యోగి వేమన విశ్వవిద్యాలయం

యోగి వేమన విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్ లోని కడపలో 2006 మార్చి 9 న ఏర్పాటుచేయబడిన నూతన విశ్వవిద్యాలయము. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్నాతకోత్తర కేంద్రం స్థాయి అనుబంధ కళాశాలగా వుండేది. ఇది కడప నుండి పులివెందుల వెళ్ళే మార్గంలో మిట్టమీదపల్లె పంచాయితీ పరిధిలో సుమారు 700 ఎకరాలలో విస్తరించివుంది. 2012-13 సంవత్సరంలో ఈ విశ్వవిద్యాలయ మొట్టమొదటి స్నాతకోత్సవం జరిగింది.

యోగి వేమన విశ్వవిద్యాలయం
Yogi-Vemana.jpg
నినాదంబోధన, పరిశోధన, సేవ
రకంప్రభుత్వ విశ్వవిద్యాలయము
స్థాపితం2006
స్థానంకడప
ఆంధ్రప్రదేశ్
, భారతదేశం,
516003
కాంపస్గ్రామీణ
జాలగూడుఅధికారిక వెబ్సైటు

చరిత్రసవరించు

రాయలసీమ ప్రజల కోరిక మేరకు ప్రజా కవి యోగి వేమన పేరున యోగి వేమన విశ్వ విద్యాలయమును కడప పట్టణంలో ప్రారంబించారు. ఈ విశ్వవిద్యాలయం 2006 మార్చి 9వ తేదీన ఏర్పాటైనది. వ్యవస్థాపక ఉపకులపతిగా ప్రొ. ఎ. రామచంద్రారెడ్డి అదే ఏడాది నవంబరు 6వ తేదీన బాధ్యతలు స్వీకరించాడు. ఐదు లక్షల చదరపు అడుగుల మేరకు వివిధ రకాల భవన సముదాయాలను నిర్మించారు. 700 ఎకరాల విస్తీర్ణంలో ఈ విశ్వవిద్యాలయం ఉంది.[1]


విశేషాలుసవరించు

విశ్వవిద్యాలయానికి 100 శాశ్వత, 82 తాత్కాలిక బోధనా సిబ్బంది 307 శాశ్వత బోధనేతర సిబ్బంది, 125 మంది గుత్తసేవల సిబ్బంది వున్నారు. 13 పి.జి, 93యు.జి. 2 న్యాయ,55 బి.ఇడి, 3 బి.పి.ఇడి, మొత్తం 169 కళాశాలలు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా, వివిధ రంగాలలో స్నాతక పూర్వ, స్నాతకోత్తర, వృత్తిపర విద్యావకాశాలు కలిగిస్తున్నాయి. ప్రారంభించిన నాటినుండి పరిశోధనా పరంగా 29 కోట్ల విలువైన 88 కంటె ఎక్కువ ప్రాజెక్టులను సాధించింది. 2016లో 2.54 CGPA తో నాక్ (NAAC) 'బి' స్థాయి హోదా పొందింది. [1]


మూలాలుసవరించు

  1. 1.0 1.1 "Abput YVU". Yogi vemana university. Retrieved 2022-08-23.

ఇవి కూడా చూడండిసవరించు

బయటి లింకులుసవరించు