యువకుడు 2000 లో విడుదలైన తెలుగు చిత్రం. 2000 మే 18 న విడుదలైంది. దీనిని అక్కినేని నాగార్జున, ఎన్.సుధాకర్ రెడ్డి నిర్మించారు. . కరుణాకరన్ దర్శకత్వం వహించాడు.[1] ఇందులో సుమంత్, భూమికా చావ్లా నటించారు. ఈ చిత్రం కరుణాకరన్, సుమంత్ ఇద్దరికీ రెండవ వెంచర్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సగటు కంటే మెరుగ్గానే నడిచి, విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

యువకుడు
(2000 తెలుగు సినిమా)
దర్శకత్వం కరుణాకరన్
నిర్మాణం అక్కినేని నాగార్జున, ఎన్. సుధాకరరెడ్డి
తారాగణం మహేష్,
సుమంత్,
జయసుధ
సంగీతం మణిశర్మ
ఛాయాగ్రహణం బాలసుబ్రహ్మణ్యం
కూర్పు మార్తాండ్ కె వెంకటేష్
నిర్మాణ సంస్థ గ్రేట్ ఇండియా కంబైన్స్
భాష తెలుగు

తల్లి ( జయసుధ ) తో చాలా సన్నిహిత అనుబంధాన్ని పంచుకునే స్వేచ్ఛాయుత కళాశాల విద్యార్థి శివ ( సుమంత్ ) కథ ఇది. అతను విధి నిర్వహణలో మరణించిన ఒక ఆర్మీ అధికారి కుమారుడు. తన తల్లి నిరాకరించినప్పటికీ, శివకు తన తండ్రి అడుగుజాడలను అనుసరించి సైన్యంలో చేరాలనే బలమైన కోరిక ఉంది. ఇంతలో, అతను సింధు ( భూమికా చావ్లా ) తో ప్రేమలో పడతాడు. కానీ ఆమె అతని ప్రతిపాదనను తిరస్కరిస్తుంది. సింధుపై కొడుకు ప్రేమను తెలుసుకున్న శివ తల్లి, వారిని ఒకచోట చేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. తన కొడుకును పెళ్ళి చేసుకోమని ఆమె సింధును అడుగుతుంది. ఆమె కోసమే తాను అలా చేస్తున్నానని చెప్పి సింధు ఈ ప్రతిపాదనను అంగీకరిస్తుంది. గొడవలతో మొదలైనప్పటికీ, వారి జీవితం చివరకు గాట్లో పడుతుంది. సింధు శివను ప్రేమిస్తుంది. అయితే, శివ సైన్యంలోకి చేరినప్పుడు కథ ఊహించని మలుపు తీసుకుంటుంది. అతను తన తల్లి ఇష్టానికి వ్యతిరేకంగా సైన్యంలో చేరతాడు. తద్వారా వారిమధ్య పెద్ద అంతరం ఏర్పడుతుంది. శివ చివరికి విధి నిర్వహణలో తనను తాను నిరూపించుకుంటాడు. తన తల్లితో, సింధుతో రాజీపడతాడు.

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • దర్శకుడు - కరుణాకరన్
  • సంగీతం - మణిశర్మ

పాటలు

మార్చు
  • "చిటికేస్తే అలలైనా" - దేవి శ్రీ ప్రసాద్ , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
  • "జగడ జగడ" - దేవి శ్రీ ప్రసాద్, రచన: వేటూరి సుందర రామమూర్తి
  • "మైకం కాదిది" - ఎస్పీబీ చరణ్ , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
  • "నా పాదం ఆగేనా" -పార్థసారథి , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
  • "థా థా థి జతులేయ" - శంకర్ మహదేవన్ , రచన; సిరి వెన్నెల సీతారామ శాస్త్రి

బయటిలంకెలు

మార్చు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో యువకుడు

మూలాలు

మార్చు
  1. Yuvakudu review
"https://te.wikipedia.org/w/index.php?title=యువకుడు&oldid=3993874" నుండి వెలికితీశారు