రఘురామ్‌ అంబడపూడి (జననం 1975 ఏప్రిల్ 15)[3][1] భారతీయ టెలివిజన్ నిర్మాత, నటుడు. ఆయన ఎంటీవి ఇండియాలో సీనియర్ పర్యవేక్షక నిర్మాత, ఎంటీవి రోడీస్, ఎంటీవి డ్రాపౌట్ ప్రైవేట్ లిమిటెడ్, ఎంటీవి స్ప్లిట్స్‌విల్లా లకు యాంకర్ కమ్ డైరెక్టర్‌గా ఉన్నాడు.

రఘు రామ్
జననం
రఘురామ్‌ అంబడపూడి

(1975-04-15) 1975 ఏప్రిల్ 15 (వయసు 49)[1]
వృత్తి
  • టెలివిజన్ నిర్మాత
  • టెలివిజన్ ప్రెజెంటర్
  • నటుడు
క్రియాశీల సంవత్సరాలు2000–ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ఎంటీవి రోడీస్
జీవిత భాగస్వామి
(m. 2006; div. 2018)
[2]
బంధువులురాజీవ్ లక్ష్మణ్ (సోదరుడు)
తన సోదరుడు రాజీవ్ లక్ష్మణ్‌తో రఘు రామ్ (ఎడమ)

ఆయన తన జీవితంపై రియర్‌వ్యూ: మై రోడీస్ జర్నీ అనే పుస్తకాన్ని రాయగా రూపా పబ్లికేషన్స్ ప్రచురించింది.[4] ఇది నవంబరు 2013 నుండి అందుబాటులో ఉండగా, అతని అభిమానుల నుండి బాగా ఆదరణ పొందింది.[5]

బాల్యం, విద్యాభ్యాసం

మార్చు

రఘు రామ్ తన కవల సోదరుడు రాజీవ్ లక్ష్మణ్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంలో జన్మించాడు.[6] అతని తండ్రి చార్టర్డ్ అకౌంటెంట్, తల్లి జర్నలిస్ట్.[1] రఘురామ్‌కి సుప్రియ నిస్తాల అనే చెల్లెలు ఉంది.[1]

మొదటి సంవత్సరం ఢిల్లీలోని దేశబంధు కళాశాల, ద్వితీయ సంవత్సరం శ్రీ వెంకటేశ్వర కళాశాల,[7] చివరి సంవత్సరం హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసాడు.[1]

కెరీర్

మార్చు

ఎంటీవిలో రోడీస్‌ షోతో పాపులర్‌ అయిన ఆ తర్వాత ఆయన పలు రియాల్టీ షోలు చేసాడు. హిందీలో అక్షయ్‌కుమార్‌తో తీస్‌మార్‌ఖాన్‌ (2010), జాన్‌ అబ్రహంతో కలిసి జూతా హై సహీ చిత్రాల్లో నటించాడు. ఇక తమిళ చిత్రం డాక్టర్‌లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇదే చిత్రం తెలుగులో వరుణ్ డాక్టర్ (2021)గా విడుదలైంది. తరుణ్‌భాస్కర్‌ తెరకెక్కించి, 2023 నవంబరు 3న విడుదల కానున్న కీడాకోలా (2023)తో ఆయన తొలిసారి తెలుగు సినిమాలో నటించాడు.[8]

అతని నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది.[9] అతను "మన్మణి" పాట కోసం గ్లోబల్ ఇండియన్ మ్యూజిక్ అకాడమీ అవార్డ్స్ (GIMA ) 2012లో ఉత్తమ గాయకుడు అవార్డుకు కూడా ఎంపికయ్యాడు.[10]

వ్యక్తిగతం

మార్చు

ఆయన నటి సుగంధ గర్గ్ని వివాహం చేసుకున్నాడు. అతనికి ఒక కవల సోదరుడు, రాజీవ్ లక్ష్మణ్ అతనితో కలిసి ఎంటీవి రోడీస్‌లో పనిచేశాడు. సోదరులు మోనోజైగోటిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో వారి స్వంత కంటెంట్ స్టూడియోను 2014లో ప్రారంభించారు.[11]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 10 Minutes To 1. "Take risks in your life. If you win you can lead ! If you loose, you can guide". The Economic Times. Retrieved 2016-09-06.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Chaurasia, Ankita (6 January 2016). "Reason behind Raghu Ram-Sugandha Garg's divorce revealed". The Times of India. Retrieved 2016-09-06.
  3. A Correspondent (12 May 2016). "All in a day's work: Raghu Ram takes on Narendra Modi, Modi bhakts and BJP". Mid-day. Retrieved 2016-09-06.
  4. Gupta, Yatin (22 February 2014). "'Rearview, My Roadies Journey' is all things about Raghu and Roadies". News18. Retrieved 2016-09-06.
  5. "Book Review : Raghu - Rearview My Roadies Journey". Errors And Kaushal. Retrieved 2016-10-08.
  6. Jain, Saudamini (24 November 2013). "Raghu Ram, the nudest man on Indian television". Hindustan Times. Retrieved 2016-09-06.
  7. Gupta, Yatin (22 February 2014). "'Rearview, My Roadies Journey' is all things about Raghu and Roadies". News18. Retrieved 2016-09-06.
  8. "మా కంటే ఎక్కువ ఆస్వాదిస్తారు ప్రేక్షకులు |". web.archive.org. 2023-10-29. Archived from the original on 2023-10-29. Retrieved 2023-10-29.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  9. Adarsh, Taran. "Jhootha Hi Sahi Plastic chemistry, lifeless music". Sify. Archived from the original on 25 September 2015. Retrieved 2016-09-06.
  10. "Not just a show host: There's more to know about Raghu Ram". India Today. 14 April 2015. Retrieved 2016-09-06.
  11. TNN (30 July 2014). "Raghu Ram and Rajiv Lakshman set to launch their next project". The Times of India. Retrieved 2016-09-06.
"https://te.wikipedia.org/w/index.php?title=రఘురామ్&oldid=4188081" నుండి వెలికితీశారు