది. ఆ ఉద్యమాల వల్ల 1200 మందికి పైగా జైలుకు పంపబడ్డారు.[8] 1938లో విదురాశ్వత ఎపిసోడ్ 35 మంది పోలీసు కాల్పుల్లో మరణించారు.[9] ఈ ఉద్యమంలో పాల్గొన్నందుకు, యశోధర జైలు శిక్షను కూడా అనుభవించింది.[10]

భూగర్భ సత్యాగ్రహం (స్వాతంత్ర్య పోరాటం) కార్యకలాపాలకు యశోధర ఇల్లు ఒక సమావేశ స్థానంగా ఉండేది. ఆందోళన చేస్తున్న నిరసనకారులపై క్రూరత్వానికి పేరుగాంచిన హామిల్టన్ పేరును ఒక భవనానికి పేరు పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు ఆమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ప్రసంగాలు వ్రాసింది.[6]

నిజలింగప్ప మంత్రివర్గంలో సీనియర్ మంత్రిగా పనిచేస్తున్నప్పుడు, కర్ణాటక రాష్ట్రంలో నిషేధాన్ని ఎత్తివేయడాన్ని నిరసిస్తూ ఆమె ఆ పదవికి రాజీనామా చేసి వార్తల్లోకెక్కింది.[3] సమాజానికి ఆమె చేసిన కృషికి భారత ప్రభుత్వం 1972లో భారతదేశ మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ ను ప్రదానం చేసింది.[11][12]

యశోధర 1980లో మరణించింది.[4]

మూలాలు

మార్చు
  1. "The Role of Women ,in the Freedom Movement of Princely Mysore" (PDF). shodhganga.inflibnet.ac.in. Retrieved 1 September 2021.
  2. 2.0 2.1 "Tulasidas Dasappa, former MP, passes away". The Hindu. 20 April 2005. Retrieved 1 September 2021.
  3. 3.0 3.1 "Position of women in governance still weak". The Hindu. 12 November 2009. Retrieved 1 September 2021.
  4. 4.0 4.1 "Tulasidas Dasappa is no more". Deccan Herald. 20 April 2005. Retrieved 1 September 2021.
  5. Gowda, H.H.Annaiah (5 September 1971). "Vokkaligas". The Illustrated Weekly Of India Vol.92, No.27-39(july-sept)1971. Bombay: Times of India Press. p. 11-13.
  6. 6.0 6.1 "Yashodhara Dasappa: The firebrand Gandhian from Bengaluru who brought in women into the Satyagraha movement". InUth (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-08-12. Retrieved 1 September 2021.
  7. "Union cabinet reshuffle: Karnataka gets lion's share in Singh's ministry". Anil Kumar M. The Times of India. 17 June 2013. Retrieved 1 September 2021.
  8. Dr. Melkunde Shashidhar. A HISTORY OF FREEDOM AND UNIFICATION MOVEMENT IN KARNATAKA. Lulu.com. pp. 157–. ISBN 978-1-329-82501-7.
  9. "FREEDOM FIGHTER AND SOCIAL REFORMER SMT. YASHODHARAMMA DASAPPA". Karnataka Ithihasa Academy. 2014. Archived from the original on 25 నవంబరు 2015. Retrieved 1 September 2021.
  10. itihasaacademy (2014-08-21). "Freedom fighter and social reformer Smt. Yashodharamma Dasappa". Karnataka Itihasa Academy. Archived from the original on 2017-08-19. Retrieved 1 September 2021.
  11. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2016. Archived from the original (PDF) on 15 నవంబరు 2014. Retrieved 1 September 2021.
  12. "Padma Bhushan Awardees". Ministry of Home Affairs, Government of India. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 1 September 2021.

బయటి లింకులు

మార్చు