యార్లగడ్డ సుమంత్ కుమార్

సుమంత్

సుమంత్ గా ప్రసిద్ధిచెందిన సుమంత్ కుమార్ తెలుగు సినిమా నటుడు/నిర్మాత. ఇతడు అక్కినేని నాగేశ్వరరావు మనుమడు; అక్కినేని పెద్దకూతురు సత్యవతి, అల్లుడు యార్లగడ్డ సురేంద్ర దంపతుల కుమారుడు.

సుమంత్ కుమార్ యార్లగడ్డ
Sumanthkumar1.jpg
జననం
సుమంత్ కుమార్

(1975-02-09) 1975 ఫిబ్రవరి 9 (వయసు 48)
వృత్తిసినిమా నటుడు, నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1999-ప్రస్తుతం
తల్లిదండ్రులుసత్యవతి, యార్లగడ్డ సురేంద్ర

వ్యక్తిగత జీవితంసవరించు

సుమంత్ 1975 ఫిబ్రవరి 9 న హైదరాబాదులో జన్మించాడు. సుమంత్ తల్లి నటుడు అక్కినేని నాగేశ్వరరావు కుమార్తె. తండ్రి యార్లగడ్డ సురేంద్ర. సుమంత్ ఈ దంపతులకు ఒకడే సంతానం. అక్కినేని మనవలు, మనవరాళ్ళలో సుమంతే అందరికన్నా పెద్దవాడు. ఇతను పుట్టిన కొన్ని నెలల తర్వాత అతని తల్లిదండ్రులు అమెరికాకు వెళ్ళవలసి వచ్చింది. సుమంత్ మాత్రం తాత కోరిక మేరకు, అక్కినేని దంపతుల దగ్గర ఉండిపోయాడు. అప్పుడు ఆయన గుండె సంబంధించిన శస్త్రచికిత్స చేసుకుని సినిమాలకు కొన్నాళ్ళు దూరంగా ఉంటున్నాడు. తాను సినిమాల్లో ఊపిరిసలపకుండా ఉన్నందున తన పిల్లల బాల్యాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోయానని అందుకే సుమంత్ ని తానే పెంచాలనుకుంటున్నట్లు అక్కినేని చెప్పాడు. తర్వాత అతన్ని దత్తత కూడా తీసుకున్నారు అక్కినేని దంపతులు.[1]

సుమంత్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన తర్వాత అమెరికా వెళ్ళి మిషిగన్ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ కోర్సులో చేరాడు. అయితే అది నచ్చక చికాగో లో కొలంబియా కాలేజీ లో ఫిల్మ్ కోర్సులో చేరి డిగ్రీ సంపాదించాడు. సుమంత్ 2004 సంవత్సరంలో కీర్తి రెడ్డి ని వివాహం చేసుకొని, 2006 లో విడాకులు తీసుకున్నాడు.

సినీ జీవితంసవరించు

సుమంత్ నట జీవితం 1999 సంవత్సరం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ప్రేమ కథ చిత్రంతో మొదలైంది. ఇదీ, అతని రెండవ చిత్రం, యువకుడు పర్వాలేదు అనిపించుకున్నాయి. ఇతను తర్వాత నటించిన సినిమాలు అంతగా ఆడలేదు. అయితే 2003 లో జెనీలియా తో నటించిన సత్యం తో చిత్రసీమలో స్థిరపడ్డాడు. ఆ తర్వాత గౌరి కూడా విజయం సాధించి అతనికి మాస్ ఇమేజ్ ఇచ్చింది. మళ్ళీ కొన్ని విఫలాలు తర్వాత, 2006 సంవత్సరం లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో గోదావరి సినిమాతో ఉన్నత స్థానానికి చేరాడు. తర్వాత విడుదలైన చిన్నోడు అంతగా హిట్ కాలేదు. మధుమాసం, పౌరుడు బాక్సాఫీస్ లో బాగానే ఆడి, కొన్ని సెంటర్స్ లో 100 రోజులు కూడా నడిచాయి.

2009 లో వచ్చిన బోణి ప్లాప్ అయ్యింది. 2011 లో గోల్కొండ హై స్కూల్ హిట్ ఐయ్యి సుమంత్ కి మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత కొన్ని వరస విఫలాలు తర్వాత 2017 లో మళ్ళీ రావా అతని కెరీర్ కి మళ్ళీ ఊపిరి ఇచ్చింది. ఎన్.టీ.ఆర్:కథానాయకుడు లో అతని తాత అక్కినేని పాత్ర పోషించి పలు ప్రశంసలు పొందాడు.


నటించిన చిత్రాలుసవరించు

అక్కినేని వంశ వృక్షంసవరించు

మూలాలుసవరించు

  1. "Sumanth Said Yes For Second Marriage". Greatandhra.com. 2011-09-18. Archived from the original on 10 February 2015. Retrieved 2013-03-18.