యష్ జోహార్ (6 సెప్టెంబరు 1929 – 26 జూన్ 2004) ప్రముఖ బాలీవుడ్ నిర్మాత. 1976లో ధర్మా ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు యష్. విలాసవంతమైన సెట్లకు, మంచి లొకేషన్లకు, భారతీయ సంప్రదాయాలకు విలువలకు ధర్మా ప్రొడక్షన్స్ సినిమాలు ప్రసిద్ధి.[1]

యష్ జోహార్

వ్యక్తిగత జీవితం మార్చు

యష్ జోహార్ 1929, సెప్టెంబరు 6న పంజాబ్ లోని అమృత్ సర్ లో జన్మించారు. యష్ చోప్రా, బి.ఆర్.చోప్రాల సోదరి హీరో జోహార్ ను వివాహం చేసుకున్నారు ఆయన. వీరి కుమారుడు కరణ్ జోహార్ ప్రస్తుతం బాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత అయ్యారు. కేన్సర్ తో పోరాడుతున్న యష్ 75 ఏళ్ళ వయసులో చెస్ట్ ఇన్ఫెక్షన్ తో  ముంబైలో జూన్ 26, 2004న మరణించారు. ఆయన మరణానంతరం  కుమారుడు కరణ్ ధర్మా ప్రొడక్షన్స్ ను చూసుకుంటున్నారు.

సినిమా జీవితం మార్చు

1952లో సునీల్ దత్ నిర్మాణ సంస్థ అజంత ఆర్ట్స్‌లో పనిచేశారు. యష్. ముఝే జానే దో, యే రాస్తే హై ప్యార్‌కే వంటి సినిమాలకు పనిచేశారు. ఆ తరువాత నిర్మాత దేవానంద్ తీసిన గైడ్ సినిమాకు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు ఆయన. ఆ సినిమా పెద్ద హిట్ కావడంతో దేవానంద్ నిర్మాణ సంస్థ నవకేతన్ ఫిలింస్‌కు పనిచేయడం మొదలు పెట్టారు. యష్. జ్వెల్ థీఫ్, ప్రేమ్‌పూజారి, హరేరామా హరేకృష్ణ వంటి సినిమాలకు సహ నిర్మాణకత్వం వహించారు ఆయన.[2]

ధర్మ ప్రొడక్షన్స్‌ సంస్థలో భారీ విజయం పొందిన చిత్రాలు మార్చు

1976లో, యష్ స్వంత నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్‌ను స్థాపించారు.[3] రాజ్ ఖొస్లా దర్శకత్వంలో ఈ సంస్థ నిర్మించిన మొదటి చిత్రం దోస్తానా పెద్ద హిట్ అందుకుంది. 1980, 90 కాలంలో అగ్నిపథ్, గుంరాహ్, డూప్లికేట్ వంటి సినిమాలు నిర్మించారు యష్.

1998లో ఈ సంస్థ నిర్మించిన కుచ్‌కుచ్ హోతాహై సినిమా ఊహాతీతంగా భారీ హిట్ అయింది. షారుక్ ఖాన్, కాజోల్, రాణీముఖర్జీ నటించిన ఈ సినిమా ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్ మాత్రమే కాక ఎన్నో అవార్డులను కొల్లగొట్టింది. ఫిలింఫేర్ అవార్డులు, లక్స్‌జీ సినీ అవార్డులు, సాన్‌సుయ్ వ్యుయర్స్ చాయిస్ అవార్డులు, బాలీవుడ్ మూవీ అవార్డులు, జాతీయ అవార్డులు వంటి ఎన్నో అవార్డులు గెలుచుకుందీ చిత్రం. యష్ కుమారుడు కరణ్ నిర్మించిన కభీకుషీ కభీగమ్ సినిమా కూడా అతి పెద్ద హిట్ గా నిలిచింది. షారుక్ ఖాన్, జుహీ చావ్లా, అజీజ్ మీర్జాలు కలసి 1999లో స్థాపించిన బాలీవుడ్ సినీ పంపణీ సంస్థ డ్రీమ్జ్‌అన్ లిమిటెడ్‌లో యష్‌కు కూడా భాగం ఉంది. ఈ సంస్థ నిలదొక్కుకునేందుకు జోహార్ కృషి చెప్పుకోదగ్గది. ఈ సంస్థ మొదటి సినిమా ఫిర్‌భీ దిల్‌హై హిందిస్థానీ నిర్మాణంలో ఆయన పాత్ర పెద్దదే.[4]

కల్‌ హో నాహో యష్ ఆఖరి సినిమా. ఈ సినిమా కమర్షియల్ గా హిట్ కావడమే కాక, విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. ఆ సంవత్సరానికిగానూ బాలీవుడ్ లో రెండో అతి ఎక్కువ వసూళ్ళు సాధించిన చిత్రంగానూ, ఓవర్ సీస్ లో ఎక్కువ వసూళ్ళు సాధించిన చిత్రంగానూ నిలిచింది.

ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాలో యష్ సీనియర్ సభ్యుడు కూడా.

ఆయన సినిమాల్లో కొన్ని.. మార్చు

  • దోస్తానా (1981)
  • దునియా (1984)
  • మకద్దూర్ కా ఫైస్లా (1987)
  • అగ్నిపథ్ (1990)
  • గుమర్హ్ (1993)
  • డూప్లికేట్ (1998)
  • కుచ్ కుచ్ హోతా హై (1998)
  • కభీ ఖుషీ కభీ గమ్ (2001)
  • కల్ హో నా హో (2003)

ఇవి కూడా చూడండి మార్చు

References మార్చు

  1. Subhash K Jha (June 28, 2004). "Good-bye, Yashji! A Personal Tribute". Sify Movies. Archived from the original on 2014-11-01. Retrieved 2016-07-22.
  2. "Filmmaker Yash Johar dead". Rediff.com. Retrieved 2012-11-05.
  3. Our Profile Archived 2009-11-25 at the Wayback Machine Dharma Productions
  4. "Rediff On The NeT, Movies: Shah Rukh Khan speaks". In.rediff.com. 2000-01-13. Retrieved 2012-11-05.