1959, ఏప్రిల్ 22న కాండీలో జన్మించిన రంజన్ మధుగలె (Ranjan Senerath Madugalle) శ్రీలంకకు చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు. 1993లో ఇతడు మ్యాచ్ రెఫరీగా బాధ్యతలు స్వీకరించాడు. 1979లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ట్రోఫీలో తొలిసారిగా జట్టుకు ప్రాతినిధ్యం వహించి 1988 వరకు జట్టుకు సేవలందించాడు. 1982లో శ్రీలంక జట్టు తొలి టెస్ట్ మ్యాచ్‌లో 65 పరుగులు సాధించిఈన్నింగ్సులో టాప్ స్కోరర్‌గా నిలవడమే కాకుండా అర్జున రణతుంగతో కలిసి 99 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పినాడు.

వన్డే క్రికెట్సవరించు

మధుగలె 1984 వరకు ఒక్క అంతర్జాతీయ వన్డే మినహా అన్నింటిలో జట్టు తరఫున పాల్గొన్నాడు. కాని 25 వన్డేలు పూర్తయ్యే సరికి అతని ఖాతాలో ఒకేఒక్క అర్థసెంచరీ చేరింది. కెరీర్ మొత్తంలో 63 వన్డేలు ఆడిననూ సాధించిన అర్థసెంచరీలు 3 మాత్రమే. వన్డేలలో అతడి అత్యధిక స్కోరు 73 పరుగులు. సగటు 18.62, మొత్తం పరుగులు 950.

టెస్ట్ క్రికెట్సవరించు

మధుగలె 21 టెస్టులలో 29.39 సగటుతో 1029 పరుగులు సాధించాడు. అందులో 1 సెంచరీతో సహా 7 అర్థసెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్‌లో అతడి అత్యధిక స్కోరు 103 పరుగులు.

జట్టు కెప్టెన్‌గాసవరించు

రంజన్ మధుగలె 1988లో జట్టు నాయకత్వ హోదా పొందినాడు. కాని ఆస్ట్రేలియా, ఇంగ్లాండులతో జరిగిన పోటీలలో ప్రతిభను చూపలేకపోయాడు. వన్డేలలో కూడా 13 మ్యాచ్‌లకు నాయకత్వం వహించి రెండింటిని గెలిపించాడు. నాయకత్వం సమయంలో తన బ్యాటింగ్ పరిస్థితి పూర్తిగా దిగజారింది. అతడి చివరి వన్డేలో 1988లో పాకిస్తాన్ పై శ్రీలంక విజయం సాధించిననూ అతను బ్యాటింగ్ చేయలేదు.

బయటి లింకులుసవరించు